జలోదరం అంటే ఏమిటి?

ఉదరం మరియు ఉదర అవయవాలకు మధ్య ఖాళీలో ద్రవం చేరుకోవడం అనేది జలోదరాన్ని సూచిస్తుంది. ఇది ప్రధానంగా కాలేయ వ్యాధి, సిర్రోసిస్ తో సంబంధం కలిగి ఉంటుంది, ప్రధానంగా కాలేయం లేదా కొవ్వు కాలేయాల (fatty liver) వైరల్ సంక్రమణ వలన వచ్చే ఊబకాయం, మరియు మధుమేహంతో సంభవించవచ్చు. సిర్రోసిస్ ఉన్న సుమారు 80% రోగులలో జలోదరం అభివృద్ధి చెందుతుంది. భారతదేశంలో, కాలేయ వ్యాధుల ప్రాబల్యం గురించి తగినంత అవగాహన, విచారణ మరియు నైపుణ్యం లేకపోవటం వల్ల స్పష్టంగా తెలియలేదు, జలోదరం యొక్క ప్రాబల్యం 10-30% గా ఉంది.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

జలోదరం లక్షణాలు నెమ్మదిగా లేదా ఆకస్మికంగా కారణం బట్టి కలుగవచ్చు. ద్రవం పరిమాణం తక్కువ ఉంటే లక్షణాలు ముఖ్యముగా కనిపించకపోవచ్చు. అయినప్పటికీ, అధిక ద్రవ పరిమాణం శ్వాసకు ఇబ్బంది కలిగిస్తుంది.

ఇతర లక్షణాలు:

చికిత్స చేయకుండా వదిలేసినట్లయితే మరింతగా సంభవించే సంక్లిష్టతలు క్రింది విధంగా ఉంటాయి:

  • బాక్టీరియల్ పెర్టోనిటిస్ (Bacterial peritonitis)
  • డైల్యునల్ హైపోనట్రేమియా (Dilutional hyponatraemia)
  • హెపటోరేనల్ సిండ్రోమ్ (Hepatorenal syndrome)
  • యంబిలికల్ హెర్నియా (Umbilical hernia)

దాని ప్రధాన కారణాలు ఏమిటి?

వివిధ సమస్యల ఫలితంగా జలోదరం సంభవిస్తుంది. దానిలో సిర్రోసిస్ (Cirrhosis) అత్యంత సాధారణమైనది, ఇది రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది, ఫలితంగా కాలేయ ప్రధాన రక్తనాళాల్లో ఒత్తిడి పెరిగిపోతుంది. మూత్రపిండాలకు మూత్రం ద్వారా అదనపు ఉప్పును తొలగించడంలో సామర్ధ్యం తగ్గిపోతుంది దానితో మూత్రపిండాలలో ద్రవం అధికంగా చేరిపోతుంది. ఇది జలోదరాన్ని కలిగించి అల్బుమిన్ (రక్త ప్రోటీన్) యొక్క తక్కువ స్థాయిలకు దారి తీస్తుంది. కాలేయానికి నష్టాన్ని కలిగించే కారణాలు జలోదర వ్యాధికి దారితీయవచ్చు.

ఉదాహరణలు:

  • దీర్ఘకాలిక హెపటైటిస్ B లేదా C సంక్రమణ (ఇన్ఫెక్షన్)
  • మద్యం అతిగా సేవించడం
  • కొన్ని క్యాన్సర్లు: అంత్రం (appendix), పెద్దప్రేగు, అండాశయాలు, గర్భాశయం,పిత్తాశయం(pancreas) మరియు కాలేయం

ఇతర ఉదాహరణలు

ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

కడుపులో వాపును తనిఖీ చేయటానికి మొదట్లో ఒక భౌతిక పరీక్ష నిర్వహిస్తారు.

  • ద్రవ నమూనా
  • సంక్రమణ (ఇన్ఫెక్షన్) లేదా క్యాన్సర్ ఉనికిని తనిఖీ చేయటానికి ద్రవాన్ని బయటకి తీసి చూడడం అవసరమవుతుంది
  • విశ్లేషణ కోసం ద్రవాన్ని తీసివేయడానికి ఉపయోగించే ప్రక్రియని పారాసెంటేసీస్(paracentesis) అంటారు.

​ప్రతిబింబనం (ఇమేజింగ్)

  • ఎంఆర్ఐ (MRI), సిటి (CT), లేదా ఉదరం యొక్క అల్ట్రాసౌండ్

కాలేయ మరియు మూత్రపిండాల పనితీరు అంచనా పరీక్షలు

  • 24-గంటల సమయ మూత్రం సేకరణ (Urine collection for a 24-hour period)
  • ఎలక్ట్రోలైట్ స్థితి (Electrolyte status)
  • మూత్రపిండాల పనితీరు పరీక్షలు (Kidney function tests)
  • కాలేయ పనితీరు పరీక్షలు (Liver function tests)
  • గడ్డ కట్టే స్థితి (Clotting status)

ఈ చికిత్స ప్రధానంగా శరీరం నుండి అదనపు ద్రవాన్ని తొలగించే ఔషధాలను కలిగి ఉంటుంది మరియు ఏవైనా ఇన్ఫెక్షన్లు ఉంటె యాంటీబయాటిక్స్.

డాక్టర్ సిఫార్సు శస్త్రచికిత్స విధానాలు :

  • అదనపు ద్రవాలను తొలగించడం
  • కాలేయ రక్త ప్రవాహాన్ని సరిచేయడానికి కాలేయంలో ఒక ప్రత్యేకమైన ట్రాన్స్జ్యూజికల్ ఇంట్రాహెపటిక్ పోర్టోసిస్టమిక్ షంట్ ( transjugular intrahepatic portosystemic shunt)ని ఉపయోగించడం

జీవనశైలి సవరింపులు:

  • మద్యం మానివేయాలి, అది కాలేయాన్ని మరింతగా దెబ్బతీస్తుంది, తద్వారా పరిస్థితిని తీవ్రతరం చేస్తుంది
  • ఆహారంలో ఉప్పు శాతాన్ని తగ్గించాలి (సోడియం 1,500 mg / రోజుకు, కంటే ఎక్కువ ఉండరాదు). పొటాషియం పదార్థాలు లేని ఉప్పు ప్రత్యామ్నాయాలు ఉపయోగపడతాయి
  • ద్రవం తీసుకోవడం తగ్గించాలి

జలోదరం ఒక వ్యాధి కాదు కానీ శరీరానికి నష్టాన్ని కలిగించే సరిలేని జీవనశైలుల ఎంపికల కారణంగా ఏర్పడే పరిస్థితి. మందులు మరియు జీవనశైలి మార్పులను సరిగ్గా అనుసరిస్తే, ఈ సమస్యను చాలా వరకు తగ్గించవచ్చు.

Dr.Vasanth

General Physician
2 Years of Experience

Dr. Khushboo Mishra.

General Physician
7 Years of Experience

Dr. Gowtham

General Physician
1 Years of Experience

Dr.Ashok Pipaliya

General Physician
12 Years of Experience

Medicines listed below are available for జలోదరం (పొట్టలో నీరు చేరడం). Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.

OTC Medicine NamePack SizePrice (Rs.)
Baidyanath Kravyad Ras (20)20 Ras Rasayan in 1 Bottle86.0
Schwabe Cinnamomum Dilution 200 CH30 ml Dilution in 1 Bottle92.4
SBL Cinnamomum Mother Tincture Q30 ml Mother Tincture in 1 Bottle102.5
Zandu Avipatikar Churna Powder60 gm Powder in 1 Bottle111.0
Bakson Alfalfa Tonic 450ml450 ml Liquid in 1 Bottle259.25
ADEL Alfalfa Tonic with Ginseng100 ml Syrup in 1 Bottle290.4
Bakson Alfalfa Sugar Free Tonic 450ml450 ml Liquid in 1 Bottle289.0
Bakson Alfalfa Tonic 115ml115 ml Liquid in 1 Bottle110.5
REPL Dr. Advice No.24 Cancetron Drop30 ml Drops in 1 Bottle153.0
Schwabe Cinnamomum Dilution 1000 CH30 ml Dilution in 1 Bottle102.0
Read more...
Read on app