అలసట అంటే ఏమిటి?

అలసట అనేది విశ్రాంతి తీసుకున్న కూడా తగ్గని ఒక అలుపు మరియు బడలిక. నిద్రలో ఆటంకాలు, ఆహారం లేదా రోజు వారి చర్యలలో మార్పులు, అనారోగ్యం, అధిక శ్రమ కారణంగా అలసట సంభవిస్తూ ఉంటుంది మరియు సాధారణంగా అది విశ్రాంతితో మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక/ తీవ్రమైన  అలసట ఒక ఖచ్చితమైన కారణం లేకుండా సంభవిస్తుంది మరియు 6 నెలల కంటే ఎక్కువగా కొనసాగుతుంది. మానసిక కలత కూడా తరచుగా అలసట లేదా దీర్ఘకాలిక అలసట వ్యాధితో ముడి పడి ఉంటుంది.

దాని ప్రధాన సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

అలసటతో సంబంధం ఉన్న అనేక సంకేతాలు మరియు లక్షణాలలో, కొన్ని ముఖ్యమైనవి ఈ విధంగా ఉంటాయి:

  • అలసట  క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్ (దీర్ఘకాలిక అలసట వ్యాధి) లేదా మైయాల్జిక్ ఎన్సెఫలోమైయోలిటీస్ (ME, myalgic encephalomyelitis) యొక్క ఒక ముఖ్యమైన లక్షణాలువీటిని కలిగి ఉంటాయి:
    • అలసట సంభవిచడానికి ముందు చేయగలిగిన రోజువారీ కార్యకలాపాలను చేపట్టే సామర్థ్యంలో గణనీయమైన తగ్గుదల.
    • మైయాల్జిక్ ఎన్సెఫలోమైయోలిటీస్ (ME) సంభవిచడానికి ముందు చేసిన సాధారణ రోజువారీ కార్యకలాపాలు తర్వాత తీవ్ర నీరసం/అలసట.
    • విశ్రాంతి మరియు నిద్ర తర్వాత కూడా అలసటకు ఉపశమనం లేకపోవడం.
    • మానసిక లేదా శారీరక శ్రమ తర్వాత కొన్నిరోజుల పాటు ఉండే అలసట మరియు ఇతర లక్షణాలు.
  • జ్ఞాపకశక్తి మరియు ఆలోచన శక్తిలో సమస్యలు, ఏకాగ్రత పెట్టడంలో కష్టం మరియు భావోద్వేగ సున్నితత్వం పెరగడం
  • నిద్ర క్రమాలు తారుమారు కావడం(అధిక నిద్ర, నిద్ర లేకపోవడం, నిద్రలో కలతలు)
  • తలనొప్పి, మైకము మరియు అస్పష్టమైన దృష్టి (కంటి చూపు)
  • కండరాల మరియు కీళ్ళ నొప్పిలు మరియు శక్తి లేకపోవడం
  • తరచుగా గొంతునొప్పి
  • జీర్ణక్రియలో సమస్యలు (మరింత సమాచారం: అజీర్ణం యొక్క చికిత్స)
  • ఫ్లూ వంటి లక్షణాలు
  • లింఫ్ నోడ్స్ (శోషరసగ్రంథులు) లో నొప్పులు మరియు అవి  సున్నితంగా ఉండవచ్చు

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

అలసటకు వివిధ కారణాలు ఉన్నాయి:

ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

అలసట యొక్క వివిధ కారణాలు తెలుసుకునేందుకు వైద్యులు వివిధ ప్రయోగశాల పరీక్షలు మరియు ఇతర పరిశోధనలు నిర్వహిస్తారు.  ఏవిధమైన ఖచ్చితమైన కారణం లేకుండానే అలసట ఉంటే దాని నిర్ధారణకు మునుపటి ఆరోగ్య చరిత్ర మరియు శారీరక పరీక్ష ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

  • మునుపటి ఆరోగ్య చరిత్రకు  సంబంధించి:
    • లక్షణాల యొక్క ప్రారంభం మరియు వ్యవధి
    • రోజు వారి దినచర్య, ప్రేరేపకాలు (ట్రిగ్గర్లు), మునుపటి వ్యాధులు మరియు చికిత్సలు మొదలైనవి
  • శారీరక పరీక్షలో ఇవి ఉంటాయి:
    • శోషరస కణుపుల (lymph nodes) పరీక్ష మరియు పాదం వాపు కోసం తనిఖీ చేయడం
    • హృదయ స్పందనలు మరియు శ్వాసలో అసాధారణతల తనిఖీ కోసం ఛాతీ పరీక్ష
    • నాడీ వ్యవస్థ మరియు థైరాయిడ్ గ్రంధి యొక్క పరీక్ష
  • పరిశోధనలు (Investigations) మరియు ప్రయోగశాల పరీక్షలు వీటిని కలిగి ఉంటాయి:
    • రక్త పరీక్ష: పూర్తి రక్త గణన (CBC, Complete blood count), ఎరిత్రోసైట్ సెటిమెంటేషన్ రేట్ (ESR, erythrocyte sedimentation rate) మరియు థైరాయిడ్ ప్రొఫైల్ (thyroid profile)
    • మూత్ర పరీక్షలు
    • ఛాతీ ఎక్స్-రే మరియు ఎలెక్ట్రో కార్డియోగ్రామ్ (ECG,electrocardiogram)
  • అలసట కారణంపై ఆధారపడి ఇతర ప్రత్యేక పరీక్షలు ఉంటాయి

చికిత్స వీటిని కలిగి ఉంటుంది:

  • అలసటకు బాధ్యత వహించే  కారణానికి చికిత్స
    • క్యాన్సర్, ఇన్ఫెక్షన్లు, నిరాశ, థైరాయిడ్ సమస్యలు మొదలైన వాటికి సంబంధించిన మందులు.
  • వీటి ద్వారా లక్షణాల యొక్క నిర్వహణ
    • తగినంత క్రమమైన వ్యాయామం
    • చిన్నచిన్న అంకాలుగా పనిని విభజించడం
    • పని చేసేటప్పుడు తరచూ విరామాలు తీసుకోవడం
    • ఒక సమయంలో చిన్న చిన్న పనులను చేపట్టడం
    • ధ్యానం మరియు యోగ
    • తగినంత విశ్రాంతి మరియు నిద్ర

Dr.Vasanth

General Physician
2 Years of Experience

Dr. Khushboo Mishra.

General Physician
7 Years of Experience

Dr. Gowtham

General Physician
1 Years of Experience

Dr.Ashok Pipaliya

General Physician
12 Years of Experience

Medicines listed below are available for అలసట. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.

OTC Medicine NamePack SizePrice (Rs.)
myUpchar Ayurveda Urjas T-Boost Capsule60 Capsule in 1 Bottle499.0
myUpchar Ayurveda Urjas Energy & Power Capsule60 Capsule in 1 Bottle719.0
Sprowt Korean Red Ginseng 1000mg Capsules For Men, Supports Brain Function, Boosts Energy & Immunity100 Capsule in 1 Bottle466.0
Urjas Ashwagandha Tablet by myUpchar Ayurveda60 Tablet in 1 Bottle347.0
Sprowt Multivitamin with Probiotics - 45 Ingredients Improves Immunity, Gut Health, Good For Bones & Joint Health60 Tablet in 1 Bottle446.0
Myupchar Ayurveda Prajnas Women Health Capsule60 Capsule in 1 Bottle719.0
Sprowt Vitamin B12 Supplement For Blood Support, Helps Reduce Tiredness & Fatigue For Women & Men120 Tablet in 1 Bottle446.0
myUpchar Ayurveda Prajnas Capsule Fertility Booster For Men & Women60 Capsule in 1 Bottle892.0
Myupchar Ayurveda Kumariasava 450ml450 ml Asava in 1 Bottle379.0
Ayusya Wheat Grass300 ml Juice in 1 Bottle270.0
Read more...
Read on app