గసగసాలనేవి నూనె కల్గి ఉండే విత్తనాలు. ఇవి ఎక్కువ పోషకపదార్థాల్ని కల్గి ఉంటాయి. గసాలను వంటల్లో రుచిప్రేరకంగా ఉపయోగిస్తారు. గసగసాల గింజలు ఒకింత ఒగరుతో (nutty) కూడిన ఆహ్లాదకరమైన రుచిని కల్గి ఉంటాయి. తెల్లగా, చాలా చిన్నవిగా ఉండే ఈ గసగసాల గింజల్ని పండిన గసగసాల మొక్కలకు కాచే కాయలనుండి సేకరిస్తారు. ఆసక్తికరంగా, పండైన గసగసాల కాయలు నల్లమందు (అభిని) గసగసాలని కూడా ఉత్పత్తి చేస్తాయి. ఈ ‘నల్లమందు గసగసాలు’ మోర్ఫిన్ వంటి వైద్యపరమైన మత్తుమందుల్లో ఉపయోగించే ఒక ఉపయోగకరమైన మత్తు మందు. అయితే, గసగసాల గింజలు నల్లమందు గసగసాలు కల్గించే ఎలాంటి దుష్ప్రభావాలనూ కల్గించదు, అంటే గసగసాలు దుష్ప్రభావాల.నుండి స్వేచ్ఛను కల్గిఉందన్నమాటే. ఈ నూనె గింజలు ముఖ్యంగా పాపవర్ సొమింఫెర్మ్, అనే గసగసాల జాతి మొక్క నుండి లభిస్తాయి .
గసగసాల మొక్క ‘పాపవేరసెయే’ కుటుంబానికి చెందినది. ఇది తూర్పు మధ్యధరా ప్రాంతం మరియు ఆసియా మైనర్కు ప్రాంతానికి చెందిన మొక్క మరియు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి పండుతుంది. సరైన సూర్యకాంతి మరియు సారవంతమైన నేల ఉన్నట్టయితే, గసగసాల మొక్కలు 5 అడుగుల పొడవు వరకు పెరుగుతాయి. మూత్రపిండాల ఆకారంలో గసగసాల విత్తనాలు 4 నుంచి 6 సెంమీ పొడవు మరియు 3 నుండి 4 సెంమీ వ్యాసం కలిగిన పండిన అండాకారపు గసగసాల కాయల్లో పెరుగుతాయి. గసగసాల మొక్కలు వసంతకాలంలో పూలు పూస్తాయి. గసగసాల మొక్క యొక్క వివిధ రకాలపై ఆధారపడి, దీని పుష్పాలు లేత ఊదా రంగు ( దాసానిపువ్వు లేదా జిల్లేడు పూలరంగులో-lilac), నీలం, ఎరుపు లేదా తెలుపు రంగుల్లో ఉంటాయి.
కొందరు చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం, చిన్నగా, మూత్రపిండ-ఆకారపు గస గసాల విత్తనాలు వేలాది సంవత్సరాల నుండి పండించడం జరుగుతోంది. గసగసాల విత్తనాలను పురాతన ఈజిప్షియన్లు ఆరోగ్యకరమైన ఆహారంగా భావించారు. అరబ్ వ్యాపారుల ద్వారానే నల్లమందు (opium) సాగును భారతదేశం, పురాతన ఖొరాసాన్ మరియు పర్షియాకు వ్యాపించింది. నేటి ప్రపంచంలో, గసగసాల్ని వాణిజ్య పంటగా జర్మనీ, భారతదేశం, తూర్పు ఐరోపా ప్రాంతం, ఫ్రాన్స్, టర్కీ మరియు చెక్ రిపబ్లిక్ ల వంటి ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో బాగా పండిస్తున్నారు, అందుకే ఇది ఓ మంచి వాణిజ్యపంటగా బాగా అభివృద్ధి చెందింది.
గసగసాల గింజలు నల్లమందు (అభిని) గసగసాల్లో ఉండే విషపూరిత అంశాలను అతి స్వల్ప పరిమాణంలో, అంటే ఉపేక్షించదగ్గ విధంగా, కలిగి ఉన్నందున గసగసాలను తినడం చాలా సురక్షితం (ప్రమాదకరం కాదు). గసగసాల నుండి నూనె తీయడం మరియు దీన్నొక మసాలా దినుసులాగా ఉపయోగించడం బాగా ప్రసిద్ధి చెందింది.
గసగసాలు గురించిన కొన్ని ప్రాథమిక వాస్తవాలు:
- వృక్షశాస్త్రం (బొటానికల్) పేరు: పాపవర్ సోమ్నిఫెరం (Papaver Somniferum)
- కుటుంబం: పాపవెరాసెయే
- సాధారణ పేర్లు: పోస్టా దనా, ఖుస్ ఖుస్
- భౌగోళిక విస్తీర్ణం: ఓపియం గసగసాల పంటను ఆక్స్ ఫర్డ్ షైర్, హాంప్షైర్, లింకన్ షైర్, బెర్క్షైర్ మరియు విల్ట్షైర్లలో ఓ వాణిజ్యపంట గా పండించబడుతోంది.
- ఉపయోగించే భాగాలు: విత్తనాలు, కాయలు లేదా పండ్లు, మరియు పువ్వులు