బ్లడ్ క్యాన్సర్ అంటే ఏమిటి?
బ్లడ్ క్యాన్సర్ శరీరంలో రక్త కణాల అభివృద్ధిలో ఇబందులు కలిగిస్తుంది, తద్వారా శరీరం యొక్క సాధారణ విధులు (అంటువ్యాధులకు వ్యతిరేకంగా పోరాడడం, హీమోస్టాసిస్, లేదా రిపేర్ ఫంక్షన్) దెబ్బతింటాయి. ఇది అనేక లక్షణాలకు దారితీస్తుంది. బ్లడ్ క్యాన్సర్ లో 3 ప్రధాన రకాలు ఉంటాయి మైలోమా, ల్యుకేమియా మరియు లింఫోమా. అవి ప్లేట్లెట్లు, తెల్ల రక్త కణాలు మరియు లింఫోసైట్లు అను 3 వివిధ రకాలైన కణాలు క్యాన్సర్తో ప్రభావితం కావడం వలన సంభవిస్తాయి.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
బ్లడ్ క్యాన్సర్ సంకేతాలు మరియు లక్షణాలు మారుతూ ఉంటాయి, సాధారణంగా కనిపించే లక్షణాలు ఈ విధంగా ఉంటాయి
- ఆకస్మిక మరియు అర్ధం కాని బరువు తగ్గుదల
- అలసట లేదా తీవ్రమైన నీరసం
- ముఖ్యంగా రాత్రి సమయాలలో అధిక చెమటలు
- పునరావృత్తమయ్యే సంక్రమణలు
- ఎముక నొప్పి మరియు / లేదా కీళ్ళ నొప్పి
- చర్మ దురద, సులభంగా కమలడం మరియు / లేదా రక్తస్రావం సంభవించడం జరుగుతుంది
- తల, మెడ, గజ్జలు, లేదా కడుపులో వాపు లేదా గడ్డలు ఏర్పడటం
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
బ్లడ్ క్యాన్సర్లు ప్రధానంగా జీన్ మ్యుటేషన్లు (జన్యు మార్పులు) లేదా డిఎన్ఏ (DNA) లో లోపాల కారణంగా ఏర్పడతాయి. ఈ జీన్ మ్యుటేషన్ల కారణం తెలియదు కుటుంబ చరిత్ర, వయస్సు, లింగం, జాతి, లేదా ఆరోగ్య సమస్యలు ఇటువంటి అంశాలతో ముడిపడి ఉండవచ్చు. ఇది కొన్ని రకాల రసాయనాలు లేదా రేడియేషన్ కు బహిర్గతం/గురికావడం వంటి చరిత్ర ఉండడం వంటి వాటితో కూడా ముడిపడి ఉండవచ్చు.
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
సాధారణంగా, బ్లడ్ కాన్సర్ ఇతర వ్యాధుల కోసం రక్త పరీక్ష జరిపినప్పుడు అనుకోకుండా బయటపడుతుంది. లక్షణాల ఆధారంగా వైద్యులు ఈ కింది పరీక్షలు సూచిస్తారు:
- రక్త పరీక్షలు
- పెరిఫెరల్ బ్లడ్ ఫిల్మ్ (Peripheral blood film)
- సంపూర్ణ రక్త గణన (FBC, Full blood count)
- ఇన్ఫెక్షన్ స్క్రీనింగ్ / వైరాలజీ పరీక్ష (Infection screening/virology testing)
- యూరియా మరియు ఎలెక్ట్రోలైట్లు
- కాలేయ పనితీరు పరీక్షలు (Liver function tests)
- ఫ్లో సైటోమెట్రీ (ఇమ్యునోపెనోటైపింగ్) [Flow cytometry (immunophenotyping)]
- సైటోజెనెటిక్ పరీక్ష (Cytogenetic testing)
- ఎముక మజ్జ మరియు శోషరస కణుపుల జీవాణుపరీక్ష (Bone marrow and lymph node biopsy)
- స్కాన్లు
- ఎక్స్-రేలు
- అల్ట్రాసౌండ్
- కంప్యూటెడ్ టోమోగ్రఫీ (CT)
- మాగ్నెటిక్ రెసోనెన్స్ ఇమేజింగ్ (MRI)
బ్లడ్ క్యాన్సర్ నిర్వహణ కోసం వివిధ స్థాయిలలో చికిత్స ఉంటుంది
- హై-ఇంటెన్సిటీ ట్రీట్మెంట్ (అధిక తీవ్రత ఉండే చికిత్స)- క్యాన్సర్ కణాల వ్యాప్తిని నివారించడానికి లేదా చంపడానికి బలమైన మందులను ఉపయోగిస్తారు. వాటిలో ఇవి ఉంటాయి
- అధిక లేదా ప్రామాణిక మోతాదులో కీమోథెరపీ (తక్కువ-తీవ్రత చికిత్సలో తక్కువ మోతాదు ఉపయోగిస్తారు)
- రేడియేషన్ లేదా శస్త్రచికిత్స
- స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ (Stem cell transplant)
- వీటి యొక్క ఉపయోగం (అలాగే తక్కువ తీవ్రత ఉన్న చికిత్సగా కూడా ఉపయోగించవచ్చు)
- మోనోక్లోనల్ యాంటీబాడీలు
- బయోలాజికల్ చికిత్స (Biological therapy)
- ఇమ్మ్యూనోథెరపీలు (Immunotherapies)