టెస్టోస్టెరాన్ లోపం అంటే ఏమిటి?
టెస్టోస్టెరాన్ లోపం అనేది వయసు పెరిగే పురుషులలో కనిపించే ఒక సాధారణంగా సమస్య, టెస్టోస్టెరోన్ యొక్క ఉత్పత్తి ప్రభావితం కావడం వల్ల క్రమంగా అది టెస్టోస్టెరాన్ లోపానికి దారితీస్తుంది. యుక్తవయసు పురుషులలో టెస్టోస్టెరోన్ లోపం ఇతర సంక్లిష్టతలకు కూడా కారణం కావచ్చు, ఎందుకంటే టెస్టోస్టెరాన్ యుక్తవయసులో జరిగే శరీర మార్పులకు మరియు మార్పుల ప్రక్రియకు చాలా ముఖ్యమైనది.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
ఈ పరిస్థితి యొక్క సంకేతాలు మరియు లక్షణాలు పురుషులలో వారి వయస్సుని బట్టి భిన్నంగా ఉంటాయి. టెస్టోస్టెరాన్ లోపం యొక్క కొన్ని సాధారణ సంకేతాలు:
- పురుష జననేంద్రియ అవయవాలు సరిగ్గా అభివృద్ధి చెందకపోవడం.
- ముఖ జుట్టు మరియు కండరాల అభివృద్ధి తక్కువగా ఉండడం.
- యుక్తవయస్సు దాటిన తర్వాత పెరుగుదల ఆగిపోవడం.
పెద్దలలో, మానసిక మార్పులు (మూడ్ స్వింగ్స్) ఎక్కువగా ఉంటాయి మరియు లైంగిక పటుత్వం తగ్గిపోతుంది మరియు లైంగిక కార్యకలాపాల్లో ఇబ్బందులు ఎదురవుతుంది.
- కండరాల శక్తి తగ్గుతుంది.
- ఆస్టియోపొరోసిస్
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
మెదడు హార్మోన్ల ఉత్పత్తిని నియంత్రిస్తుంది అందువల్ల టెస్టోస్టెరోన్ ఉత్పత్తి యొక్క నియంత్రణ మెదడు మరియు వృషణాల మీద ఆధారపడి ఉంటుంది. టెస్టోస్టెరోన్ లోపం యొక్క అత్యంత సాధారణ కారణం పెద్ద వయస్సు (వయసు పెరగడం). ఈ పరిస్థితికి దారి తీసే ఇతర కారణాలు:
- పిట్యూటరీ, హైపోథాలమస్ లేదా వృషణాల యొక్క జన్యుపరమైన లోపాలు
- మందుల దుర్వినియోగం
- వృషణాలకు ఏదైనా ఆకస్మిక గాయం లేదా హాని
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
లైంగిక కోరిక తగ్గినా మరియు తరచుగా మానసిక మార్పలు సంభవిస్తున్నా, వైద్యులు టెస్టోస్టెరాన్ స్థాయిల అంచనాకు రక్త పరీక్షలను ఆదేశించవచ్చు. పరీక్షాలో తెలిసిన స్థాయిలను నిర్ధారించడానికి ఈ పరీక్ష ఒకటి లేదా రెండు రోజుల్లో మళ్ళి నిర్వహిస్తారు. ఈ సమస్యకి చికిత్స అందుబాటులో ఉంది, అయినప్పటికీ, అది పూర్తిగా ఉపశమనం కలిగించదు మరియు మందులను అప్పుడపుడు కొన్ని రోజుల పాటు తీసుకుంటూ ఉండాలి (periodically). తరచుగా టెస్టోస్టెరాన్ స్థాయిలను సాధారణ స్థితికి తీసుకురావడానికి టెస్టోస్టెరోన్ రీప్లేస్మెంట్ చికిత్స (testosterone replacement therapy) తీసుకుంటూ ఉండాలి. లోపం యొక్క చికిత్స కోసం ఒక టెస్టోస్టెరాన్ జెల్ లేదా ఇంజెక్షన్ సూచించబడవచ్చు.
యుక్తవయసులో ఉన్నవారిలో, టెస్టోస్టెరాన్ చికిత్సతో క్రమం లేని (సరిలేని) ద్వితీయ లైంగిక లక్షణాలను సులభంగా సరిదిద్దవచ్చు. ఐతే, పెద్ద వయసువారిలో, అది పూర్తిగా సంతృప్తికరమైన ఫలితాలను అందించకపోవచ్చు.
టెస్టోస్టెరోన్ లోపం అనేది ఒక సమస్యాత్మక పరిస్థితి ఎందుకంటే ఇది పురుషులలో టెస్టోస్టెరోన్ హార్మోన్ ప్రభావంతో ముడి పడి ఉండే అన్ని అంశాలను ప్రభావితం చేస్తుంది