వల్వార్ క్యాన్సర్ అంటే ఏమిటి?
వల్వార్ క్యాన్సర్ ప్రధానంగా పెద్ద వయసు మహిళల్లో మెనోపాజ్ (రుతువిరతి) తర్వాత కనిపిస్తుంది. ఇది స్త్రీలలో గర్భాశయ సంబంధమైన క్యాన్సర్లలో 6% గా మరియు మహిళల క్యాన్సర్లలో 0.7%గా ఉంది. లేబియా మెజారా (labia majora) లేదా యోని పైన కప్పి ఉండే మందపాటి పెదవి వంటి భాగం వల్వార్ క్యాన్సర్లో ఎక్కువగా ప్రభావితమయ్యే భాగంగా చెప్పవచ్చు. చాలా కేసులలో, వల్వార్ క్యాన్సర్ స్క్యేమస్ సెల్ రకం (squamous cell type) మరియు దాని రీతిని బట్టి కెరాటినైజింగ్ (keratinizing), బేసలాయిడ్ (basaloid) మరియు వెర్రుకస్ (verrucous ) రకాలుగా వర్గీకరించవచ్చు.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
వల్వార్ క్యాన్సర్ యొక్క ప్రారంభ ఆరోగ్యపరమైన సంకేతాలు మరియు లక్షణాలు:
- జననేంద్రియాల దురద
- పుండ్లు
- రక్తస్రావం
- యోని నుండి స్రావాలు కారడం
- నొప్పి
- వాపు, గడ్డ లేదా పుండు ఏర్పడడం
- ల్యుకోప్లాకియా
- గజ్జలో ఉండే శోషరస కణుపుల (లింఫ్ నొడ్ల) విస్తరణ/పెరుగుదల
దాని ప్రధాన కారణాలు మరియు ప్రమాద కారకాలు ఏమిటి?
సాధారణ కారకాలు, వీటిని కలిగి ఉంటాయి:
- 50 సంవత్సరాల వయస్సు దాటి ఉండడం
- హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (HPV) సంక్రమణం/ఇన్ఫెక్షన్
- వల్వార్ ఇంట్రా ఏపిథెలియల్ నియోప్లాసియా (VIN, vulvar intraepithelial neoplasia) యొక్క ఉనికి - ఇది క్యాన్సర్ ముందు ఏర్పడే ఒక పుండు
- లైకెన్ స్క్లెరోసస్ మరియు అట్రోఫికాస్ (lichen sclerosus et atrophicus) యొక్క ఉనికి (యోని చర్మంపై దురదతో కూడిన మందపాటి ఫలకం ఏర్పడడం)
- లైంగికంగా సంక్రమించే అంటువ్యాధులు
అసాధారణ కారకాలు:
- ధూమపానం
- కిడ్నీ మార్పిడి
- సిస్టమిక్ ల్యూపస్ ఎరిథమాటోసస్ (SLE)
- ఇమ్మ్యూన్ సప్రెసెంట్ మందుల దీర్ఘకాలిక వాడకం
- సోరియాసిస్
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
రోగనిర్ధారణ కొరకు, వల్వార్ క్యాన్సర్ యొక్క రకాన్ని తెలుసుకోవడానికి మరియు ధృవీకరించడానికి జీవాణుపరీక్ష (బయాప్సీ) చేయబడుతుంది. కణితి పరిమాణం, కాన్సర్ దాడి యొక్క లోతు/తీవ్రత, మరియు నోడల్ ప్రమేయాన్ని (శోషరస కణుపుల) తెలుసుకోవడానికి కూడా జీవాణుపరీక్ష సహాయపడుతుంది. మెటాస్టాసిస్ (metastasis) ను గుర్తించిండానికి, పూర్తి బయోకెమికల్ పరీక్ష (complete biochemical testing), ఛాతీ ఎక్స్-రే, మరియు పొత్తికడుపు లేదా కటి భాగపు సిటి (CT) స్కాన్, పెట్ సిటి (PET CT) స్కాన్ వంటి ఇతర పరీక్షలు ఉంటాయి.
చికిత్సలో రేడియోథెరపీ, కెమోథెరపీ, మరియు బయోలాజికల్ థెరపీ ఉంటాయి. ఇమిక్విమోడ్ (Imiquimod) అనే సమయోచిత క్రీమ్ ను వల్వార్ క్యాన్సర్ చికిత్సకు ఉపయోగిస్తారు. లేజర్ శస్త్రచికిత్స, స్కిన్నింగ్ వుల్వేక్టమీ (skinning vulvectomy, క్యాన్సర్ కణజాలం యొక్క పై పొరను తొలగించడం) మరియు రాడికల్ వుల్వేక్టమీ (radical vulvectomy, క్లైటోరిస్, యోని పెదవులు, యోని ద్వారం మరియు సమీపంలోని శోషరస కణుపులతో సహా మొత్తం యోని యొక్క తొలగింపు) ఉన్నాయి.
వల్వార్ క్యాన్సర్ను నివారించడానికి సహాయపడే అనేక మార్గాలు ఉన్నాయి, అవి:
- ధూమపానం ఆపివేయాలి
- క్రమముగా గర్భాశయ స్మియర్ పరీక్షలు (cervical smear tests) నిర్వహించాలి
- సురక్షిత సెక్స్ ను పాటించాలి
- హ్యూమన్ పాపిల్లోమా వైరస్కు వ్యతిరేకంగా టీకామందు వేయించుకోవాలి.