శరీర కొవ్వులలో కడుపులో పెరిగే కొవ్వు ఒకటి, దీని గురించిన అవగాహన చాలా మందికి ఉండడంతో దీనిపట్ల జాగరూకులై ఉంటారు. పొట్ట కొవ్వును తగ్గించుకోవడం అంటే మనం తినే ఆహారం మరియు కొన్ని వ్యాయామాలే (కీలకం) అని మనలో చాలా మంది నమ్ముతారు, కానీ అది కేవలం అంత మాత్రమే కాదు. కడుపు ఉబ్బడం అంటే మీ కడుపులో అధికంగా పేరుకుపోయిన కొవ్వు యొక్క పరిమాణం. పొట్టలో కొవ్వులు పేరుకుపోవడానికి ఇతర కారణాలేవంటే వేళకాని వేళలో (తప్పు సమయంలో) భారీ భోజనం చేయడం, మలబద్ధకం, ద్రవం నిలుపుకోవడం లేదా మహిళల విషయంలో మీ బహిష్టుకు పూర్వ (ప్రిమెన్స్ట్రుయల్)  లక్షణాలు కూడా ఉండవచ్చు. కొవ్వు కడుపుతో కలిగే ప్రమాదాలు మరియు దానిని సమర్థవంతంగా తగ్గించే గృహ చిట్కాల (ఇంటి నివారణల) గురించి ఈ వ్యాసంలో చర్చించబడ్డాయి.

  1. పొట్ట కొవ్వుతో ముడిపడి ఉండే ప్రమాదాలు - Harms associated with belly fat in Telugu
  2. బానపొట్టను తగ్గించడానికి గృహ చిట్కాలు - Home remedies to reduce the belly fat in Telugu
  3. ఉపసంహారం - Takeaway in Telugu
బానపొట్ట కొవ్వును తగ్గించి, చదునైన పొట్టను ఎలా పొందాలి వైద్యులు

పొత్తికడుపున పేరుకుపోయే కొవ్వులున్నపుడు వ్యక్తికి తీవ్రమైన ఆరోగ్య పరిణామాలను కలిగిస్తుంది. కొవ్వు పెరిగిన పొట్టను మోయడం మీ విగ్రహరూపాన్ని (stature look) దెబ్బ తీయడమే కాకుండా ప్రాణాంతకమైన ఆరోగ్య రుగ్మతలకు దారితీయవచ్చు. మీకు బానకడుపు వచ్చేసి లోపల కొవ్వు పెరిగిఉన్నప్పుడు, మీరు చక్కెరవ్యాధి (డయాబెటిస్), గుండె నరాలకు సంబంధించిన గుండె జబ్బులు (కొరోనరీ హార్ట్ డిసీజెస్), అధిక రక్తపోటు (హై బ్లడ్ ప్రెజర్) లేదా క్యాన్సర్‌కు కూడా ఎక్కువగా గురవుతారని పరిశోధనల్లో తేలింది. రక్త నాళాల్లోపల (ధమనుల్లోపల) ఏర్పడే కొవ్వు రక్త నాళాల్లో రక్తం గడ్డకట్టి అడ్డు పడటానికి దారితీస్తుందని మరియు గుండె పోటు (స్ట్రోక్) రావడానికి ఒక ప్రమాద కారకంగా మారుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

శరీరంలో అధిక కొవ్వులు పేరుకుపోవడంవల్ల సంభవించిన కీళ్ల వ్యాధులు (ఆస్టియో ఆర్థరైటిస్), కాలేయవాపు (కాలేయంలో కొవ్వు పెరిగి పోవడం) మరియు కుంగుబాటు వంటి వ్యాధులను హార్వర్డ్ మెడికల్ స్కూల్ నివేదించింది. మీ పొట్టలో పెరిగిన కొవ్వుల్ని తగ్గించడానికి కొవ్వు కరుగుదల (fat burning) పేరున మీరు కొన్ని చిట్కాలను జాగ్రత్తగా పాటించాలి. కాని, దీనికి ముందు, మీ శరీరంలో, పొట్టలో ఎంతమటుకు అదనపు కొవ్వు పెరిగిందో మీరు ఎల్లప్పుడూ అంచనా వేయవచ్చు.

పొట్టలో పెరిగే (విసెరల్) కొవ్వు పరిమాణాన్ని (శరీరంలో పెరిగే కొవ్వు కాదు) కొలిచే అత్యంత సాధారణ సాంకేతికత ఏదంటే ‘కంప్యూటెడ్ టోమోగ్రఫీ’ (సిటి) లేదా ‘మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్’ (ఎంఆర్‌ఐ) ను ఉపయోగించడం, అయితే ఈ చెక్-అప్‌లు ఖరీదైనవి, అదొక్కటి ఒకింత సమస్యే.

నడుము నుండి తుంటి నిష్పత్తి (WHR) ని కొలవడం అనేది మరొక పద్ధతి, దీన్ని శరీర కేంద్ర ఊబబకాయాన్ని మరియు కడుపు లోపల కొవ్వును కొలవడానికి ఒక పద్ధతిగా శాస్త్రవేత్తలు నివేదించారు. నడుము నుండి తుంటి నిష్పత్తి (WHR) పద్ధతిని ఉపయోగించి కడుపు కొవ్వుతో కలిగే నష్టాలైన డయాబెటిస్ 2 మరియు గుండె సంబంధ వ్యాధులు వంటి రుగ్మతల్ని కూడా అంచనా వేయవచ్చు.

Weight Loss Juice
₹539  ₹599  10% OFF
BUY NOW

మీరు మీ కడుపు కొవ్వును అంచనా వేసినారా లేదా అనేదానితో సంబంధం లేకుండా, చదునైన (ఫ్లాట్) పొట్టను పొందడానికి మీరు ఈ కింది సాధారణ గృహ చిట్కాలను ఉపయోగించవచ్చు. దిగువ సూచికల (పాయింటర్లు) ద్వారా మీరు కోరుకునే చదునైన (ఫ్లాట్) పొట్టను పొందడానికి కొన్ని చిట్కాలను మీకు అందిస్తున్నాం.

పొట్ట కొవ్వును తగ్గించడానికి పుష్కలంగా నీరు త్రాగాలి - Drink plenty of water to reduce belly fat in Telugu

తగినంత నీరు త్రాగటం వల్ల శరీర బరువు మరియు శరీర కొవ్వు తగ్గవచ్చు, కానీ మీరు కొవ్వు తగ్గించే వ్యాయామాలను కూడా చేయాల్సి ఉంటుంది.  శాస్త్రవేత్తల ప్రకారం, మిమ్మల్ని మీరు తగినంతగా జాలీకరణంతో (హైడ్రేట్ గా) ఉంచుకోవడం వల్ల జీవాణువుల (సెల్) జీవక్రియ పెరుగుతుంది మరియు అందువల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది. 2013 లో నిర్వహించిన ఒక అధ్యయనం, నిల్వగా పేరుకుపోయిన కొవ్వును శక్తిగా జీవక్రియ చేయడానికి నీరు సహాయపడుతుందని పేర్కొంది. నిర్జలీకరణ విషయంలో, శరీరం యొక్క జీవక్రియ మందగిస్తుంది, ఫలితంగా మీ పొట్టలో కొవ్వు పేరుకుపోతుంది.

మోతాదు: ప్రతిరోజూ 2-3 లీటర్ల నీరు తాగడం మంచిది.

పొట్ట కొవ్వు తగ్గడానికి వేడి నీరు మరియు నిమ్మకాయ - Hot water and lemon to lose belly fat in Telugu

పొట్టలోని కొవ్వును తగ్గించడానికి నిమ్మకాయ రసాన్ని ఉదయాన్నే వేడి నీటిలో కలుపుకుని తాగుతారు. వేడి నీటిని నిమ్మకాయ రసానికి చేర్చడంవల్ల శరీరానికి వేడి చికిత్సను ఇస్తుందని మరియు ఈ సిట్రస్ పండు యొక్క అనామ్లజనక (యాంటీఆక్సిడెంట్) చర్యను పెంచుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. మరో పరిశోధన ప్రకారం, నిమ్మకాయలో పాలీఫెనాల్స్ ఉన్నాయి, ఇవి ఆహారం ద్వారా ప్రేరేపించబడిన శరీర కొవ్వును అణిచివేస్తాయి. కాబట్టి, మీరు ఈ పానీయాన్ని మంచి జీవక్రియ మరియు మంచి ఆకృతిని కలిగి ఉండటానికి తీసుకోవచ్చు.

మోతాదు: ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో తేనెతో పాటు నిమ్మకాయ రసం చేర్చి సేవించడం సిఫార్సు చేయబడింది.

పొట్టలోని కొవ్వును వదిలించుకోవడానికి నెమ్మదిగా తినండి, బాగా నమలండి - Eat slower, chew better to get rid of belly fat in Telugu

మీ ఆహారాన్ని చాలా త్వరగా తినడం మరియు బాగా నమలక పోవడం అనేవి గాలిని మింగడానికి కారణమవుతాయి, తద్వారా కడుపు ఉబ్బరానికి దారితీస్తుంది. కాబట్టి మీకు ఇష్టమైన ఆహారాల్ని చూడగానే గబ గబా వేగంగా తినేయకుండా  కొంత ఓపిక పట్టండి, ఇష్టమైన ఆహారం యొక్క రుచిని గ్రహించి ఆస్వాదిస్తూ నెమ్మదిగా తినవచ్చు మీరు. వేగంగా తినడం వక్రీకరించిన జీవక్రియ, రక్తపోటు సమస్యలు, అధిక కొలెస్ట్రాల్ మరియు అధిక కడుపు కొవ్వుతో సంబంధం కలిగి ఉంటుంది.

మీరు ఇకపైన భోంచేసేటపుడు మీరు మీ ఆహారాన్ని మింగడానికి ముందు కనీసం 35-45 సార్లు నమలడానికి ప్రయత్నం చేయండి.

పొట్టలో కొవ్వును తగ్గించడానికి కార్బోనేటేడ్ పానీయాలకు దూరంగా ఉండండి - Stay away from carbonated drinks to reduce the belly fat in Telugu

మార్కెట్లో లభించే రెగ్యులర్ శీతల పానీయాలు హై-ఫ్రక్టోజ్ కార్న్ సిరప్‌తో తయారవుతాయి. దీనివల్ల, మన కాలేయానికి ఈ శీతల పానీయాలను జీవక్రియ చేయడం కష్టం అవుతుంది . ఇంకా, శరీరంలో గ్లూకోజ్ స్థాయి పడిపోవడం వల్ల శీతల పానీయాలు ఎక్కువ ఆకలిని ప్రేరేపిస్తాయి, దీనివల్ల మనకు ఆకలి మరియు కేలరీలు పెరుగుతాయి. ఫ్రక్టోజ్-తీపితో కూడిన పానీయాలు తీసుకోవడం వల్ల కాలేయంలో లిపిడ్ కొవ్వులు చేరడం పెరుగుతుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కాబట్టి, మీరు కార్బోనేటేడ్ పానీయాలకు దూరంగా ఉండడమనే ఈ చిట్కాను పాటించొచ్చు.

పొట్టలో కొవ్వును తగ్గించేందుకు పీచుపదార్థాలు తీసుకోవడాన్ని పెంచండి - Increase fibre intake to lose belly fat in Telugu

ఫైబర్స్ మరియు తక్కువ చక్కెరలు అధికంగా ఉన్న ఆహారం కడుపు కొవ్వును నివారించడానికి మరియు తగ్గించడానికి మీకు సహాయపడుతుంది. హార్వర్డ్ మెడికల్ స్కూల్ శాస్త్రవేత్తలు 12 సంవత్సరాల కాలంలో తమ ఆహారంలో అధిక ఫైబర్ లేదా ధాన్యపు ఆహారాన్ని తీసుకుంటున్న మహిళలు తక్కువ ఫైబర్ ఆహారం తీసుకునేవారిలో సగం కొవ్వుగా మారే అవకాశం ఉందని కనుగొన్నారు. సాధారణంగా, మీ ఆహారంలో రెండు రకాల ఫైబర్ ఉన్నాయి- జీర్ణక్రియకు సహాయపడే కరగని ఫైబర్ మరియు మీ శరీరంలో కొవ్వు మరియు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడే కరిగే ఫైబర్. కరిగే ఫైబర్ ఆహారం గుండె జబ్బులు, డయాబెటిస్ లేదా క్యాన్సర్‌తో బాధపడేవారికి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్‌గా సహాయపడుతుంది.

కాబట్టి, మీ అల్పాహారంలో వోట్స్ వంటి అధిక పీచుపదార్థాలుండే (ఫైబర్) తృణధాన్యాలు, ఉదయానంతర భోజనం (బ్రంచ్‌లో), మధ్యాహ్న భోజనంలో కొన్ని పండ్లు మరియు సలాడ్, కొన్ని పాప్‌కార్న్‌లను స్నాక్స్ గా మరియు గోధుమనూక పొట్టు లేదా ఓట్స్ నూకపొట్టుతో తయారయ్యే చపాతీని మీ రాత్రివిందులో చేర్చాలని మీరు లక్ష్యంగా పెట్టుకోవచ్చు.

చదునైన పొట్టను పొందడానికి చక్కెర తీసుకోవడాన్ని తగ్గించండి - Reduce the sugar intake to get a flat stomach in Telugu

మీ ఆహారం లేదా పానీయాలకు అదనపు చక్కెరను జోడించడం అనారోగ్యంగా ఉంటుంది. ఫ్రక్టోజ్-తీపి (చక్కెర రూపం) ఉత్పత్తులను తీసుకోవడం వల్ల మీకు కడుపులో కొవ్వు పెరుగుతుంది మరియు మీరు చక్కెరవ్యాధి (డయాబెటిస్) బారిన పడే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఫ్రక్టోజ్‌ను జీవక్రియ చేసేది కాలేయం కావడమే దీనికి కారణం. మీరు అధిక పరిమాణంలో అదనపు చక్కెరను తీసుకున్నప్పుడు, కాలేయం ఈ చక్కెర రూపాన్ని జీవక్రియ చేయలేకపోతుంది మరి ఇది కొవ్వుగా శరీరంలో పేరుకుపోతుంది. మీరు శుద్ధి చేసిన చక్కెరల నుండి వైదొలగడానికి ఇది తగినన్ని కారణాలను ఇస్తుంది.

మోతాదు: పోషకాహార నిపుణుల ప్రకారం, రోజుకు ఆహారంలో లేదా పానీయాలలో  చక్కెరలను 2 సార్ల కంటే ఎక్కువ తినకూడదని సిఫార్సు చేస్తారు.

పొట్ట కొవ్వు తగ్గించడానికి గ్రీన్ టీ - Green Tea to reduce belly fat in Telugu

గ్రీన్ టీ కేవలం రుచిగల వేడి పానీయమే కాదు, అది అంత కంటే చాలా ఎక్కువ ప్రయోజనాల్నికల్గి ఉంది. ఒక కప్పు గ్రీన్ టీలో దాదాపు 30 గ్రాముల కెఫిన్ ఉంటుంది, ఇది కొవ్వు మరియు లిపిడ్ కొవ్వుల్ని కరిగించేయడానికి పనికొస్తుందని ప్రశంసలు పొందింది. అంతేకాకుండా, గ్రీన్ టీలో క్యాటెచిన్స్ అనే  అనామ్లజనకాలు (యాంటీఆక్సిడెంట్లు) పుష్కలంగా ఉన్నాయి, ఇది జీవక్రియను పెంచుతుంది. గ్రీన్ టీ సారం ఓర్పును  పెంచేందుకు మరియు మీ కొవ్వును ఉత్తేజపరిచేందుకు ఉపయోగపడుతుందని 2005 లో ఒక అధ్యయనం పేర్కొంది. సుమారు 2 నెలలు నిర్వహించిన మరో అధ్యయనం ప్రకారం, సాధారణ వ్యాయామాలతో పాటు కాటెచిన్స్ (గ్రీన్ టీలో ఉంటాయివి) ఎక్కువగా సేవించడంవల్ల కేవలం వ్యాయామాలు చేయడంతో పోలిస్తే ఎక్కువ కొవ్వును కాల్చడానికి సహాయపడింది.

మోతాదు: బరువు తగ్గడానికి గ్రీన్ టీ సేవించే విషయంలో దాని మోతాదు వ్యక్తికి వ్యక్తికి మారుతుంది, కానీ మీ మొండి కడుపు కొవ్వును తగ్గించుకోవడానికి మీరు సగటున 2-3 కప్పుల గ్రీన్ టీ తాగొచ్చు.

పొట్ట కొవ్వు తగ్గడానికి ప్రోటీన్ తీసుకోవడాన్ని పెంచండి - Increase protein intake to lose the belly fat in Telugu

అధిక ప్రోటీన్ ఆహారం జీవక్రియను మెరుగుపరుస్తుంది, ఆకలిని తగ్గిస్తుంది మరియు కొవ్వును కరిగించే ప్రక్రియకు మద్దతునిస్తుంది. పోషకాహార నిపుణులు బరువు తగ్గాలని లక్ష్యంగా పెట్టుకున్న వారికి అధిక ప్రోటీన్ కలిగిన ఆహారాన్ని సిఫార్సు చేస్తారు. కొవ్వు యొక్క థర్మోజెనిసిస్లో ప్రోటీన్లు ప్రధాన పాత్ర పోషిస్తాయని, అందువల్ల శరీర బరువు నియంత్రణ మరియు ఉదర కొవ్వు తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. డైటరీ రిఫరెన్స్ ఇంటేక్ (డిఆర్ఐ) ప్రకారం, సగటున పురుషుడికైతే 56 గ్రాముల ప్రోటీన్లు మరియు స్త్రీకి 46 గ్రాముల ప్రోటీన్లు సేవించే ఆహారంలో ఉండాలి.

కాబట్టి మీరు ఇప్పుడు మీ ప్రోటీన్ డైట్ పెంచుకోవడానికి ఉడికించిన గుడ్లు, కాయధాన్యాలు లేదా పప్పు, ఒక గిన్నె పెరుగు లేదా స్నాక్స్ భోజనం మీ రోజువారీ ఆహారంలో పెంచుకోవచ్చు. కానీ గుర్తుంచుకోండి, మితమనేదిన్ కీలకం. దేనినీ అతిగా తొనొద్దు.

చదునైన పొట్టను పొందడానికి మెంతులు - Fenugreek seeds to get a flat tummy in Telugu

హిందీలో ‘మెథి దానా’ గా చెప్పబడే మెంతులు లేక ‘మెంతి గింజలు’ (Fenugreek seeds) కొవ్వును కరిగించే ఆహారపదార్థం. దీనిలో 49% కరిగే పీచుపదార్థాలు, 49 శాతం కరగని పీచుపదార్థాలు మరియు 2% ప్రోటీన్లు ఉంటాయి, రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం మరియు జీర్ణక్రియకు తోడ్పడటం వంటి అనేక ప్రయోజనాలను కలిగి ఉంటాయి మెంతులు. మెంతులు తినడంవల్ల పేరుకుపోయిన కొవ్వు తగ్గుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఒక అధ్యయనం ప్రకారం, మెంతులలో ప్రోటీన్లు మరియు ఫైబర్ పుష్కలంగా ఉన్నాయని నిరూపించాయి, ఇవి లిపిడ్ కొవ్వుల్ని-తగ్గించే పనిలో సహాయపడతాయి. ఇంకా, మెంతి యొక్క పీచుపదార్థం (ఫైబర్ కంటెంట్ లేక గెలాక్టోమన్నన్) పేగులో జిగట జెల్ను ఏర్పరుస్తుంది మరియు గ్లూకోజ్ మరియు లిపిడ్ శోషణను నివారిస్తుంది.

మోతాదు: మీరు ఒక చెంచా లేదా రెండు చెంచాడ్ల మెంతుల్ని రాత్రిపూట నానబెట్టి ఉదయం ఆ నీటిని వడకట్టి ఖాళీ కడుపొతోనే త్రాగవచ్చు. గర్భిణీ స్త్రీలు దీనిని ఎప్పుడూ తీసుకోకూడదు, ఎందుకంటే ఇది గర్భస్రావం కలిగించొచ్చు. అలాగే, మధుమేహ రోగులు మెంతులు తీసుకోవడం వల్ల వారి రక్తంలో చక్కెర స్థాయిలలో హెచ్చుతగ్గులు ఎదురవుతాయి, కాబట్టి వారు మెంతులు సేవంచాలనుకుంటే ముందు ఒక పోషకాహార నిపుణుడిని సంప్రదించాలి.

పొట్ట కొవ్వు కరిగించుకోవడానికి బొప్పాయి తినండి - Eat Papaya to get rid of belly fat in Telugu

బొప్పాయి ప్రేగు కదలికను మెరుగుపరుస్తుంది మరియు జీర్ణక్రియకు సహాయపడుతుందని మనందరికీ తెలుసు. కానీ ఎలా? బొప్పాయిలో ‘పాపైన్’ అనే జీర్ణకారక ఎంజైమ్ ఉంటుంది, ఇది ప్రోటీన్లను జీర్ణం చేయడానికి సహాయపడుతుంది, జీవక్రియ రేట్లు పెంచుతుంది మరియు కొవ్వును బాగా కరిగిస్తుంది. అంతేకాకుండా, బొప్పాయిలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది, ఇది ప్రేగు లోపల నీటిని ఆకర్షిస్తుంది మరియు మలబద్దకాన్ని నివారిస్తుంది. అలాగే, బొప్పాయి అనామ్లజనకాలకు (యాంటీఆక్సిడెంట్స్) ఓ గొప్ప మూలం, ఇది విషాన్ని తొలగించడానికి సహాయపడుతుంది మరియు లిపిడ్ కొవ్వులు జమవడాన్ని కూడా నిరోధిస్తుంది.

మోతాదు: మీరు ఈ బొప్పాయి పండును ఓ గిన్నె (bowl) నిండుగా అల్పాహారంగా, భోజనం లేదా సాయంకాలం అల్పాహారంగా తినొచ్చు. అల్పాహారం కోసం, మీరు బొప్పాయి పండుతో పాటు కొన్ని ప్రోటీన్లు మరియు తక్కువ సంఖ్యలో కొవ్వుల్ని కూడా తినొచ్చు.

కడుపు కొవ్వును తగ్గించడానికి కలబంద రసం - Aloe Vera juice to reduce belly fat in Telugu

కలబంద రసం, జెల్, పొడి లేదా గుళికల రూపంలో వస్తుంది. ఈ మొక్కలో 75 క్రియాశీలక విటమిన్లు, ఎంజైములు, ఖనిజాలు, కార్బోహైడ్రేట్లు , ప్రోటీన్లు, సాల్సిలిక్ ఆమ్లాలు మరియు సాపోనిన్లు ఉన్నాయి. కలబంద జెల్ పౌడర్‌ను 90 రోజులు వాడటం వల్ల శక్తి వినియోగాన్ని ప్రేరేపించడం ద్వారా శరీర కొవ్వు తగ్గుతుందని ఓ తాజా అధ్యయనం వెల్లడించింది. కలబంద నుండి ఉత్పన్నమైన ఫైటోస్టెరాల్స్ మీ కడుపు యొక్క అంతర-అవయవాల్లోని (విసెరల్) కొవ్వును తగ్గిస్తుందని మరొక అధ్యయనం సూచించింది.

మోతాదు: కాబట్టి మీరు చదునైన పొట్టను (flat belly) పొందడానికి పథ్యంతో కూడిన ఆహారాన్ని (డైట్‌) సేవిస్తుంటే, మీరు ఒక టేబుల్ స్పూన్ తేనెను ఒక గ్లాసు కలబంద రసంలో చేర్చుకుని నిత్యం తాగవచ్చు. ఈ పానీయాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడంతో మీ జీవక్రియను ఉత్తేజపరిచేందుకు, జీర్ణక్రియను ప్రోత్సహించడానికి మరియు అదనపు కొవ్వును కరిగించుకోవడానికి సహాయపడుతుంది. కానీ మీరు ఏ రూపంలోనైనా కలబందను సేవించాలనుకుంటే ముందు మీరు మీ వైద్యుడిని సంప్రదించాలి.

చదునైన పొట్టకు కడుపు వ్యాయామాలు - Stomach exercises to get a flat tummmy in Telugu

మీరు మీ పొట్టను చదును చేయాలనుకుంటే, మంచి ఆహారం (డైట్‌)తో పాటు మీ దినచర్యలో భాగంగా వ్యాయామం లేదా యోగా చేయడం అనేది ఒక మంచి ఉత్తమమైన మార్గం. వ్యాయామం, యోగా అభ్యాసంవల్ల బొజ్జ కొవ్వును కోల్పోవడమే కాకుండా మొత్తం శరీరంలో ఉండే అదనపు కొవ్వుల్ని కోల్పోవడానికి కూడా సహాయపడుతుంది. తగినంతగా వ్యాయామం చేయడం వల్ల శరీర బరువు, మొత్తం శరీర కొవ్వు మరియు కడుపు కొవ్వు గణనీయంగా తగ్గుతాయని పరిశోధనలో తేలింది.

(మరింత చదవండి: అనులోమ విలోమ ప్రయోజనాలు)

వ్యాయామ పరంగా మీరు శక్తి శిక్షణ, కార్డియో, సాగతీత, క్రంచెస్, రన్నింగ్, యోగా, సైక్లింగ్ లేదా ఈతతో సహా వివిధ రకాల వ్యాయామాలను ఎంపిక చేసుకోవచ్చు. మీరు వీలైనప్పుడల్లా మెట్లు ఎక్కి వెళ్ళడానికి కూడా ప్రయత్నించాలి. కొవ్వును కరిగించడానికి ‘క్రంచెస్’ అనే వ్యాయామం బాగా ప్రసిద్ధి పొందింది. సగటున, ఒక రోజులో 40- 60 నిమిషాల పాటు వ్యాయామం తప్పనిసరి.

చదునైన పొట్టను పొందడానికి తగినంతగా నిద్రపోండి - Take enough sleep to get a flat tummy in Telugu

మీరు మీ పొట్టకొవ్వును కోల్పోవాలని అనుకుంటూ ఉంటే, ఇందుకు నిద్ర చాలా ముఖ్యం.  బరువు కోల్పోవడానికి మీరు తినే ఆహారం మరియు చేసే వ్యాయామాల లాగే నిద్ర కూడా అంతే ముఖ్యం. శాస్త్రవేత్తల ప్రకారం, శక్తి జీవక్రియలో నిద్ర ప్రధాన పాత్ర పోషిస్తుంది. తగినంతగా నిద్రపోని వ్యక్తి శరీరంలో కొవ్వు పేరుకుపోయే అవకాశం ఉంది, ఎందుకంటే తక్కువ నిద్ర మీ జీవక్రియకు ఆటంకం కలిగిస్తుంది మరియు బరువు పెరగడానికి దోహదం చేస్తుంది. మరొక అధ్యయనం ప్రకారం,  మీకు తగినంతగా నిద్ర లేనప్పుడు, ‘గ్రెలిన్’ అని పిలువబడే ఆకలి హార్మోన్ యొక్క స్థాయి పెరుగుతుంది మరియు ‘లెప్టిన్’ అని పిలువబడే సంతృప్తి (కడుపు నిండిన సంపూర్ణ అనుభూతి) హార్మోన్ స్థాయిలు తగ్గుతాయి, ఇది అతిగా తినడానికి, తద్వారా బరువు పెరగడానికి దారితీస్తుంది.

కాబట్టి మీరు ప్రతిరోజూ 7 నుండి 8 గంటలపాటు నిద్రపోవడానికి ప్రయత్నించాలి.

పొత్తికడుపులో కొవ్వును కోల్పోవడానికి ఉత్తమ మార్గం ఏమిటంటే, పుష్కలంగా నీరు త్రాగటం మరియు సమతుల్యమైన, ఆరోగ్యకరమైన ఆహారం తినడాన్ని పాటించడం, వ్యాయామం, శారీరక శ్రమ మరియు తగినంతగా నిద్రపోవడం. చదునైన పొట్టను పొందాలనే మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి మీ ప్రయత్నాలు మరియు కొంత సమయం కీలకం,  కానీ చివరికి, లక్ష్యం ఫలించాక, ఇవన్నీ కూడా విలువైనవే.

Dr. kratika

Dr. kratika

General Physician
3 Years of Experience

Dr.Vasanth

Dr.Vasanth

General Physician
2 Years of Experience

Dr. Khushboo Mishra.

Dr. Khushboo Mishra.

General Physician
7 Years of Experience

Dr. Gowtham

Dr. Gowtham

General Physician
1 Years of Experience

వనరులు

  1. Lamarche B. Abdominal obesity and its metabolic complications: implications for the risk of ischaemic heart disease. Coron Artery Dis. 1998;9(8):473-81. PMID: 9847978
  2. Anan F et al. Visceral fat accumulation is a significant risk factor for white matter lesions in Japanese type 2 diabetic patients. Eur J Clin Invest. 2009 May;39(5):368-74. PMID: 19320939
  3. Essam F Elsayed et al. Waist Hip Ratio and Body Mass Index as Risk Factors for Cardiovascular Events in Chronic Kidney Disease . Am J Kidney Dis. 2008 Jul; 52(1): 49–57. PMID: 18514990
  4. Vinu A. Vij, Anjali S. Joshi. Effect of ‘Water Induced Thermogenesis’ on Body Weight, Body Mass Index and Body Composition of Overweight Subjects . J Clin Diagn Res. 2013 Sep; 7(9): 1894–1896. PMID: 24179891
  5. Jeong SM et al. Effect of heat treatment on the antioxidant activity of extracts from citrus peels. J Agric Food Chem. 2004 Jun 2;52(11):3389-93. PMID: 15161203
  6. Yoshiko Fukuchi et al. Lemon Polyphenols Suppress Diet-induced Obesity by Up-Regulation of mRNA Levels of the Enzymes Involved in β-Oxidation in Mouse White Adipose Tissue . J Clin Biochem Nutr. 2008 Nov; 43(3): 201–209. PMID: 19015756
  7. Bing Zhu et al. Association Between Eating Speed and Metabolic Syndrome in a Three-Year Population-Based Cohort Study. J Epidemiol. 2015; 25(4): 332–336. PMID: 25787239
  8. Emily Wolff, Michael L. Dansinger. Soft Drinks and Weight Gain: How Strong Is the Link? Medscape J Med. 2008; 10(8): 189. PMID: 18924641
Read on app