వాల్వ్యులర్ గుండె వ్యాధి అంటే ఏమిటి?
మానవ గుండెకు నాలుగు కవాటాలు (వాల్వ్ లు) ఉంటాయి - ద్విపత్ర (మిట్రల్ [mitral]), త్రిపత్ర (ట్రైకస్పిడ్ [tricuspid]), మహాధమని (అయోర్టిక్ [aortic]), మరియు పుపుస (పల్మనరీ [pulmonary]). ఈ కవాటాలు రక్త ప్రసరణ హృదయం లోపలికి మరియు బయటికి ప్రవహించడాన్ని నియంత్రిస్తాయి, తద్వారా హృదయంలోకి రక్తం తిరిగి ప్రవహించకుండా చేస్తాయి. గుండె యొక్క ఈ పనితీరు వాల్యులార్ గుండె వ్యాధులలో చెదిరిపోతుంది. వివిధ రకాలైన వాల్యులార్ గుండె జబ్బులు వీటిని కలిగి ఉంటాయి:
- రిగుర్గిటేషన్ (Regurgitation) : తప్పు దిశలో రక్తం ప్రవహించడం (వెనుకకు ప్రవహించడం)
- మిట్రల్ వాల్వ్ ప్రొలేప్స్ (Mitral valve prolapse): మిట్రల్ వాల్వ్ (ద్విపత్ర కవాటం) యొక్క ఫ్లాప్ (flap) గట్టిగా/దృడంగా మూసుకోదు మరియు ఫ్లాపీగా (ఆడుతూ) ఉంటుంది
- స్టెనోసిస్ (Stenosis): రక్త ప్రవాహాన్ని అడ్డుకునేలా వాల్వ్ చిన్నగా/ఇరుకుగా మారుతుంది
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
వాల్యులర్ గుండె జబ్బు యొక్క ప్రారంభ దశలలో, ఏటువంటి లక్షణాలు గుర్తించబడవు. కొందరు వ్యక్తులు శారీరక కార్యకలాపాలను/పనులను చేస్తున్నప్పుడు అలసిపోతారు, అందువల్ల, వారు శ్వాస ఆడకపోవడాన్ని లేక అలసట అనుభూతిని నివారించడానికి వారి పనిని కంచెంసేపు ఆపుతారు. సాధారణంగా ఈ పరిస్థితిలో కనిపించే కొన్ని సంకేతాలు మరియు లక్షణాలు:
- తీవ్ర అలసట, నీరసం లేదా బలహీనత యొక్క భావన
- ఏవైనా పనులు చెయ్యడం లేదా కొన్నిసార్లు మాములుగా పడుకున్నప్పుడు కూడా శ్వాస అందకపోవచ్చు/ఆడకపోవచ్చు
- చీలమండలు, అడుగులు లేదా కడుపు యొక్క వాపు
- గుండె దడ
- ఒక అసాధారణ హృదయ స్పందన లేదా గుండె గొణుగుడు (heart murmur)
- ముఖ్యంగా అయోర్టిక్ లేదా మిట్రాల్ వాల్వ్ స్టెనోసిస్ ఉన్న వ్యక్తులలో, మైకము లేదా స్పృహతప్పుట
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
వాల్యులర్ గుండె వ్యాధులకు దారి తీసే ప్రధాన కారణాలు:
- అంటువ్యాధులు
- గుండె పోటు
- గుండె వ్యాధి లేదా హాని
- పుట్టుకతో కలిగే లోపాలు
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
వాల్యులర్ గుండె వ్యాధి గుండె గొణుగుడు (heart murmur)ను కలిగిస్తుంది, ఇది ఈ వ్యాధి యొక్క అత్యంత సాధారణ సంకేతంగా ఉంటుంది మరియు దీనిని స్టెతస్కోప్ తో పరీక్షించే సమయంలో వైద్యులు గమనించవచ్చు. మర్మర్ లేని సందర్భాల్లో, వాల్యులర్ గుండె వ్యాధి యొక్క అనుమానం ఉన్నట్లయితే, గుండె పనితీరును తనిఖీ చేయడానికి వైద్యులు ఈ క్రింది పరీక్షలను సూచించవచ్చు:
- ఛాతీ ఎక్స్-రే
- ఎలెక్ట్రో కార్డియోగ్రామ్ (ECG,Electrocardiogram)
- ఎఖోకార్డియోగ్రామ్ (Echocardiogram)
- ఒత్తిడి పరీక్ష (Stress test)
- ఆంజియోగ్రామ్ (Angiogram)
చికిత్స పరిస్థితి యొక్క తీవ్రతను బట్టి ఉంటుంది మరియు కొన్ని తేలికపాటి/చిన్న సందర్భాలలో చికిత్స అవసరం కూడా ఉండదు. ఈ లక్షణాలను తగ్గించేందుకు మరియు కవాటాల (వాల్వ్) ను సరిచేసేందుకు చికిత్స చేస్తారు. వివిధ చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి అవి జీవనశైలి మార్పులు, మందులు మరియు వాల్వ్ లను సరిచేసే విధానాలు.
జీవనశైలి మార్పులు వీటిని కలిగి ఉంటాయి:
- ఒక ఆరోగ్యకరమైన ఆహారవిధానాన్ని పాటించాలి
- దూమపానం ఆపివేయాలి
- అధిక శ్రమతో కూడిన క్రీడల నుండి దూరంగా ఉండాలి
- అధిక శ్రమను నివారించాలి
క్రింది విధులు కోసం మందులు ఉన్నాయి:
- బీటా బ్లాకర్స్, వాసోడైలేటర్స్ (vasodilators), ఏసిఇ ఇన్హిబిటార్స్ (ACE inhibitors) ను ఉపయోగించి రక్తపోటును మరియు హృదయ స్పందనను నిర్వహించడం
- బ్లడ్ థిన్నర్స్ (blood thinners) ను ఉపయోగించి రక్తం గడ్డకట్టడాన్ని నిరోధించడం
- డైయూరిటిక్స్ (diuretics) వాడకం ద్వారా శరీరం నుండి అదనపు ద్రవాన్ని తొలగించడం
- యాంటీ- అర్థిమిక్ (anti-arrhythmic) మందులు ఉపయోగించి గుండె యొక్క లయ నిర్వహించడం
దెబ్బతిన్న లేదా గాయపడిన వాల్వ్ ల చికిత్సకు ఉపయోగించే పద్ధతులు:
-
వ్యక్తి వ్యాధి యొక్క తీవ్రత, వయస్సు, మరియు ఇతర కోమోర్బిడిటీల (comorbidities) ఆధారంగా కొంత మంది వ్యక్తులలో వాల్వ్ రిపేర్ దానిని వాల్వ్ రెప్లసిమెంట్ అని కూడా పిలుస్తారు అనే విధానం సలహా ఇవ్వబడుతుంది.