వ్రణోత్పత్తి పెద్దప్రేగు - Ulcerative Colitis in Telugu

Dr. Rajalakshmi VK (AIIMS)MBBS

February 05, 2019

March 06, 2020

వ్రణోత్పత్తి పెద్దప్రేగు
వ్రణోత్పత్తి పెద్దప్రేగు

సారాంశం

అల్సరేటివ్ కొలిటిస్ (వ్రణోత్పత్తి పెద్ద ప్రేగు శోథ) (యుసి) అనునది ఒక దీర్ఘ-కాల రుగ్మత, ఇది జీర్ణ వ్యవస్థ యొక్క పెద్ద ప్రేగు పైన ప్రభావమును చూపిస్తుంది.  అల్సరేటివ్ కొలిటిస్ యొక్క ప్రాథమిక లక్షణాలు అనునవి పొత్తి కడుపులో నొప్పి మరియు ప్రేగు రక్త స్రావం (మంట లేక వాపు యొక్క ఫలితముగా ఏర్పడుతుంది).  అల్సరేటివ్ కొలిటిస్ యొక్క ఇతర సాధారణ లక్షణాలు, తరచుగా విరేచనాలు, రక్తముతో కూడిన మలము, మరియు కడుపులో పుండ్లు అనునవి.  అల్సరేటివ్ కొలిటిస్ యొక్క చరిత్ర కలిగిన వ్యక్తి యొక్క కుటుంబం అనునది దానిని అభివృధ్ధి చేయడములో అధిక ప్రమాదమును కలిగి ఉంటుంది.  ఆహారము మరియు వాతావరణ మార్పులు అను కారణాల వలన అల్సరేటివ్ కొలిటిస్ అనునవి చాలా దారుణముగా తయారవుతాయి.  వివిధ లేబొరేటరీ పరీక్షలు మరియు శారీరక పరీక్షలను ఉపయోగించి దీని యొక్క నిర్దారణ చేయవచ్చు.  అల్సరేటివ్ కొలిటిస్ యొక్క చికిత్సా ఎంపికలు మందులు మరియు శస్త్రచికిత్సలను కలిగిఉంటాయి.  అల్సరేటివ్ కొలిటిస్ నుండి ఏర్పడే సమస్యలు చాలా సాధారణముగా ఉన్నప్పటికినీ, ఒకవేళ మంట విస్తరిస్తుంటే, ప్రజలు అధికమైన లక్షణాల ద్వారా బాధపడతారు.

వ్రణోత్పత్తి పెద్దప్రేగు అంటే ఏమిటి? - What is Ulcerative Colitis in Telugu

అల్సరేటివ్ కొలిటిస్ అనునది ప్రపంచవ్యాప్తముగా ఉన్న ప్రజలను ప్రభావితం చేస్తుంది, ఎక్కువ భాగం ప్రజలు 25 సంవత్సరాల కంటే ముందే ఇంప్లమ్మెటరీ బవల్ వ్యాది(తాపజనక ప్రేగు వ్యాధి)చేత రోగ నిర్ధారణ చేయబడుచున్నారు. అల్సరేటివ్ కొలిటిస్ అనునది ప్రాథమికముగా పెద్ద ప్రేగును ప్రభావితం చేస్తుంది.  ఇది పెద్ద ప్రేగు మరియు పురీషనాళము యొక్క వాపు చేత వర్గీకరించబడుతుంది, ఇవి రెండూ కలిసి పెద్ద ప్రేగును ఏర్పరుస్తాయి.  ఇది పురీషనాళములో ప్రారంభమవుతుంది మరియు పెద్ద ప్రేగు యొక్క దిగువ భాగమునకు వెళుతుంది. ఇది జీవితకాల పరిస్థితి, దీనికి చికిత్స చేయవచ్చు మరియు దీనిని నిర్వహించవచ్చు అయితే నయం చేయలేము.

అల్సరేటివ్ కొలిటిస్ అనునది ఇంప్లమ్మెటరీ బవల్ వ్యాధి (ఐబిడి) యొక్క రూపము, ఇది ఇర్రిటబుల్ బవల్ సిండ్రోమ్ (ఐబిఎస్) లేక క్రోన్ యొక్క వ్యాధి తో గందరగోళమును ఏర్పరచధు.

  • ఇర్రిటబుల్ బవల్ సిండ్రోమ్ అనునది ఒక చాలా సాధారణ రుగ్మత, ఇది అసౌకర్యమును ఏర్పరుస్తుంది మరియు లక్షణాలు అనునవి స్వల్పమైనవి అయితే పునరావృతమవుతాయి పొత్తికడుపులో నొప్పిఉబ్బరం మరియు మలబద్ధకం. అయితే, అల్సరేటివ్ కొలిటిస్ లో, పెద్ద ప్రేగు యొక్క  మంట లేక వాపు అనునది పుండ్లు మరియు పూతలకు దారితీస్తుంది.
  • క్రోన్ యొక్క వ్యాధి ఇది జీర్ణాశయము లోని ఏ భాగమునైనా ప్రభావితం చేస్తుంది.  అయితే  అల్సరేటివ్ కొలిటిస్ అనునది ప్రధానముగా పెద్ద ప్రేగు యొక్క దిగువ భాగమును ప్రభావితం చేస్తుంది (పురీష నాళము).  అయితే, కొంత మంది ప్రజలలో, ఇది పూర్తి లేక మొత్తం పెద్ద ప్రేగును ప్రభావితం చేస్తుంది.  

వ్రణోత్పత్తి పెద్దప్రేగు యొక్క లక్షణాలు - Symptoms of Ulcerative Colitis in Telugu

ఇక్కడ అల్సరేటివ్ కొలిటిస్ యొక్క కొన్ని విశిష్టమైన లక్షణాలు కలవు, ఇవి కొన్ని సార్లు తప్పుగా అజీర్ణంయొక్క లక్షణాలుగా గుర్తించబడతాయి.  అత్యంత సాధారణ లక్షణాలు వీటిని కలిగిఉంటాయి:

ఇక్కడ కొన్ని లక్షణాలు కలవు, ఇవి తక్కువ సాధారణమైనవి అయితే ఇవి అల్సరేటివ్ కొలిటిస్ యొక్క లక్షణాలుగా నమోదయ్యాయి.  ఈ లక్షణాలు అనునవి అధిక సాధారణ లక్షణాలతో చేర్చబడి ఉంటాయి.  మంట ఏర్పడిన సమయములో స్వల్ప సాధారణ లక్షణాలు అనునవి అత్యధికముగా అనుభవించబడతాయి (లక్షణాలు అకస్మాత్తుగా చాలా తీవ్రముగా ఉన్నప్పుడు)  ఈ స్వల్ప సాధారణ లక్షణాలు వీటిని కలిగి ఉంటాయి:

తీవ్రమైన సందర్భాలలో, ఒక రోజులో ఆరు లేక అంతకంటే ఎక్కువ విరేచనాలు కలుగుతాయి, అదనపు లక్షణాలుగా వీటిని చూడవచ్చు:

వ్రణోత్పత్తి పెద్దప్రేగు యొక్క చికిత్స - Treatment of Ulcerative Colitis in Telugu

అల్సరేటివ్ కొలిటిస్ కొరకు ఏవిధమైన చికిత్స లేనప్పటికీ,  ప్రజల యొక్క రోగ నిరోధక వ్యవస్థను ఉత్తమముగా క్రమబద్దము చేయుటలో వారికి సహాయ చేయడము అనునది చికిత్స యొక్క లక్ష్యము.  అల్సరేటివ్ కొలిటిస్ ప్రజల యొక్క నాణ్యమైన జీవితముపైన ప్రభావము చూపిస్తాయి.  చికిత్సా పధ్ధతుల యొక్క మిశ్రమము అనునది,  మంటను తగ్గించడములో మరియు లక్షణాలను నియంత్రించడములో సహాయం చేస్తుంది.

మందులు

అల్సరేటివ్ కొలిటిస్ యొక్క చికిత్స కొరకు సూచించబడిన మందులు పెద్ద ప్రేగు యొక్క బాధను తగ్గించడములో పనిచేస్తాయి మరియు కణజాలం సహజముగా నయము అయ్యేటట్లు చేస్తాయి.   ఇతర లక్షణాలు అనగా తరచుగా విరేచనాలు, నొప్పి, మరియు రక్తస్రావం అనునవి కూడా మందులతో అణగిపోతాయి.  మందులు మంటను తగ్గించడానికి సహాయంచేస్తాయి, ఇది ప్రేగు శోథ సహజముగా నయం కావడానికి సమయమును ఇస్తుంది.  మందులు ప్రేరేపించడము మాత్రమే కాక ఉపశమనమును కూడా నిర్వహిస్తాయి అయితే ఈ ప్రజల జీవితాల యొక్క నాణ్యతను మెరుగుపరచడానికి  కూడా సహాయం చేస్తాయి.

ఈ మందులు వీటిని కలిగి ఉంటాయి:

  • అమినోసలిసైలేట్స్
    ఇవి మందులు, ఇవి మంటను నియంత్రించడానికి సహాయం చేస్తాయి.  ఈ మందులను తేలికపాటి లక్షణాల నుండి తీవ్రమైన లక్షణాల వరకు గల ప్రజలకు సూచిస్తారు.  అమినోసలిసైలేట్స్ అనునవి ఓరల్ (నోటి ద్వారా) తీసుకునే మందులు మరియు ఇవి బాగా తట్టుకుంటాయి.
  • కార్టికోస్టెరాయిడ్స్
    కార్టికోస్టెరాయిడ్స్ అనునవి రోగనిరోధక వ్యవస్థ యొక్క కార్యకలాపాలు తగ్గించడం ద్వారా మరియు బాధను తగ్గించడం ద్వారా పనిచేస్తాయి.  వీటిని సాధారణముగా తీవ్రమైన లక్షణాలు గల ప్రజలకు సూచిస్తారు.  ఇవి దీర్ఘ-కాల ఉపయోగము కొరకు సూచింపబడ్డాయి మరియు కొన్ని దుష్పలితాలను అనగా మొటిమలు, బరువు పెరగడం, మరియు మానసిక కల్లోలము వంటి వాటిని కలిగిఉంటాయి.
  • రోగనిరోధక-మాడ్యులేటర్స్
    వీటిని, ఏ విధమైన రూపములో ఉన్న మందులకైనను ప్రతిస్పందించని ప్రజలకు మాత్రమే సూచించబడ్డాయి.  రోగనిరోధక-మాడ్యులేటర్స్ రోగ నిరోధక వ్యవస్థను అణచివేస్తాయి మరియు బాధను తగ్గిస్తాయి.  ఈ మందులు, ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చిన ప్రమాదము మరియు కొంచెముగా హాని తీవ్రత పెరిగిన చర్మ క్యాన్సర్లుఅను వాటితో కలిపి వస్తాయి. అందువలన, వీటిని సరియైన వైద్య సంప్రదింపులు జరిపిన తరువాత మాత్రమే తీసుకోవాలి.
  • బయోలాజిక్స్
    బయోలాజిక్స్ కూడా రోగ నిరోధక వ్యవస్థ లక్ష్యముగా పనిచేస్తాయి మరియు బాధను తగ్గించే క్రమములో దాని యొక్క చర్యలను అణచివేస్తాయి.

లక్షణాలు సంభవించే పెద్ద ప్రేగు ప్రాంతము పైన ఆధారపడి మందులు అనునవి నిర్వహించబడతాయి లేక తీసుకొనబడతాయి.  మందులు ఈ విధముగా నిర్వహించబడతాయి:

  • ఎనీమా (ఉదర శుధ్ధి) (పురీషనాళము లోనికి ద్రవ రూపములో మందులను చేర్చడం ద్వారా)
  • మల నురుగు.
  • సపోసిటరీ (మిసైల్) (పురీషనాళము లోనికి ఘన రూపములో ఉండి మరియు కరిగేటటువంటి మందులను పంపించడం).
  • IV లేక ఇంట్రావీనస్ (సిర) (సిరలు ద్వారా నిర్వహించుట).
  • అలాగే కొన్ని మందులను నోటి ద్వారా తీసుకుంటారు.

కాంబినేషన్ థెరపీ

ఒకే సమయములో రెండు థెరపీలను ఉపయోగించడము ద్వారా సమర్థవంతమైన ఫలితాలను పొందడం మరియు లక్షణాలను బాగుగా నిర్వహించడం, దీనినే కాంబినేషన్ థెరపీ అంటారు.  అయితే, కాంబినేషన్ థెరపీని విస్తృతముగా సూచించలేదు ఎందుకనగా ఇది దానికి సంబంధించిన కొన్నిదుష్పలితాలను కలిగి ఉంది మరియు ఇంతకు మునుపు వాడిన మందుల యొక్క సమర్థత కూడా తగ్గించబడవచ్చు.

శస్త్ర చికిత్స

  • డ్రగ్ థెరపీ వాడిన ప్రజలలో ఏ విధమైన పురోగతి లేకపోతే మరియు సమస్యలు ప్రారంభమయితే, సర్జరీ అనునది రికమెండ్ చేయబడుతుంది.  సర్జరీ అనునది పురీషనాళం సహా మొత్తం పెద్ద ప్రేగును తొలగించుటలో పాల్గొంటుంది, పూర్తిగా లక్షణాలను వదిలించుకొంటుంది.  అల్సరేటివ్ కొలిటిస్ కు సంబంధించి విభిన్న రకాల చికిత్సలు కలవు.  మొదటిది పొత్తికడుపు పైన ఒక ఓపనింగ్ ను సృష్టించడము తో పాటు మొత్తం పెద్ద ప్రేగు మరియు పురీషనాళము యొక్క తొలగింపులో పాల్గొంటుంది, దీని ద్వారా వ్యర్థమైన పదార్థాలను ఒక పౌచ్ లోనికి తగ్గించడము ద్వారా ఖాళీ చేయవచ్చు.  పౌచ్ అనునది పొత్తి కడుపు చర్మము పైన జిగురుతో జతచేయబడి ఉంటుంది.
  • ఇతర సర్జికల్ ఎంపికలు కూడా పెద్ద ప్రేగును తొలగిస్తాయి అయితే అంతర్గత పౌచ్ ను సృష్టంచడములో  పాల్గొం,టుంది, ఇది ఆనల్ స్పింక్టఫ్ కండరానికి జతచేయబడి ఉంటుంది. రెండు పధ్ధతుల వలన రికవరీ అనునది 4-6 వరకు ఉంటుంది.

జీవనశైలి నిర్వహణ

అల్సరేటివ్ కొలిటిస్ యొక్క నిర్వహణలో న్యూట్రిషన్ అనునది ముఖ్యమైనది. ఆహారములో మార్పులు అనునవి లక్షణాలను నిర్వహించడములో సహాయపడతాయి మరియు అదే విధముగా మంటను తగ్గిస్తాయి.  కొన్ని సిఫార్సు చేయబడిన ఆహార మార్పులు వీటిని కలిగి ఉంటాయి:

  • సోడాలను మరియు కార్బొనేటెడ్ పానీయాలను దూరముగా ఉంచడం.
  • ఎక్కువ ద్రవాలు అనగా నీరు మరియు పండ్ల జ్యూసుల వినియోగము.
  • అధిక ఫైబర్ ఆహారము అనగా గింజలు మరియు కూరగాయల తోలు కలిగినది.
  • మసాలా పదార్థాలను దూరముగా ఉంచడం.
  • క్రమముగా ఉపయోగించే పెయిన్ కిల్లర్స్ ను దూరముగా ఉంచడం.
  • ఎక్కువగా ఆహారమును తినే బదులుగా రోజంతా కొద్ది కొద్దిగా ఆహారమును తినాలి.

ప్రేగుల నుండి న్యూట్రిషన్ల యొక్క స్వల్ప శోషణ సంధర్బములో, డాక్టరును కలిసిన తరువాత ఒక వ్యక్తి తీసుకోవాల్సిన మందులు ఇక్కడ ఇవ్వబడ్డాయి.  లక్షణాల పైన ఆధారపడి, అనుసరించాల్సిన ఆహారపు అలవాట్ల సిఫార్సులు క్రింద తయారుచేయబడ్డాయి:

  • తక్కువ-ఉప్పు గల ఆహారం.
  • తక్కువ-ఫైబర్ గల ఆహారం.
  • తక్కువ-క్రొవ్వు గల ఆహారం
  • లాక్టోజ్-లేని ఆహారం
  • అధిక-కేలరీ ఆహారం

ఆరోగ్యకరమైన ఆహారమును నిర్వహించుట చాలా ముఖ్యమైనది, ఒక వ్యక్తి యొక్క లక్షణాల ప్రకారముగా ఇది ప్రణాళిక చేయబడుతుంది.  అందువలన, ఒక వ్యక్తి తీసుకునే లేక తీసుకోకూడని ఆహార పదార్థాలకు సంబంధించి డాక్టరును సంప్రదించడం అవసరం.

అల్సరేటివ్ కొలిటిస్ కలిగిన వ్యక్తి ఖచ్చితముగా కొలొనోస్కోపీ అనుదానిని ప్రతీ ఒకటి లేక మూడు సంవత్సరాలకు చేయించుకోవాలి (సంవత్సరానికి ఒకసారి లేక 3 సంవత్సరాలకు ఒకసారి, డాక్టరు సిఫార్సు చేసిన ప్రకారముగా).

Digestive Tablets
₹312  ₹349  10% OFF
BUY NOW


వనరులు

  1. American College of Gastroenterology [Internet] 6400 Goldsboro Rd, Bethesda, MD 20817; Ulcerative Colitis.
  2. Crohn's & Colitis Foundation [Internet] New York, United States; Types of Ulcerative Colitis.
  3. National Health Service [Internet]. UK; Ulcerative Colitis.
  4. National Institute of Diabetes and Digestive and Kidney Diseases [internet]: US Department of Health and Human Services; Ulcerative Colitis.
  5. American Society of Colon and Rectal Surgeons [Internet] Columbus, Ohio; Ulcerative Colitis.
  6. Crohn's & Colitis Foundation [Internet] New York, United States; Colitis Treatment Options.

వ్రణోత్పత్తి పెద్దప్రేగు వైద్యులు

Dr. Paramjeet Singh. Dr. Paramjeet Singh. Gastroenterology
10 Years of Experience
Dr. Nikhil Bhangale Dr. Nikhil Bhangale Gastroenterology
10 Years of Experience
Dr Jagdish Singh Dr Jagdish Singh Gastroenterology
12 Years of Experience
Dr. Deepak Sharma Dr. Deepak Sharma Gastroenterology
12 Years of Experience
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు

వ్రణోత్పత్తి పెద్దప్రేగు కొరకు మందులు

Medicines listed below are available for వ్రణోత్పత్తి పెద్దప్రేగు. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.