థైరాయిడ్ హార్మోన్లు థైరాయిడ్ గ్రంధి ద్వారా స్రవించబడతాయి, థైరాయిడ్ గ్రంధి అనేది గొంతు భాగంలో ఉండే ఒక చిన్న అవయవం అది శరీరం యొక్క హోమియోస్టాసిస్ను (సమస్థితి) నిర్వహించడానికి బాధ్యత వహిస్తుంది. ఈ హార్మోన్ల స్థాయిలలో ఏదైనా అసమతుల్యత ఏర్పడితే అది శరీరంలోని వివిధ వ్యవస్థల వైఫల్యానికి దారితీస్తుంది. థైరాయిడ్ రుగ్మతలు అనేవి సర్వసాధారణం, మరియు పురుషుల కంటే మహిళలు ఎక్కువగా ప్రభావితమవుతారు. రెండు ప్రధాన థైరాయిడ్ సమస్యలు హైపర్ థైరాయిడిజం మరియు హైపోథైరాయిడిజం.హైపర్ థైరాయిడిజం థైరాయిడ్ హార్మోన్ల అధిక ఉత్పత్తితో సంబంధం కలిగి ఉంటుంది ఐతే, హైపో థైరాయిడిజంలో ఈ హార్మోన్ల ఉత్పత్తి తగ్గుతుంది. థైరాయిడ్ క్యాన్సర్ థైరాయిడ్ గ్రంధికి సంభవించే మరోక తీవ్రమైన సమస్యగా ఉంది మరియు ఇది ప్రపంచంలోని అత్యంత సాధారణ ఎండోక్రైన్ క్యాన్సర్లలో ఒకటి. ఈ సమస్యల యొక్క అంతర్లీన కారణాలు కూడా బాగా వివరించబడ్డాయి మరియు అవి నిర్దారణ (డయాగ్నొస్టిక్) పరీక్షలు ద్వారా సులువుగా గుర్తించబడతాయి. థైరాయిడ్ గ్రంథి యొక్క సాధారణ పనితీరును పునరుద్ధరించడానికి సరైన తక్షణ చికిత్స సహాయపడుతుంది. జీవనశైలి మార్పులలో తగినంత అయోడిన్తో సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం మరియు ఒత్తిడిని ఎదుర్కొనేందుకు యోగా మరియు ధ్యానం చెయ్యడం వంటివి ఉంటాయి. దీనితో పాటుగా ఎండోక్రయినోలోజిస్ట్ (endocrinologist) ను క్రమముగా సంప్రదించడం మరియు చెక్-అప్ చేయించుకోవడం అనేది థైరాయిడ్ సమస్యలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
థైరాయిడ్ సమస్యలు అంటే ఏమిటి?
థైరాయిడ్ గ్రంధి అనేది ఒక ఎండోక్రైన్ గ్రంధి, ఇది రెండు హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది అవి, ట్రైఅయోడోథైరోనిన్ (T3, triiodothyronine) మరియు థైరాక్సిన్ (T4, thyroxine). ఈ హార్మోన్ల ఉత్పత్తి మరియు స్రావం ఆంటీరియర్ పిట్యూటరీలో ఉత్పత్తి చేయబడిన థైరాయిడ్-స్టిములేటింగ్ హార్మోన్ (TSH) చే నియంత్రించబడతాయి, ఇది థైరాయిడ్ రిలీసింగ్ హార్మోన్ (thyroid releasing hormone) లేదా TRH చేత ప్రారంభించబడుతుంది. ఈ హార్మోన్లు శరీరం యొక్క ప్రాథమిక జీవక్రియ (మెటబాలిజం) కు బాధ్యత వహిస్తాయి. థైరాయిడ్ గ్రంథి యొక్క సరికాని ప్రేరేపణ కారణంగా అధికంగా లేదా తక్కువగా (సరిపోని) ఈ హార్మోన్లు ఉత్పత్తి చేసినప్పుడు థైరాయిడ్ సమస్యలు ఏర్పడతాయి. అటువంటి సమస్యలకు కారణాలు ఆటో ఇమ్యూన్ కావచ్చు లేదా థైరాయిడ్ గ్రంధిలో క్యాన్సర్ లేదా క్యాన్సర్ కానీ (non-cancerous) పెరుగుదలల ఉండటం వల్ల కావచ్చు లేదా గ్రంథి యొక్క వాపు కావచ్చు. ప్రపంచవ్యాప్తంగా, పురుషులలో కంటే థైరాయిడ్ సమస్యలు ఎక్కువగా మహిళల్లో కనిపిస్తాయి; దాదాపు 5% మహిళలు మరియు 0.5% మంది పురుషుల ఈ సమస్య వలన ప్రభావితం అవుతారు. ప్రతి థైరాయిడ్ సమస్య చివరికి థైరాయిడ్ హార్మోన్ల యొక్క అధిక లేదా తక్కువ స్రావానికి దారితీస్తుంది, ఇది శరీరంలో దాదాపు ప్రతి కణాన్ని ప్రభావితం చేస్తుంది.