విటమిన్ ఎ లోపం అంటే ఏమిటి?
రెటినాల్ అని కూడా పిలువబడే విటమిన్ ఎ, ఒక కొవ్వులో కరిగే (fat-soluble) విటమిన్. సాధారణమైన రంగుతో కూడిన దృష్టి(చూపు) కి మరియు రాత్రి సమయంలో దృష్టికి అవసరమైన రోడోప్సిన్ అని పిలవబడే ఒక ఫోటోరెసెప్టివ్ (photoreceptive) కంటి పిగ్మెంట్ ఏర్పడటానికి ఇది చాలా అవసరం. దీనితో పాటుగా, విటమిన్ ఎ కణాల పరిపక్వతకు (cell maturation) మరియు పెరుగుదలకు, రోగనిరోధక శక్తి పనితీరుకు మరియు పిండం అభివృద్ధికి సహాయపడుతుంది. విటమిన్ ఎ యొక్క లోపం అనేక రుగ్మతలకి దారితీస్తుంది, ముఖ్యంగా కంటికి మరియు దృష్టి (చూపు) కి సంబంధించిన రుగ్మతలు ఏర్పడతాయి.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
విటమిన్ ఎ అనేక విధులను నిర్వర్తించటం వలన, దాని లోపం అనేక సమస్యలకు మరియు బహుళ-అవయవాలకు (multi-systemic) సంభందించిన లక్షణాలకు దారితీస్తుంది. ఈ సంకేతాలు మరియు లక్షణాలు:
- రేచీకటి - తక్కువ కాంతి ఉన్నపుడు మరియు రాత్రి సమయాలలో దృష్టి/చూపు సరిగ్గా కనిపించకపోవడం (ఇది విటమిన్ ఎ లోపం యొక్క ప్రారంభ దశ లక్షణాలలో ఒకటి).
- జెరోప్థాల్మియా (Xerophthalmia) - కళ్లు కెరాటినైజ్(గట్టిగా/బిరుసుగా) గా మారిపోతాయి, ఈ కాళ్ళ పై పోర (కన్జక్టీవా) మరియు కార్నియా పొడి బారడానికి మరియు గట్టిపడడానికి కారణమవుతుంది. ఇది పగటి పూట కూడా దృష్టిలో సమస్యను కలిగిస్తుంది.
- బైటోట్ మచ్చలు (Bitot spots) - వ్యర్ధ ఎపిథీలియల్ కణాలు (waste epithelial cells) కాళ్ళ పై పోర (కన్జక్టీవా) మీద పేరుకుపోతాయి (పోగుపడతాయి).
- కేరాటోమలెసియా (Keratomalacia) - కార్నియా మసకగా మారుతుంది మరియు ఒరిసిపోతుంది. ఇది సహజంగా శాశ్వత గాయంలా ఏర్పడుతుంది.
- రోగ నిరోధక వ్యవస్థ ప్రతిచర్యలు బలహీనమవుతాయి.
- చర్మం- కెరాటినైజ్(గట్టిగా/బిరుసుగా) అవుతుంది, ఫలితంగా చర్మం పొడిబారి, పొలుసులుగా మరియు దురదగా ఉంటుంది.
విటమిన్ ఎ లోపం యొక్క లక్షణాలు చిన్నపిల్లలలో అధికంగా ఏర్పడతాయి మరియు వారి పెరుగుదల కూడా తగ్గిపోవచ్చు. ఈ పిల్లల్లో తీవ్రమైన/అధికమైన విటమిన్ ఎ లోపం మరణానికి కూడా దారి తీయవచ్చు.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
విటమిన్ ఎ లోపం అనేది ప్రధానంగా విటమిన్ ఎ ను తక్కువగా తీసుకోవడం వలన జరుగుతుంది, అనగా వైటమిన్ ఎ ఆహార లోపానికి దారితీసే సరిలేని ఆహార అలవాట్లు లేదా లేదా విటమిన్ ఎ ఉండే ఆహారాలని తినకపోవడం వంటివి.అది కాక ప్రోవిటమిన్ ఎ (provitamin A) అందుబాటులో లేకపోవడం మరియు విటమిన్ ఎ యొక్క శోషణ (absorption), నిల్వ (storage) లేదా రవాణా (transportation) లో అడ్డంకులు ఏర్పడడం వంటి విటమిన్ ఎ యొక్క ద్వితీయ శ్రేణి లోపం (secondary deficiency) కారణంగా కూడా విటమిన్ ఎ లోపం సంభవిస్తుంది. విటమిన్ ఎ శోషణలో అడ్డంకులు ప్యాంక్రియాటిక్ సమస్యలు (pancreatic insufficiency), సిలియక్ వ్యాధి, దీర్ఘకాలిక అతిసారం, పిత్త వాహికకు అవరోధం (bile duct obstruction), కాలేయ సిర్రోసిస్, సిస్టిక్ ఫైబ్రోసిస్ మరియు జియార్డియాసిస్ కారణంగా సంభవించవచ్చు.
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
సాధారణంగా, క్షుణ్ణంగా ఆరోగ్య చరిత్రను తెలుసుకోవడం మరియు వైద్య పరీక్ష విటమిన్ ఎ లోపాన్ని సూచిస్తుంది. భౌతిక ఆరోగ్య పరీక్షలు కాకుండా,
- సీరం రెటినాల్ స్థాయిలు (Serum retinol levels) - ఇది సాధారణంగా రోగనిర్ధారణను ధ్రువీకరించడంలో సహాయపడుతుంది
- ఆఫ్తామోలోజిక్ ఎవాల్యూయేషన్ (Ophthalmologic evaluation [కళ్ళ పరీక్షలు]) - ఆప్తల్మోస్కోప్ (ophthalmoscope) మరియు స్లిట్ లాంప్ బయోమైక్రోస్కోపీ (slit lamp biomicroscopy) మరియు కాన్ఫోకల్ మైక్రోస్కోపీ (confocal microscopy) వంటి వాటితో పరిశీలన కంటి సమస్యలను నిర్దారించడంలో సహాయపడుతుంది.
- చికిత్సా విచారణ (Therapeutic trial) - విటమిన్ ఎ సప్లీమెంట్లు ఇచ్చిన తర్వాత, లక్షణాలు మెరుగుపడడం అనేది కూడా విటమిన్ ఎ లోపాన్ని నిర్ధారించవచ్చు.
విటమిన్ ఎ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా లేదా విటమిన్ ఎ సప్లీమెంట్లను ఓరల్ (నోటి ద్వారా) గా లేదా ఇంట్రావీనస్ (నరాలలోకి) గా ఇవ్వడం ద్వారా విటమిన్ ఎ లోపం యొక్క చికిత్సను చేయవచ్చు.
- విటమిన్ ఎ యొక్క ఆహార వనరులు- గుడ్డు సొనలు, గండుమీను అను చేప కాలేయ నూనె (cod liver oil), వెన్న, చెడ్డార్ చీజ్, క్యారెట్లు, పాలకూర, కాలే, క్యాబేజీ, డాండెలియాన్ (dandelion), ఎండు మిరపకాయలు మొదలైనవి.
- సప్లిమెంట్లు: ఓరల్ లేదా ఇంజెక్టబుల్ విటమిన్ ఎ (విటమిన్ ఎ పల్మిటేట్) కూడా లోపం యొక్క చికిత్సలో సహాయపడుతుంది.