నాలుక మీద పుండు అంటే ఏమిటి?
నాలుక మీద పుండ్లు అనేవి నాలుక మీద/పైన లేదా క్రింద కనిపించే బహిరంగ/తెరచి ఉండే పుండ్లు, మరియు ఇది తీవ్రమైన మరియు ప్రాణాంతకమైన పరిస్థితి కానప్పటికీ, సాధారణంగా ప్రభావిత వ్యక్తికి చాలా అసౌకర్యాన్ని కలిగిస్తుంది. నాలుక మీద పుండు యొక్క కారణం నోటిలోని ఇతర భాగాల పుండ్ల యొక్క కారణం మాదిరిగానే ఉంటుంది.
దాని ప్రధాన సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
నాలుక పుండు యొక్క లక్షణం పుండు పైకి కనిపించడమే, అది పెద్దదిగా లేదా చిన్నదిగా ఉంటుంది. ఈ పుండు నాలుక మీద, నాలుక క్రింద లేదా నాలుక పక్కల ఉండవచ్చు.
పుండు నొప్పితో బాధాకరముగా మరియు తరచుగా ఎరుపు రంగులో ఉంటుంది. కొన్ని సందర్భాల్లో, పుండు తెలుపు లేదా పసుపు రంగులో కనిపిస్తుంది. పుండు కారణంగా వచ్చే నొప్పితో పాటుగా మంట అనుభూతి కూడా కలుగవచ్చు, సాధారణంగా వేడి లేదా కారంగా ఉండే ఆహార పదార్దాలు తినడం వల్ల అది తీవ్రతరం అవుతుంది.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
నాలుక పుండ్ల యొక్క అత్యంత సాధారణ కారణాలు:
- ఇన్ఫెక్షన్లు/సంక్రమణలు - నోటిలో వైరల్ లేదా బ్యాక్టీరియల్ సంక్రమణలు పుండుకు దారితీస్తుంది. ఇది ప్రత్యేక్షంగా నోటి అపరిశుభ్రతతో ముడిపడి ఉంటుంది.
- పోషకాహార లోపం - ఇనుము, జింక్ లేదా విటమిన్ ఎ లోపం కూడా నాలుక మీద మరియు నోటిలో పుళ్ళను కలిగించవచ్చు.
- గాయం - పొరపాటున నాలుక కొరుక్కోవడం వల్ల లేదా కట్టుడు దంతాలు లేదా పంటి క్లిప్పులను ఉపయోగించడం ద్వారా కలిగిన గాయం వంటివి కూడా నాలుక మీద బొబ్బలు లేదా పుండు యొక్క అభివృద్ధికి దారి తీస్తాయి.
- కేంకర్ పుళ్ళు - నోటిలో గాయం కావడం, హార్మోన్ల మార్పులు మరియు అనారోగ్యకరమైన ఆహార విధానం వంటి పలు కారకాల వలన నోటిలో మరియు నాలుక మీద వచ్చే పసుపు మరియు తెల్లని రంగు బొబ్బలను కేంకర్ పుళ్ళు అని అంటారు.
- ఆహార సున్నితత్వం (Food sensitivity) - మసాలా (కారం) మరియు ఆమ్లత అధికంగా కలిగిన కొన్ని రకాల ఆహారాలు నోటిలో చికాకు కలిగించి చివరకు నాలుక మీద పుండు ఏర్పడడానికి దారితీయవచ్చు.
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
నాలుక పుండ్లను శారీరక పరిశీలన ద్వారా నిర్ధారిస్తారు.
అవి సాధారణంగా కొద్దీపాటి సంరక్షణ ఉంటే సులువుగా వాటికావే నయం అయ్యిపోతాయి. పుండు యొక్క కారణం కొన్ని పోషకపదార్దాల లోపం ఐతే, వైద్యులు ఆ పోషకాల యొక్క కోర్సును వాడవలసిందిగా ఆదేశిస్తారు.
నాలుక పుండ్లను తగ్గించడంలో చాలా ప్రభావవంతముగా పనిచేసే కొన్ని గృహ చిట్కాలు ఉన్నాయి, అవి:
- ఉప్పు నీటితో నోటిని పుక్కలించడం వలన అది పుండ్లను పొడిబారేలా చేస్తుంది (ఎండేలా/మాడేలా) మరియు హానికరమైన బాక్టీరియాను కూడా తొలగిస్తుంది. ప్రత్యామ్నాయంగా, ఉప్పు మరియు నీటితో చేసిన పేస్ట్/ముద్దను వాడటం కూడా సహాయంగా ఉంటుంది.
- నొప్పిని తగ్గించడానికి ప్రభావిత భాగంలో ఐస్ క్యూబ్ను ఉపయోగించవచ్చు/రుద్దవచ్చు.
- నాలుక పుండ్ల నుండి బాధపడుతున్నప్పుడు, వేడి లేదా కారంగా ఉండే ఆహారాన్ని నివారించడం మంచిది, ఇది నొప్పిని మరింతగా ప్రేరేపించగలదు.
- కొన్ని సందర్భాల్లో, పుండును వేగంగా తగ్గించడానికి వైద్యులు వాపు నిరోధక (anti-inflammatory) మందులను సూచించవచ్చు.