పాదాల్లో మంట అనేది అరికాళ్లలో (కాలి వేళ్ళ నుండి మడమ వరకూ ఉండేదే అరికాలు లేక పాదం) మండినట్లుండే ఒక బాధాకరమైన అనుభూతిని సూచిస్తుంది, దీనికి అనేక రకాల కారణాలుండవచ్చు, లేదా తెలియని వ్యాధికారణం (aetiology) ఉండవచ్చు. మండే పాదాలకు అత్యంత సాధారణ కారణం నాడి విధి నిర్వాహక లోపము లేదా న్యూరోపతి  కావచ్చు లేదా అజాగ్రత్తవల్ల సంభవించే చక్కెరవ్యాధికి సంబందించినదై ఉండవచ్చు. కానీ, మండే పాదాలకు కొన్ని రకాల పోషకాహార లోపాలతో పాటు పలు ఇతర కారణాలున్నాయి. ఈ వ్యాసంలో ఈ కారణాలను అన్వేషించడం జరిగింది. ఇంకా, దీనికి గల గృహ నివారణల గురించిన చర్చతో బాటు చికిత్స ఎంపికల్ని వివరించడం కూడా జరిగింది.

  1. పాదాల మంటలకు కారణాలు - Causes of burning feet in Telugu
  2. పాదాల మంటకు ఇతర కారణాలు మరియు ప్రమాద కారకాలు - Other causes and risk factors of burning feet in Telugu
  3. పాదాల్లో మంటకు చికిత్స - Treatment of burning feet in Telugu
  4. పాదాల మంట రుగ్మత నిర్వహణకు ఇతర చిట్కాలు - Other tips for the managing burning feet in Telugu
  5. పాదాల్లో మంటకు గృహ చికిత్సలు - Home remedies for burning in feet in Telugu

పాదాల్లో మంటతో కూడిన నొప్పి లేక బాధకు సాధారణ కారణాలు చక్కెరవ్యాధి (మధుమేహం), పరిధీయ నరాల వ్యాధి, అనేక నాడులు వికృతి చెందడమనే ‘పాలీనేరోపతీ’, విటమిన్ B1 లోపం, మండే పాదాల రుగ్మత (బర్నింగ్ ఫుట్ సిండ్రోమ్), చీలమండ కుహర రుగ్మత (టార్సల్ టన్నెల్ సిండ్రోమ్) అనే కొన్నింటిని సూచించవచ్చు. ఈ విభాగంలో, ఈ కారణాలన్నింటినీ వివరించడం జరిగింది.

పాదాల మంటలు లక్షణసంపుటి - Burning feet syndrome in Telugu

‘మండే పాదాలు’ అన్న పేరు స్పష్టంగా సూచించిన విధంగానే, అరికాళ్లలో మంట మరియు నొప్పి లక్షణాలుంటాయి. పాదాల్లో మంట (మండే పాదాలు) ఇది వృద్ధాప్యంలో సంభవించే ఒక సాధారణ రుగ్మత మరియు ఒక నిర్దిష్టమైన రోగకారణాన్ని కలిగి ఉండకపోవచ్చు. ఇది ఏకాంత వ్యాధిలక్షణం లేదా ఇతర వైద్య (క్లినికల్) సంకేతాలు ఉండవచ్చు.

Antifungal Cream
₹629  ₹699  10% OFF
BUY NOW

విటమిన్ బి 1 లోపం మరియు పాదాల్లో మంట - Vitamin B1 deficiency and burning feet in Telugu

విటమిన్ బి 1 లేదా థయామిన్ విటమిన్ బి కాంప్లెక్స్ లో భాగం. విటమిన్ బి 1 లోపం గర్భిణీ స్త్రీలు, అథ్లెట్లు మరియు దైహిక అంటువ్యాధులు మరియు కొన్ని క్యాన్సర్లకు గురైన వ్యక్తుల్లో గుర్తించబడుతుంది. పోషకాహారలోపానికి గురైన వ్యక్తుల్లో లేదా ఆంత్రేతరంగా నరాల ద్వారా పోషణ (parenteral nutrition) స్వీకరించే వారు మరియు తినే రుగ్మతలు (eating disorders) గల వారిలో కూడా ఇది సాధారణం. కాలివేళ్ళు మరియు పాదాలలో బలహీనత, మండినట్లుండే నొప్పి, పోటు నొప్పి మరియు దిగువ కాళ్లలో ఈడ్పులతో కూడిన తిమిరి వంటి లక్షణాలు ‘పెరెస్థెసియా’ కారణంగా గమనించవచ్చు. అలసట మరియు చికాకు  (irritability) లక్షణాలు కూడా విటమిన్ B1 లోపం ఉన్న సందర్భాల్లో సాధారణంగా కనిపిస్తాయి.

పాలీన్యూరోపతీ నరాలవ్యాధి మరియు పాదాల మంటలు - Polyneuropathy and burning feet in Telugu

మెదడు వెలుపల లేదా వెన్నుపాము వెలుపల ఉన్న అనేక నరాలకు నష్టం కలిగేటప్పుడు ‘పాలినేరోపతి’ అనే నరాలవ్యాధి సంభవిస్తుంది. పాలినేరోపతి అనేది అసాధారణ రోగనిరోధక ప్రతిస్పందన కారణంగా సంభవిస్తుంది, ఈ రుగ్మతలో, శరీరంలోని నరాల  యొక్క మైలిన్ కోశంపై (బాహ్య పొర లేదా రక్షక పోర) శరీరం దాడి చేయడం సంభవిస్తుంది. పాలీనేరోపతి లేదా దీర్ఘకాలిక శోథ నిరోధకత కలిగిన నరాలవ్యాధి సాధారణంగా గిలియన్-బార్రే సిండ్రోమ్తో ముడిపడి ఉంటుంది. చాలా నరాలు ఈ రుగ్మతలో ఇమిడి ఉన్నందున ఇది చర్చించబడిన ఇతర రకాలైన నరాలవ్యాధుల కన్నా తీవ్రమైనది.

పాలినేరోపతి నరాలవ్యాధివల్ల అలసట, గొంతు గీరుకుపోయి బొంగురుస్వరమేర్పడడం మరియు శ్వాస తీసుకోవడంలో కష్టతరమైన వ్యాధిలక్షణాలతోపాటు నడకలో కూడా వ్యక్తికి కష్టమేర్పడుతుంది. బాధాకరమైన మంటతో కూడిన ఇన్ఫ్లమేటరీ బౌల్ వ్యాధి, HIV-AIDS , మధుమేహం, దైహిక ల్యూపస్ ఎరిథెమాటోసస్, దీర్ఘకాలిక హెపటైటిస్ మరియు కొన్ని రకాల క్యాన్సర్ (ఇమ్యునోకోమ్ప్రోమైజ్డ్ స్థితికి దారి తీస్తుంది) సాధారణంగా పాలీనేరోరోపతితో సంబంధం కలిగి ఉంటాయి.

నరాల వ్యాధి మరియు పాదాల మంటలు - Neuropathy and burning feet in Telugu

నరాలవ్యాధి అనేది చక్కెరవ్యాధి కారణంగా మాత్రమే కాకుండా, అంటువ్యాధులు , గాయాలు, వెన్నెముక కణితులు, మందులవాడకం లేదా దీర్ఘకాల మద్యపాన దుర్వినియోగం వంటి ఇతర అంతర్లీన కారణాలతో సంబంధం కలిగి ఉంటుంది. పాదాల్లో అనుభూతి (స్పర్శ వంటివి) తో కూడిన లేక ఎలాంటి అనుభూతి లేని నరాలవ్యాధిని సాధారణంగా ‘పరిధీయ నరాలవ్యాధి’గా పిలుస్తారు మరియు దీని లక్షణాలు చక్కెరవ్యాధి (డయాబెటిక్) నరాలవ్యాధి లాంటి వ్యాధి లక్షణాలనే కలిగి ఉంటుంది.

చక్కెరవ్యాధి మరియు పాదాల మంటలు - Diabetes and burning feet in Telugu

అరికాళ్ళలో మంట  లేక పాదాల్లో మంటకు గల అత్యంత సాధారణ కారణం మధుమేహం లేక చక్కెరవ్యాధి. చక్కెరవ్యాధిలో సంభవించే నరాల వ్యాధి (డైయాబెటిక్ న్యూరోపతి) లో నరాలకు హాని కల్గుతుంది, దీనివల్లనే చక్కెరవ్యాధి (మధుమేహం) లో మంటతో కూడిన బాధ సంభవిస్తుంది. మండే పాదాల రుగ్మతలో, మంటతో కూడిన బాధ కాకుండా, స్పర్శ నాడులు లేక జ్ఞాననాడులకు హాని కల్గడంవల్ల తిమ్మిరి (స్పర్శరహిత నరములు), జలదరింపు మరియు నొప్పితో కూడిన బాధాకర అనుభూతి ఉంటాయి. స్పర్శ, వేడి లేదా చల్లని అనునుభూతులకు సంబంధించిన జ్ఞానానుభూతుల్ని శరీరంలో మోయడానికి జ్ఞాన నాడులు లేదా స్పర్శ నాడులు బాధ్యత వహిస్తాయి.

చక్కెరవ్యాధితో కూడిన నరాలవ్యాధి (Diabetic neuropathy) చక్కెరవ్యాధి యొక్క ఉపద్రవసమస్య. చక్కెరవ్యాధి సాధారణంగా అధిక రక్తపోటు , మద్యపాన దుర్వినియోగం, ధూమపానం లేదా మూత్రపిండాల నష్టం లేదా కాలేయం నష్టంతో సంబంధం కల్గి ఉంటుంది. పేర్కొన్న ఈ వ్యాధిలక్షణాలన్నీ పాదాల్లో మంట రుగ్మతకు ఇతర ప్రమాద కారకాలుగా భావిస్తారు. చక్కెరవ్యాధితో కూడిన నరాలవ్యాధి (డయాబెటిక్ న్యూరోపతి) యొక్క నొప్పి రాత్రిసమయాల్లో తీవ్రమవుతుంది, దీనివల్ల నిద్ర కరువవుతుంది. పగటిపూట, చక్కెరవ్యాధితో కూడిన నరాల వ్యాధి యొక్క నొప్పి నడకకు ఆటంకం కలుగజేయవచ్చు.

(మరింత చదువు:  ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ లక్షణాలు)  

పాదాల్లో మంటకు గల ప్రాథమిక కారణాల గురించి ఇప్పటికే చర్చించాం, ఈ కారణాల్ని అధ్యయనం చేయడంవల్ల క్రింద పేర్కొన్న కొన్ని ఇతర కారణాలను వెల్లడి చేసింది:

బాధిస్తున్న అరికాళ్ళమంట విజయవంతమైన చికిత్సకు మరియు నిర్వహణ కోసం, అంతర్లీన కారణం లేదా తత్సంబంధ యంత్రాంగాన్ని అన్వేషించి దాన్ని తొలగించివేయడం చాలా అవసరం.

  • సాధారణ చికిత్స చర్యల్లో భాగంగా పాదాలకు తగినంతగా విశ్రాంతినివ్వడం, పాదాలకు మంచు ప్యాక్ల అద్దకం మరియు నొప్పి నివారిణుల సేవనం ఉన్నాయి. మరోవైపు తినే ఆహారం పట్ల కూడా శ్రద్ధ వహించడం చాలా అవసరం. క్రమబద్ధమైన వ్యాయామం మరియు కాళ్లకు తగినవిధంగా కదలికలు కల్పించడం మండే పాదాల రుగ్మత నిర్వహణలో సహాయపడతాయి. నొప్పి నుండి ఉపశమనానికి డాక్టర్ సూచించినట్లుగా మందులు తీసుకోవచ్చు. మద్యపానం చేయడం మరియు ధూమపానం వెంటనే ఆపివేయాలి.
  • నొప్పి యొక్క అంతర్లీన కారణాన్ని పరిశీలించడానికి మరియు నొప్పికి సంబంధించిన ఒత్తిడిని నిర్వహించడానికి శారీరక చికిత్స మరియు మానసిక చికిత్స కూడా సహాయపడవచ్చు.
  • కొన్నిసార్లు, తీవ్రమైన అసౌకర్యం (మంట) ఉన్న భాగంలో స్టెరాయిడ్ సూది మందులు సూచించబడతాయి. టార్సల్ టన్నెల్ సిండ్రోమ్తో (tarsal tunnel syndrome) సంబంధం ఉన్నట్లయితే శస్త్రచికిత్సను సూచించవచ్చు.
  • వ్యక్తి చక్కెరవ్యాధి (మధుమేహం)తో బాధపడుతుంటే, మౌఖిక హైపోగ్లైసిమిక్స్ ( రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించేందుకు ఇచ్చే మందులు) లేదా ఇన్సులిన్ ఉపయోగించడం ద్వారా మొదట డయాబెటిస్ను నిర్వహించడం చాలా అవసరం.
  • వేర్వేరు వ్యాధుల చికిత్సకు రోగి సేవిస్తున్న కొన్ని మందులు నరాలవ్యాధికి మరియు పాదాల్లో మంటకు కారణమవుతున్నాయని తెలిశాక, సేవిస్తున్న  ఔషధాలకు బదులు సమర్థవంతమైన వేరే మందుల ప్రత్యామ్నాయాన్ని అందించడం అవసరం.
  • కొన్ని సమయాల్లో పాదాల్లో మంట ఆకస్మికంగా నయమైపోతుంది, దానికెలాంటి చికిత్స అవసరం ఉండదు, అయితే కొందరికి కార్టికోస్టెరాయిడ్స్ నిచ్చి మంట, వాపును నిర్వహించడానికి సూచించవచ్చు. తీవ్రమైన సందర్భాల్లో, వ్యక్తి రోగనిరోధక ప్రతిస్పందనను తగ్గించడానికి ప్రతిరక్షా నిరోధకాలు ఇవ్వబడతాయి మరియు యాంటిబాడీ తొలగింపు చికిత్స సూచించబడుతుంది. ఈ విధానాలు తీవ్రమైన నష్టాలను కలిగి ఉంటాయి గనుక నిపుణులచే మాత్రమే నిర్వహించబడతాయి.
  • విటమిన్ బి కాంప్లెక్స్ సేవనం విటమిన్ B సప్లిమెంట్స్ లోపం లేదా పోషకాహార లోపం ఉన్నవారికి సహాయపడవచ్చు. తినే రుగ్మతలు (eating disorders) మరియు ఇటీవలే గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ (బరువు నష్టం తగ్గింపు శస్త్రచికిత్స) కి గురైన వ్యక్తులకు ఇది సూచించబడుతుంది. గర్భిణీ స్త్రీలు మరియు అధిక స్థాయి శారీరక శ్రమ ఉన్న వ్యక్తులకు సప్లిమెంట్స్ ఉపయోగకరంగా ఉండవచ్చు.

పాదాల మంట  నిర్వహణ కోసం కొన్ని ఇతర చిట్కాలు క్రింద పేర్కొనబడ్డాయి.

  • పాదాల్లో తెగిన గాయాలు (కట్స్), ఆనెలు లేక కాయ కాచినట్లుండే గడ్డల్లాంటి  కాయలు (కాల్లూసెస్), చర్మం ఎరుపుదేలడం, వాపు లేదా ఇతర లక్షణాలను మీ పాదాల్లో ఏర్పడ్డాయేమోనని పరిశిలించండి. పేర్కొన్న ఏదైనా లక్షణాలు కనబడితే తక్షణమే మీ డాక్టర్ను సందర్శించండి.
  • మీ పాదాలను, కాలివేళ్ళ గోర్లు,  బొటనవేలు-గోర్లను శుభ్రంగా ఉంచండి.
  • పాదరక్షలు లేకుండా నడవడాన్ని మానుకోండి.
  • సౌకర్యవంతమైన పాదరక్షల్ని ధరించాలి.
  • సాధారణమైన పాదాల తనిఖీలను తప్పకుండా పొందండి.
  • వాకింగ్, బైకింగ్ వంటి తేలికపాటి కార్యకలాపాలను చేపట్టండి, ఇది పాదాల యొక్క రక్తప్రసరణను మరియు పెర్ఫ్యూజ్ను (perfusion) మెరుగుపరుస్తుంది.
  • ఎండలోకి తరచుగా వెళ్ళండి.
  • రక్తం ప్రవహించేలా పాదాలను పైకి-కిందికి కదిలిస్తూ చలనంలో ఉంచండి.
Deep Ayurveda Turmeric Pure Essential Oil 20ml
₹443  ₹443  0% OFF
BUY NOW

సంప్రదాయ చికిత్సలు కాకుండా, గృహసంబంధమైన నివారణలు కూడా మండుతున్న  పాదాలకు తక్షణ ఉపశమనాన్ని కల్గించడంలో సహాయపడతాయి. అలాంటి గృహ నివారణలు కింద సూచిస్తున్నాం:

మండే పాదాలకు అల్లం - Ginger for burning feet in Telugu

పసుపు మాదిరిగానే అల్లం కూడా వంటింట్లో కనబడే మరొక సామాన్య సంబార పదార్ధం, ఇది వాపు నివారిణి (యాంటి ఇన్ఫ్లమేటరీ) మరియు పాదాలలో మండుతున్నట్లుండే (బర్నింగ్) బాధకు ఉపశమనాన్ని కల్గించడంలో సహాయపడుతుంది. మీకు అప్పుడప్పుడు పాదాల్లో వచ్చే మంటకు అల్లం పేస్ట్ ను మీ పాదాలకు రాసి కట్టుకట్టి కప్పు ఉంచండి లేదా అల్లం సేవనాన్ని ఆహారంలో ఓభాగంగా తీసుకోవడాన్ని ఒకింత పెంచండి, దానివల్ల అల్లం యొక్క ఆరోగ్య ప్రయోజనాలను మన శరీరం పొందటానికి సాధ్యమవుతుంది.

మీ పాదాల్లో మంట రుగ్మతకు ఓ తీవ్రమైన రోగకారణము (ఆటియాలజీ) ఉండి ఉండవచ్చు. ఏవైనా గృహ నివారణల ప్రక్రియలను ప్రయత్నించేందుకు ముందు మీ డాక్టర్ని సంప్రదించి సలహా పొందండి.

పాదాల మంటలకు పసుపు - Turmeric for burning feet in Telugu

వాణిజ్యపరంగా లభించే చికిత్సలు మరియు సారాంశాల (creams) కు బదులుగా, మీరు మీ ఇంటిలోనే లభించే ఒక సాధారణ వంటగది సంబార పదార్ధమైన పసుపుతో అరికాలి మంటకు ఉపయోగపడే ఓ మంచి మందును తయారు చేసుకోవచ్చు. పసుపుకు అద్భుతమైన వైద్య ప్రయోజనాలను కలిగించే గుణం ఉంది మరియు ఇది వాపును నయం చేసే మందు (యాంటి ఇన్ఫ్లమేటరీ) మరియు సూక్ష్మజీవనాశిని కూడా అవటంవల్ల దీన్ని మండే పాదాలకు రాయడంవల్ల మంటను తగ్గించి  ఉపశమనం కల్గిస్తుంది. పసుపు యొక్క రక్షణ చర్యలు వివిధ నర సంబంధ రోగ లక్షణాలను, మండే స్వభావంతో కూడిన నొప్పి నిర్వహణలో ప్రభావవంతమైనవిగా గుర్తించబడ్డాయి.

పసుపును ఉపయోగించడానికి, మీరు పసుపు పొడికి కొద్దిగా నీటిని చేర్చి ఓ మందపాటి పేస్ట్ లాగా తయారు చేసుకోవచ్చు. మీ పాదాలకు ఈ పేస్ట్ ను రాసి ఓ మెత్తని కట్టు (బ్యాండేజ్) కట్టే బట్టనుపయోగించి కట్టు కట్టి కొంత సమయం వరకు అలాగే వదిలివేయాలి. ఇలా చేయడంవల్ల అరికాలు మండుతున్న అనుభూతితో కూడిన బాధ తొలగిపోతుంది,  మరియు మీ అడుగుల కణజాలానికి మంచి స్వస్థత చేకూరుస్తుంది.

పసుపును ఒక పేస్ట్, ప్యాక్ లా ఉపయోగించడం కాకుండా,  దీన్ని మీరు మీ ఆహారంలో ఒక అనుబంధకాహారంగా (సప్లిమెంట్ గా) ఉపయోగించవచ్చు. మీరు ఇప్పటికే మీ ఆహారంలో పసుపుని తింటున్నట్లైతే, (అరికాలి మంట ఉన్నపుడు) దాని మోతాదును పెంచుకోవడం మంచిది. అరికాలిమంట నుండి వేగవంతమైన స్వస్థత సాధించడానికి మీ రోజువారీ దినచర్య (పానీయంగా)లోభాగంగా పసుపు పాలను కూడా చేర్చుకోవచ్చు.

పాదాల మంటలకు సమయోచిత క్రీములు - Topical creams for burning in feet in Telugu

మండే పాదాలకు ఎక్కడెక్కడ మంట ఎక్కువగా ఉంటుందో ఆ భాగంలో మంట భాధను తగ్గించడానికి మరియు ఆ బాధ నుండి ఉపశమనం పొందటానికి పైపూత క్రీమును రాయవచ్చు. క్యాప్సైసిన్ లేదా లిడోకైన్ (capsaicin or lidocaine) కలిగి ఉన్న క్రీముల్ని (సారాంశాలు) వాడవచ్చు. లిడోకాయిన్ ఒక స్థానిక మత్తుమందు ఏజెంట్, దీన్ని మంట పుడుతున్న చోట రాసుకున్నట్లైతే ఆప్రాంతంలో తిమిరెక్కించి మంటను తగ్గిస్తుంది. ఇది లిడోకాయిన్ ను ఒక క్రీమ్ గా రాసినప్పుడు మండే బాధను తగ్గించడానికి సహాయపడుతుంది. లిడోకైన్ ప్యాచ్ కూడా అరికాలి మంటకు సహాయకారిగా ఉంటుందని కనుగొనబడింది.

పాదాల మంటలకు నూనెతో మర్దన - Oil massage for burning in feet in Telugu

మండే పాదాలకు రుద్దడమనే చికిత్సకు పూరకం (పురోగతిగా)గా మర్దన చేయడానికి నూనెను ఉపయోగించవచ్చు. దీనివల్ల ఉపశమనం పొందదడమే కాక అరికాళ్లను మర్దన (మసాజ్) చేయడంలో నూనెను ఉపయోగించడంవల్ల మర్దనా ప్రక్రియ మరింత సులభమవుతుంది. కాని, అరికాలి మర్దనకు ఏ నూనె ఉత్తమమైనది? క్రింద ఇచ్చిన రెండు ఎంపికల నుండి ఏదో ఒక నూనెను మీరు ఎంచుకోవచ్చు.

కొబ్బరి నూనె

కొబ్బరి నూనెకున్న వాపు నిరోధక గుణంవల్ల మీ పాదాల మంటను తగ్గించడంలో ఇది పని చేయవచ్చు. పాదాల్లోని కణజాలం మరియు కండరాలలో మండే బాధను మరియు వాపును కొబ్బరినూనె తగ్గిస్తుంది. మీ పాదాలను క్రమం తప్పకుండా మర్దనా చేసేటప్పుడు మీరు కొబ్బరి నూనెను మామూలుగానే ఉపయోగించవచ్చు.

ఆవ నూనె

మసాజ్ ప్రయోజనాల కోసం సరిపోయే మరో రకం నూనె ఆవాల నూనె. ఇది మీ పాదాలలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. పాదాలలో సూదులతో పొడిచినట్లుండే వ్యధను,  మండుతున్నట్లున్న బాధను నివారించి ఉపశాంతిని కలుగజేయడంలో సహాయపడుతుంది.

పాదాల్లో మంటకు అరికాలును రుద్దడం - Foot massage for burning in feet

అరికాళ్ళ మర్దనం అనే ఈ నివారణా ప్రక్రియలో మంట పెడుతున్న మీ పాదాలను మెత్తగా రుద్ది రక్త ప్రసరణను మెరుగుపరచడం అవసరం. ఈ అరికాలి మర్దనాన్ని మీ అంతటా మీరే చేసుకోవచ్చు, మరెవరైనా మీ అరికాళ్లను మర్దన చేయవచ్చు లేదా మీరు ఒక వృత్తిరీత్యా మాలీష్ చేసేవారి సేవలను ఉపయోగించుకోవచ్చు.

చాలామంది వ్యక్తులకు రాత్రి సమయంలోనే ఎక్కువగా అరికాళ్ళ మంట రావడం సంభవిస్తుంటుంది గనుక మీక్కూడా పాదాల్లో మంట రాత్రిపూట వస్తే మీరుకూడా అరికాళ్ళ మర్దనను రాత్రిపూటే చేయటం మంచిది. కానీ, మీరు ఈ రుద్దడమనే చికిత్సను ఎప్పుడైనా సరే మీకు సరిపోయేట్టుగా ఉత్తమంగా చేసుకోవచ్చు.

మండే పాదాలకు యాపిల్ సైడర్ వెనిగర్ - Apple cider vinegar for burning in feet in Telugu

యాపిల్ సైడర్ వినెగర్ ఉపయోగం ఈ రోజుల్లో బాగా ప్రాచుర్యం పొందింది. ఇంతేకాకుండా, మధుమేహం, ముఖ్యంగా రకం 2 చికిత్సలో దాని ఉపయోగం బాగా  కనిపిస్తుంది, మరియు ఇది క్యాన్సర్ విరుద్ధంగా పనిచేసే ఏజెంట్.

యాపిల్ పండ్ల సైడర్ వినెగర్ ఆరోగ్య ప్రయోజనాలను పొందటానికి ఒక గ్లాసెడు నీటిలో ఒక టీస్పూన్ ఆపిల్ సైడర్ వినెగర్ను చేర్చి రోజుకు మూడుసార్లు తాగొచ్చు, దీనివల్ల పాదాల్లో మంట తగ్గుతుంది.  మరియు మీ పాదాలకు మంటలు అనుభూతిని తగ్గించేటప్పుడు దాని ఆరోగ్య ప్రయోజనాలను పొందటానికి ప్రతిరోజూ మూడుసార్లు తినవచ్చు. ఇది మీ పాదాల్లోని వాపు ప్రభావాలను తగ్గించడం ద్వారా పనిచేస్తుంది.

మీ పాదాల మంటను తగ్గించేందుకు మరింత ప్రత్యక్ష చర్య కోసం, మీరు మీ పాదాలను యాపిల్ పండ్ల సైడర్ వినెగర్ ద్రవంలో ముంచి నానపెట్టవచ్చు. మీరు చక్కెరవ్యాధి కల్గిన వ్యక్తి అయితే, ఆపిల్ పళ్లరసం వినెగార్ ను తీసుకునే ముందు మీ డాక్టర్ తో సంప్రదించడం  మంచిది.

పాదాల్లో మంటకు ఎప్సోమ్ ఉప్పు - Epsom salt for burning in feet in Telugu

చల్లని సాదా నీటిలో మీ పాదాలను ముంచి ఉంచడానికి బదులు, మీరు పాదాల స్నానాన్ని ఏర్పరచటానికి కొంత ఎప్సోమ్ ఉప్పుని ఆ చన్నీటి జోడించవచ్చు. పాదాల్లో మంటతో  కూడిన బాధ నివారణకు 2 టీస్పూన్లు ఎప్సం ఉప్పును 2 లీటర్ల నీటికి చేర్చి, అందులో మీ పాదాల్ని 30 నిముషాలపాటు ముంచి ఉంచవచ్చు. ఇలా రోజువారీగా 30 నిముషాల పాటు ఎప్సమ్ నీటిలో  మీ పాదాలను ముంచి ఉంచి స్నానం చేయించేందుకు మీరు సిఫార్సు చేయబడ్డారు. ఇప్సమ్ ఉప్పు కలిపినా నీటిని మీరు 3 నుండి 4 రోజుల వరకూ పాదాలను ముంచి ఉంచేందుకు ఉపయోగించవచ్చు.

మీకు పాదాల్లో మంట తీవ్రంగా ఉన్నట్లయితే మీ పాదాలను ఇప్సమ్ నీటిలో ప్రతిరోజు 20 నిముషాలపాటు మూడుసార్లు ముంచాలి. పాదాల్లో మంటతో బాధపడుతున్న రోగుల్లో ఎప్సోమ్ ఉప్పును ఉపయోగించడంతో దీర్ఘకాలిక ప్రయోజనాలున్నట్లు గుర్తించబడింది .

పాదాల్లో మంటకు చల్లని నీరు - Cold water for burning in feet in Telugu

మండుతున్న పాదాలకు చల్లని నీరు ఒక సాధారణ గృహ చికిత్స. మంటతో బాధిస్తున్న మీ పాదాల్ని చల్లని నీటిలో మునిగి వుండేట్లుగా కొంతసేపు ఉంచడంవల్ల పాదాల్లోని మంట బాధ క్రమంగా మాయమై పోతుంది. ఇలా మండే మీ పాదాల్ని నీటిలో ముంచి ఉంచడమే  కాకుండా, రోజులో నీరు మరియు ఇతర ద్రవాహారాలను పుష్కలంగా సేవించడం కూడా మంచిది. ఈ చిట్కా మీ పాదాల్లోని మంటను, నొప్పిని దూరంగా తరిమేయడానికి సహాయపడుతుంది.

వనరులు

  1. healthdirect Australia. Diabetic neuropathy. Australian government: Department of Health
  2. healthdirect Australia. Neuropathy. Australian government: Department of Health
  3. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Chronic inflammatory demyelinating polyneuropathy
  4. Nancy Hammond, et al. Nutritional Neuropathies. Neurol Clin. 2013 May; 31(2): 477–489. PMID: 23642720
  5. Makkar RP et al. Burning feet syndrome. A clinical review. Aust Fam Physician. 2003 Dec;32(12):1006-9. PMID: 14708150
  6. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Diabetes and Your Feet
Read on app