ప్రతీ సారి మనం బరువు తగ్గింపు గురించి ఆలోచించినప్పుడు, ఇది అసాధ్యమైన పని వలే కనిపిస్తుంది. మనం క్యాలరీలను తీసుకోవడం తగ్గించడానికి కట్టుబడి ఉండాలనుకొంటాం, కానీ మనం బయటకు వెళ్లిన వెంటనే మన కళ్ళు నగరం యొక్క ప్రతి మూలలోని రుచిగల/ తీపి ఆహారం గురించి వెతుకుతాము. అయినప్పటికీ, ఈ ఆహారం అంత ఆరోగ్యకరమైనది కాదు ఎందుకంటే ఇది బరువు పెరుగుటకు దారితీస్తుంది.
మీరు బరువు తగ్గాలనుకుంటే, మీరు ఆహారపు చార్ట్‌ని అనుసరించాలి మరియు ఆరోగ్యకరమైన ఆహారం తినడం ప్రారంభించాలి. మీరు మీ ఆహారంలో తక్కువ కేలరీల ఆహారాన్ని జోడించినట్లయితే, ఇది బరువును తగ్గించడంలో మీకు సహాయం చేయడo మాత్రమే కాకుండా గుండెకు కూడా చాలా మంచిది.
ఈ వ్యాసం సరిగ్గా ఏమి తినాలి మరియు ఎప్పుడు తినాలి అనేది తెలియజేసే ఒక ఫుడ్ చార్ట్‌ని అందిస్తుంది. ఇది ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు మరియు విటమిన్ల యొక్క మంచి కలయికను మీకు అందిస్తుంది. అంతేకాక, ఏది తినవచ్చు మరియు ఏది తినకూడదు, మరియు మీరు ప్రత్యామ్నాయాలుగా వేటిని తీసుకోవచ్చు అనే వాటిని తెలుసుకొనుటకు ఈ ఫుడ్ చార్ట్ అనుసరించడం మీకు సులభంగా ఉంటుంది.