మూత్రమార్గ క్యాన్సర్ అంటే ఏమిటి?
మూత్రమార్గములోని కణాల యొక్క నియంత్రం లేని మరియు సమన్వయం లేని పెరుగుదల/వృద్ధి మూత్రమార్గ క్యాన్సర్ ను సూచిస్తుంది. ఇది చాలా అరుదైనది మరియు సాధారణంగా, పురుషులు ప్రభావితమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
కొన్ని సాధారణ సంకేతాలు మరియు లక్షణాలు:
- మూత్ర మార్గం మీద గడ్డ లేదా వాపు
- మూత్రంలో రక్తం
- తరచుగా మూత్ర విసర్జన కావడం
- మూత్ర ప్రవాహంబలహీనంగా ఉండడం (చిన్నగా/నెమ్మదిగా)
- మూత్రవిసర్జనలో సమస్య లేదా నొప్పి
- మూత్ర ప్రవాహం తగ్గిపోవడం
- మూత్ర మార్గం నుండి రక్త మరకలతో కూడిన స్రావాలు
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
ఈ క్యాన్సర్ యొక్క ఖచ్చితమైన కారణం ఇంకా తెలియలేదు. అయితే, కొన్ని సంభావ్య కారణాలు:
- యూరెత్రల్ డైవర్టికులం (Urethral diverticulum)
- దీర్ఘకాలిక మూత్ర నాళాల సంక్రమణం (Chronic urinary tract infection)
- హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (హెచ్.పి.వి) సంక్రమణం (Human papilloma virus (HPV) infection)
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
వైద్యుడు గడ్డల ఉనికి కోసం లేదా అసాధారణ సంకేతాలు కోసం భౌతిక తనిఖీ చేస్తారు. రోగి ఆరోగ్య చరిత్ర గురించి పూర్తిగా తెలుసుకుంటారు. కొన్ని నిర్వహిచే పరీక్షలు ఈ కింది విధంగా ఉంటాయి:
- కటి భాగ పరీక్ష (Pelvic exam) - యోని, గర్భాశయ ద్వారం, గర్భాశయం, ఫెలోపియన్ ట్యూబులు, అండాశయము మరియు పురీషనాళం యొక్క లోపాల కోసం తనిఖీ చేయబడతాయి.
- మూత్ర అంచనా (Urinalysis) - ఇది మూత్రంలో చక్కెర, ప్రోటీన్, రక్తం మరియు తెల్ల రక్త కణాలు మరియు మూత్రం యొక్క రంగు యొక్క తనిఖీ చేస్తుంది.
- డిజిటల్ రెక్టల్ పరీక్ష (Digital rectal examination)
- యూరిన్ సైటోలజీ (Urine cytology) - మూత్రంలో బ్యాక్టీరియా తనిఖీ కోసం మైక్రోస్కోప్ ద్వారా పరిశీలన
- పూర్తి రక్త గణన (Complete blood count) - ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్లు మరియు హేమోగ్లోబిన్ స్థాయిలు ఈ పరీక్ష ద్వారా తనిఖీ చేయబడతాయి.
- బ్లడ్ కెమిస్ట్రీ అధ్యయనాలు (Blood chemistry studies)
- సిటి (CT) స్కాన్, ఎంఆర్ఐ (MRI) మరియు అల్ట్రాసౌండ్.
- యూరేటిరోస్కోపీ (Ureteroscopy) - మూత్రనాళము మరియు పొత్తికడుపు లోపలి భాగాలలోని అసాధారణతలు ఒక కెమెరా ఉపయోగించి సరిగ్గా/పూర్తిగా పరిశీలిస్తారు.
- జీవాణుపరీక్ష (బయాప్సి)
రోగనిర్ధారణ తరువాత, రోగికి వివిధ పద్ధతుల ద్వారా చికిత్స చేస్తారు:
- శస్త్రచికిత్స (సర్జరీ)
- రేడియోథెరపీ - ఇది గామా (gamma) మరియు ఇతర కిరణాలను ఉపయోగించి క్యాన్సర్ లేదా కణితి యొక్క కణాలను చంపడంలో సహాయపడుతుంది.
- కెమోథెరపీ - దీనిలో ప్రత్యేక ఔషధాలను/మందులను ఉపయోగించి క్యాన్సర్ కణాలు చంపడం ద్వారా వాటి వృద్ధిని ఆపుతారు మళ్ళి అవి పెరగకుండా చేస్తారు.
- క్రియాశీలక నిఘా (Active surveillance) - అంటే పరీక్ష ఫలితాల్లో మార్పులేవీ లేనంత వరకు ఎటువంటి చికిత్సలు అందించబడవు. పరీక్షలు మరియు పరిశోధనలు క్రమంగా షెడ్యూల్ ప్రకారం జరుగుతాయి.