టోక్సోప్లాస్మోసిస్ - Toxoplasmosis in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

January 12, 2019

March 06, 2020

టోక్సోప్లాస్మోసిస్
టోక్సోప్లాస్మోసిస్

టోక్సోప్లాస్మోసిస్ అంటే ఏమిటి?

టోక్సోప్లాస్మోసిస్ అనేది టోక్సోప్లాస్మా గోండి అని పిలవబడే ఒక పరాన్నజీవి యొక్క సంక్రమణం. ఈ పరాన్నజీవి పలు జంతువులలో మరియు పక్షులలో, ముఖ్యంగా పిల్లులలో ఎక్కువగా కనబడుతుంది.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

సంక్రమణ ఏటువంటి లక్షణాలను కలిగించకుండా ఉండవచ్చు. అయినప్పటికీ, లక్షణాలు ఏర్పడితే, అవి వ్యక్తి యొక్క రోగనిరోధక ప్రతిస్పందన మీద ఆధారపడి ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికీ మారుతూ ఉంటాయి. బలమైన రోగనిరోధక శక్తి ఉన్న వ్యక్తులలో ఈ క్రింది లక్షణాలను గమనించవచ్చు:

బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న వ్యక్తులలో ఈ క్రింది లక్షణాలు కలుగవచ్చు:

  • మూర్చ
  • తీవ్రమైన తలనొప్పి
  • దృష్టి/చూపు సమస్యలు
  • మానసిక గందరగోళం

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

క్రింది కారణాల వల్ల టోక్సోప్లాస్మోసిస్ సంభవిస్తుంది:

  • అనేక జంతు జాతుల (animal species) లో  ఈ పరాన్నజీవి ఉంటుంది, అందువలన సరిగ్గా వండని/ఉడకని మాంసం తినడం అనేది ఈ సంక్రమణకు దారి తీస్తుంది.
  • కలుషితమైన నీటిని తీసుకోవడం/తాగడం ద్వారా ఈ పరాన్నజీవి మానవ శరీరంలోకి ప్రవేశించవచ్చు.
  • వ్యాధి సంక్రమిత పిల్లి మలానికి దగ్గరగా వెళ్లడం వల్ల కూడా సంక్రమణను కలిగిస్తుంది.
  • కొన్ని సందర్భాల్లో, సంక్రమిత తల్లి నుండి పుట్టబోయే బిడ్డకు (కంజెనిటల్ వ్యాప్తి) లేదా కలుషిత రక్తంతో రక్త మార్పిడి ద్వారా కూడా వ్యాపించవచ్చు.

దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

టోక్సోప్లాస్మోసిస్ను నిర్ధారించడానికి, ఈ క్రింది పరీక్షలు నిర్వహించవచ్చు:

  • పరాన్నజీవికి వ్యతిరేకంగా శరీరం ఉత్పత్తి చేసిన యాంటీ బాడీలను పరిశీలించడానికి  రక్త పరీక్షలు
  • సిటి (CT) స్కాన్
  • ఎంఆర్ఐ (MRI) స్కాన్
  • జీవాణుపరీక్ష (బయాప్సి)
  • పరాన్నజీవి ఉనికి యొక్క తనిఖీ కోసం మల పరీక్ష

రోగనిర్ధారణ యొక్క ధృవీకరణ తర్వాత, వైద్యులు అల్పెండజోల్  (Albendazole) వంటి యాంటీహేల్మింతిక్స్ అని పిలవబడే మందులతో చికిత్స చేస్తారు. ఏమైనప్పటికీ, చాలామంది వ్యక్తులలో, ఏ చికిత్స అవసరం లేకుండా కొన్ని వారాలలోనే లక్షణాలు తగ్గిపోవచ్చు.

బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న వ్యక్తులలో మందులు అత్యవసరం అవుతాయి. ఏవైనా ఇతర సంక్లిష్టతలకు దారితీయకపోతే ఈ సంక్రమణకు సులభంగా చికిత్స చేయవచ్చు.

సంక్రమణను నివారించడానికి, సురక్షితంగా మరియు సరిగ్గా వండిన మాంసాన్ని తీసుకోవాలి మరియు పిల్లి వ్యర్థలతో వ్యహరించే సమయంలో పరిశుభ్రతను మరియు జాగ్రత్తను పాటించాలి. సంక్రమణ వ్యాప్తిని నివారించడం కోసం పచ్చి మాంసాన్ని తాకిన/పట్టుకున్న తరువాత సబ్బు మరియు నీటితో చేతులను శుభ్రంగా కడుక్కోవడం చాలా ముఖ్యం.



వనరులు

  1. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Parasites - Toxoplasmosis (Toxoplasma infection).
  2. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Epidemiology & Risk Factors.
  3. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Toxoplasmosis.
  4. National Health Service [Internet]. UK; Toxoplasmosis: diagnosis, epidemiology and prevention.
  5. Dubey JP. Toxoplasma Gondii. In: Baron S, editor. Medical Microbiology. 4th edition. Galveston (TX): University of Texas Medical Branch at Galveston; 1996. Chapter 84. Toxoplasma Gondii.

టోక్సోప్లాస్మోసిస్ కొరకు మందులు

Medicines listed below are available for టోక్సోప్లాస్మోసిస్. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.

Medicine Name

Price

₹89.01

Showing 1 to 0 of 1 entries