వాస్కులైటిస్ అంటే ఏమిటి?
వాస్కులైటిస్ అంటే రోగ నిరోధక వ్యవస్థ రక్తనాళాలపై దాడిచేస్తుంది, ఇది వాటి వాపుకు కారణమవుతుంది, ఇది క్రమముగా తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. శరీరంలో ప్రభావితమైన భాగాన్ని బట్టి సమస్యలు ఏర్పడతాయి.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
వాస్కులైటిస్ యొక్క సంకేతాలు మరియు లక్షణాలు దాని రకం మరియు తీవ్రత మరియు ప్రభావితమైన అవయవాల ఆధారంగా ఉంటాయి. లక్షణాలు వాస్కులైటిస్ విధానం మరియు వ్యవధిని బట్టి కూడా మారుతూ ఉంటాయి. అయితే, సాధారణంగా కనిపించే లక్షణాలు:
- జ్వరం
- బరువు మరియు/లేదా ఆకలిని కోల్పోవడం
- అలసట
- సాధారణ నొప్పులు
- చర్మ ప్రతిచర్యలు (Skin reactions)
- ఆర్థరైటిస్ లేదా కీళ్ల నొప్పులు
- దగ్గులోరక్తం పడడం
- ముక్కు లేదా నోటిలో పుండ్లు
- శ్వాస ఆడకపోవుట
- మధ్య చెవి అంటువ్యాధులు/ఇన్ఫెక్షన్లు
- వినికిడి లోపం
- ఎర్రని, దురదతో కూడిన, మరియు మండే కళ్ళు
- దృష్టి/చూపులో అస్పష్టత
- కండరాల బలహీనత
- తిమ్మిరి మరియు జలదరింపు సంచలనం
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
వాస్కులైటిస్ యొక్క సాధారణ కారణాలు:
- ఆటోఇమ్యూన్ రియాక్షన్లు
- ఇటీవలి లేదా దీర్ఘకాలిక (కొనసాగుతున్న) సంక్రమణ/ఇన్ఫెక్షన్
- కొన్ని రకాల మందులు
- కొన్ని రకాల రక్త క్యాన్సర్ లు (లుకేమియా మరియు లింఫోమా వంటివి)
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
వైద్యులు వ్యక్తి యొక్క పూర్తి ఆరోగ్య చరిత్రను తీసుకుంటారు మరియు భౌతిక పరీక్ష మరియు రక్త పోటు తనిఖీ చేస్తారు తరువాత ఈ కింది పరీక్షలు నిర్వహించబడతాయి:
రక్త పరీక్షలు వీటిని కలిగి ఉంటాయి:
- యాంటీ న్యూట్రోఫిల్ సైటోప్లాస్మిక్ యాంటీబాడీస్ (ANCA, Antineutrophil cytoplasmic antibodies)
- సి-రియాక్టివ్ ప్రోటీన్ (CRP, C-reactive protein)
- హేమోగ్లోబిన్ మరియు హేమాటోక్రిట్
- ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేటు (ESR, Erythrocyte sedimentation rate)
- మూత్రవిశ్లేషణ (Urinalysis)
- ఛాతీ ఎక్స్-రే
- జీవాణుపరీక్ష (బయాప్సి)
- ఉపిరితిత్తుల పనితీరు పరీక్షలు (Lung function tests)
- ఎలక్ట్రోకార్డియోగ్రామ్ (Lung function tests)
- ఎఖోకార్డియోగ్రఫీ (Echocardiography)
స్కాన్లు:
- ఉదర అల్ట్రాసౌండ్
- కంప్యూటెడ్ టోమోగ్రఫీ (సిటి) స్కాన్
- మాగ్నెటిక్ రెసోనెన్స్ ఇమేజింగ్ (ఎంఆర్ఐ)
- డ్యూప్లెక్స్ అల్ట్రాసోనోగ్రఫీ (Duplex ultrasonography)
- 18F- ఫ్లోరోడిఆక్సీగ్లూకోజ్ పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ (FDG-PET, 18F-fluorodeoxyglucose positron emission tomography)
- ఆంజియోగ్రఫి
వాస్కులైటిస్ యొక్క నిర్వహణ దాని రకాన్ని, తీవ్రతను మరియు ప్రభావితమైన అవయవాన్ని బట్టి ఉంటుంది, మరియు వీటిని కలిగి ఉంటుంది:
- చికిత్సలో వాస్కులైటిస్ కలిగించే వ్యాధి నిరోధక ప్రతిస్పందనను తగ్గించడం లేదా ఆపివేయడం ద్వారా వాపును తగ్గించడం జరుగుతుంది.
- వాపును తగ్గించడానికి ప్రిడ్నిసోన్ (prednisone), ప్రిడ్నిసొలోన్ (prednisolone), మరియు మిథైల ప్రిడ్నిసొలోన్ (methylprednisolone) వంటి కార్టికోస్టెరాయిడ్స్ ఇవ్వబడతాయి.
- తేలికపాటి వాస్కులైటిస్ ఉన్న వ్యక్తులకు, న్యాప్రాక్సెన్ (naproxen), ఎసిటమీనోఫెన్ (acetaminophen), ఇబుప్రోఫెన్, లేదా ఆస్పిరిన్ వంటి నొప్పి నివారిణలు సూచించబడతాయి.
- తీవ్రమైన వస్కులైటిస్ ఉన్న వ్యక్తులలో కొన్నిసార్లు కార్టికోస్టెరాయిడ్స్ సహాయకారంగా ఉండవు, అప్పుడు సైటోటాక్సిక్ మందులు (సైక్లోఫాస్ఫమైడ్ [cyclophosphamide], అజతయోప్రిన్ [azathioprine] మరియు మెతోట్రెక్సేట్ [methotrexate]) సూచించబడతాయి. అరుదైన సందర్భాల్లో, శస్త్రచికిత్స అవసరం కావచ్చు.
- కవాసాకి వ్యాధి (Kawasaki disease) వంటి వాస్కులైటిస్ వ్యాధి రకంలో, ప్రామాణిక చికిత్స ఉంటుంది దానిలో అధిక మోతాదు ఆస్పిరిన్ మరియు ఇమ్యూనోగ్లోబులైన్లు ఉంటాయి.