టొరెట్ట్ సిండ్రోమ్ అంటే ఏమిటి?
టొరెట్ట్ సిండ్రోమ్ అనేది నాడీ వ్యవస్థ యొక్క పరిస్థితి, ఇది వ్యక్తి ఆకస్మిక మరియు అసంకల్పిత కదలికలు లేదా ధ్వనులను చేసేలా చేస్తుంది. ఈ ఆకస్మిక ధ్వనులు లేదా కదలికలు టిక్స్ (tics) అని పిలుస్తారు, మరియు ఈ సిండ్రోమ్ ప్రభావం తేలికపాటి నుండి తీవ్రంగా ఉండవచ్చు.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
టొరెట్ట్ సిండ్రోమ్ యొక్క రెండు ప్రధాన లక్షణాలు మోటార్ టిక్స్ (motor tics, కదలికలకు సంబంధించినవి) మరియు వెర్బల్ టిక్స్ (verbal tics, నోటితో చేసే ధ్వనులు).
మోటార్ టిక్స్ అసంకల్పిత మరియు ఆకస్మిక కదలికలను సూచిస్తాయి. మోటార్ టిక్స్ వీటిని కలిగి ఉంటాయి:
- కన్ను కొట్టుకోవడం/మిటకరించడం/రెప్ప పాటు
- ముఖ చిట్లించడం (facial grimacing)
- ఆకస్మిక దవడ కదలికలు
- తల ఊపడం
- గంతులు వెయ్యడం (జంపింగ్)
- భుజాలు ఎగురవేయడం (shoulder shrugging)
- ఆకస్మికంగా నోరు తెరవడం
- చేతులు ఊపడం
వెర్బల్ టిక్స్ అంటే వ్యక్తి అసంకల్పితంగా చేసే శబ్దాలను సూచిస్తాయి. ఈ శబ్దాలు అర్ధవంతమైనవి కావు మరియు చాలా సార్లు సందర్భానుసారంగా కూడా ఉండవు. వెర్బల్ టిక్స్ వీటిని కలిగి ఉంటాయి:
- ఊపిరి ఘాడంగా తీసుకున్న శబ్దం (sniffing)
- కూతలు (hooting)
- అరవటం (shouting)
- మూలగడం (grunting)
కొన్ని సందర్భాల్లో, వెర్బల్ టిక్స్లో తిట్లు కూడా ఉండవచ్చు లేదా కొన్ని ఇతర ఆమోదయోగ్యము కానీ పదాలు (చెడ్డ పదాలు) కూడా ఉండవచ్చు. అయితే, ఇది చాలా అరుదు.
టొరెట్ట్ సిండ్రోమ్ కొన్ని ఇతర సమస్యలతో పాటు కూడా సంభవించవచ్చు, అవి.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
టొరెట్ట్ సిండ్రోమ్ యొక్క ఖచ్చితమైన కారణం ఇంకా తెలియలేదు, ఐతే చాలామంది వైద్య పరిశోధకులు మెదడు మరియు జన్యువులలోని నిర్మాణాత్మక వ్యత్యాసాల (structural differences) వలన ఏర్పడవచ్చు అని భావిస్తున్నారు. టొరెట్ట్ సిండ్రోమ్ ఉన్న కుటుంబ చరిత్ర కలిగిన వ్యక్తులలో వారసత్వంగా ఈ వ్యాధి సంభవించే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
ఈ సిండ్రోమ్ మగవారిలో అధికంగా సంభవిస్తుంది, అందువలన మగవారు ప్రమాద కారకంగా పరిగణించబడతారు.
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
వ్యక్తిలో టొరెట్ట్ సిండ్రోమ్ ఉనికి నిర్దారించడానికి, అతడు ఈ క్రింది పరిస్థితులను కలిగి ఉండాలి:
- వ్యక్తికి కనీసం రెండు రకాల మోటార్ టిక్స్ మరియు ఒక వెర్బల్ టిక్ ఉండాలి.
- వ్యక్తి కనీసం ఒక సంవత్సరం పాటు ఈ టిక్స్ ను ఎదుర్కొంటూ వుండాలి.
- 18 సంవత్సరాల వయస్సులోపు టిక్స్ కనిపించడం ప్రారంభించాలి.
- మందులు వంటి బాహ్య కారకాల వలన ఈ లక్షణాలను కలుగరాదు.
టొరెట్ట్ సిండ్రోమ్ యొక్క చికిత్స పరిమితంగా ఉంది.
అయినప్పటికీ, చాలా సందర్భాలలో వ్యక్తి యొక్క రోజువారీ కార్యకలాపాలకు ఆటంకం కలిగించేలా ఈ లక్షణాలు ఉండవు. కాబట్టి, సరైన సహకారం మరియు మార్గదర్శకత్వం (guidance) తో ప్రభావిత వ్యక్తులు సమస్యను సమర్థవంతంగా నిర్వహించగలరు.
కొన్ని సందర్భాల్లో, ఇతర సంబంధిత రుగ్మతల లక్షణాలను నియంత్రించడానికి మందులు సూచించబడవచ్చు. చికిత్స మరియు కౌన్సిలింగ్ అలాగే టొరెట్ట్ సిండ్రోమ్ గురించి వ్యక్తులకు మరియు కుటుంబ సభ్యులకు పూర్తిగా తెలియజేయడం కూడా దానిని నిర్వహించడంలో బాగా సహాయపడుతుంది.