వెంట్రుకల కుదుళ్లకు (హెయిర్ ఫోలికల్స్ కు) వచ్చే అంటురోగం లేదా సంక్రమణ వల్ల సంభవించే చర్మ రుగ్మతే “కురుపులు” లేదా “బొబ్బలు” (boils). చర్మం ఎరుపుదేలి, వాపు మరియు మంటను కల్గి ఉండే కురుపునే ఆంగ్లంలో “బాయిల్” అని కూడా అంటారు, కురుపు రూపంలోని ఈ చర్మరోగం దాని చుట్టుపక్కల ప్రాంతాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. బొబ్బలు సాధారణంగా “స్టెఫిలోకాకస్ ఆరియస్” అనే సూక్ష్మజీవి (బ్యాక్టీరియా) వల్ల సంభవిస్తాయి, కానీ ఈ బొబ్బలు ఇతర బ్యాక్టీరియా సమూహాలవల్ల లేదా శిలీంధ్రాల వల్ల కూడా సంభవించవచ్చు.
బొబ్బలు తరచుగా బాధాకరంగా ఉంటాయి, తాకడానికి మృదువుగా ఉంటాయి మరియు చీము లేదా ద్రవంతో నిండి ఉంటాయి. వెంట్రుకల కుదుళ్ళు దెబ్బతినడం వల్ల బొబ్బలు చర్మం యొక్క లోతైన పొరలలోకి సంక్రమణ మరింత వ్యాపిస్తుంది. కాబట్టి, మీకు ఒక కురుపు వచ్చిందంటే దానికి వెంటనే చికిత్స చేయడం చాలా అవసరం, ఆ విధంగా దాని వ్యాప్తిని అరికట్టొచ్చు. వేప ఆకులు మరియు పసుపు వంటి గృహ చిట్కాల సహాయంతో ఇంట్లోనే చిన్న చిన్న కురుపులకు సులభంగా చికిత్సను నిర్వహించవచ్చు, బొబ్బలు ఇలాంటి చికాలను ఈ వ్యాసంలో మా పాఠకులకు అందిస్తున్నాం. మీకొచ్చిన కురుపు యొక్క పరిమాణం చాలా పెద్దది లేదా చాలా బాధాకరమైనదిగా ఉంటే, ఇతర లక్షణాలు కూడా ప్రదర్శిస్తే మీరు తప్పనిసరిగా చికిత్స కోసం వైద్యుడిని సందర్శించాలి. లక్షణాలు. బొబ్బలు రాకుండా నిరోధించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. ఈ వ్యాసంలో రానున్న విభాగాలలో కురుపుల్ని నోరోధించే ఆ మార్గాలేంటో మీరు తెలుసుకుంటారు.