కాలా అజార్ (బ్లాక్ ఫీవర్) అంటే ఏమిటి?
బ్లాక్ ఫీవర్ (కాలా అజార్, విస్రల్ లెష్మేనియాసిస్) నెమ్మదిగా పురోగమించే మరియు అత్యంత విస్తృతముగా వ్యాపించే ఒక దీర్ఘకాలిక వ్యాధి, ఇది పునరావృత్తమయ్యే మరియు క్రమరహితమైన జ్వరం, విశేషమైన బరువు తగ్గుదల, కాలేయం మరియు ప్లీహము (spleen) యొక్క వాపు మరియు రక్తహీనత వంటి లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది వ్యాధి సోకిన సాండ్ -ఫ్లై (ఫ్లీబోటమైన్) అని పిలవబడే కీటకం యొక్క కాటు ద్వారా వ్యాపిస్తుంది. సహజంగా ఆడ సాండ్ -ఫ్లై ఈ వ్యాధిని కలిగిస్తుంది.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
ప్రభావితమైన అవయవం మీద ఆధారపడి అనేక రకాల లెష్మేనియాసిస్లు ఉన్నాయి. అత్యంత సాధారణ రకాలు చర్మం మరియు విస్రల్ (కాలేయం మరియు ప్లీహాన్ని ప్రభావితం చేస్తాయి). బ్లాక్ ఫీవర్ యొక్క సంకేతాలు మరియు లక్షణాలు:
- ఆకలి తగ్గుదల
- గణనీయమైన బరువు తగ్గుదల మరియు పాలిపోవడం
- బలహీనత
- జ్వరం
- చర్మం - పొడిబారి, పేలవంగా మరియు పొలుసులుగా మారుతుంది
- రక్తహీనత
- స్ప్లానోమెగాలి (Splenomegaly) - ప్లీహము (spleen) యొక్క విస్తరణ/పెరుగుదల, సాధారణంగా మృదువుగా/మెత్తగా మరియు సున్నితంగా మారుతుంది.
- కాలేయం - విస్తరణ/పెరుగుదల - మృదువుగా, మెత్తని/సున్నితమైన ఉపరితలంలో, పదునైన అంచులతో ఉంటుంది
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
బ్లాక్ అజార్ అనేది వెక్టర్ (వాహకం) - వ్యాధి సోకిన సాండ్ ఫ్లైస్ (ఆడ ప్లేబోటోమస్ అర్జెంటైప్స్ [Phlebotomus argentipes]) ద్వారా వ్యాపిస్తుంది . వ్యాధి సోకిన కీటకం కాటు ద్వారా (కొరకడం వల్ల) లెష్మేనియా (Leishmania) అని పిలవబడే పరాన్నజీవి రక్తప్రవాహంలోకి ప్రవేశిస్తుంది.
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
బ్లాక్ అజార్ నిర్ధారణకు 2 విధానాలు ఉన్నాయి
- రోగ లక్షణముల ఆధారంగా (Symptomatic): పైన పేర్కొన్న లక్షణాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు మరియు పర్యవేక్షిస్తారు.
- ప్రయోగశాల ఆధారిత (Laboratory) : ఇందులో పరాన్నజీవికి వ్యతిరేకంగా శరీరం ఉత్పత్తి చేసే యాంటీబాడీల తనిఖీ కోసం సెరోలాజికల్ పరీక్షలు (serological tests) ఉంటాయి మరియు పరాన్నజీవి నిర్దారణ కోసం ఎముక మజ్జ /ప్లీహము /లైంప్ నోడ్ నుండి కణజాల నమూనాను బయోప్సీ ద్వారా సేకరిస్తారు లేదా పరాన్నజీవిని సాగు చేసే మాధ్యమంలోకి సేకరిస్తారు. ఇది వ్యాధి ధృవీకరణ పరీక్షగా ఉపయోగపడుతుంది.
రోగి శరీరంలో పరాన్నజీవిని చంపడానికి యాంటీ పారాసైట్ (Anti-parasite) మందులు సహాయపడతాయి. బ్లాక్ ఫీవర్ కు వ్యతిరేకంగా ఉపయోగించే మొదటి ఓరల్ (నోటి ద్వారా తీసుకునేది) మందు మిల్టెఫోసైన్ (miltefosine). ఇది రోగులలో 95% ప్రభావవంతమైనది. బ్లాక్ ఫీవర్ కోసం టీకాలు లేదా నిరోధక మందులు అందుబాటులో లేవు అందువల్ల ఉప-సహారా దేశాలు, ఆసియా, దక్షిణ యూరోప్ మరియు అమెరికా వంటి ప్రాంతీయ ప్రాంతాల్లో ఉండేవారు నివారణ చర్యలు తీసుకోవాలి.
ఈ ప్రాంతాలలో ప్రయాణం చేస్తున్నప్పుడు పూర్తి స్లీవ్లు (పొడవు చేతులు ఉన్న) షర్టులు మరియు ప్యాంటు ధరించడం వంటి స్వీయ సంరక్షణ చర్యలు తీసుకోవాలి. పురుగుల వికర్షక స్ప్రేలను ఉపయోగించాలి మరియు సాండ్ ఫ్లైలు చురుకుగా ఉండే సాయంత్రం మరియు రాత్రి సమయంలో బయటకు వెళ్ళరాదు.