వృషణాల వాపు అంటే ఏమిటి?
వృషణాలు పురుషుల లైంగిక అవయవాలు. ఇవి “వృషణాల తిత్తి” (స్కోటోమ్) అని పిలువబడే చర్మంతో కూడిన పర్సు లోపల ఉంటాయి. వృషణాల ప్రధాన విధులేమంటే వీర్యాన్ని (స్పెర్మ్ను) ఉత్పత్తి చేయడం మరియు ‘టెస్టోస్టెరోన్’ అనే హార్మోన్ ను స్రవించడం. వృషణాల వాపు చాలా బాధాకరమైన రుగ్మత. ఇది ప్రత్యక్ష గాయంవల్ల, సంక్రమణ లేదా టార్షన్ వంటి వివిధ పరిస్థితుల కారణంగా ఉత్పన్నమవుతుంది. వృషణాల వాపు (టెస్టిక్యులర్ వాపు)ను ఎన్నటికీ అశ్రద్ధ చేయకూడదు ( విస్మరించకూడదు) మరియు తక్షణం వైద్య సహాయం తీసుకోవాలి.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
వృషణాల వాపు వృషణం తిత్తిలో (scrotum) లావుగా ఊతతో కూడుకుని, చాలా నొప్పిని కల్గి ఉంటుంది. గజ్జా భాగంలో ఎరుపుదేలడం మరియు గజ్జలోనే కిందికి లాగుతున్నట్లు స్థిరమైన తీవ్ర భావన కల్గుతుంది. కొంతమంది పురుషులు తమ వీర్యములో రక్తం కూడా వస్తున్నట్లు గమనించినట్లు తెలిసింది. వృషణాల వాపుతోబాటు సంక్రమణ కూడా అయ్యుంటే జ్వరం, మూత్రవిసర్జనలో నొప్పి మరియు అనారోగ్యంతో బాధపడుతున్న భావన రోగి అనుభవించే కొన్ని లక్షణాల్లో కనిపిస్తాయి.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
వివిధ కారణాల వల్ల వృషణాల్లో (టెస్టిక్యులర్) వాపు సంభవిస్తుంది. వాటిలో సాధారణమైన కారణాలివి:
- నెరుగా గాయం కావడం
- లైంగికంగా సంక్రమించిన వ్యాధి కారణంగా బ్యాక్టీరియా సంక్రమణలు
- వృషణాల యొక్క వాపు ‘ఆర్కిటిస్’ రకంగానూ ఉంటుంది
- ఎపిడిడైమిటిస్ (వృషణాల నుండి వీర్యాన్ని తీసుకువెళ్ళే ట్యూబ్ యొక్క వాపు ఇది)
- వైరల్ సంక్రమణ (సాధారణంగా గవదబిళ్ళలు వైరస్ కారణంగా వస్తుంది )
- టెస్టిక్యులర్ టోర్సెన్ (ఇది బాధాకరమైన వృషణాల మెలిదిప్పుడుకు (twisting of testes) సంబంధించింది.
- వృషణ క్యాన్సర్
దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
వృషణాలవాపురోగ నిర్ధారణ వైద్య చరిత్ర మరియు శారీరక పరీక్షపై ఆధారపడి ఉంటుంది, ఈ వాపుకల్గిన వృషణాభాగంపై పరిశీలనయొక్క పూర్తి దృష్టి కేంద్రీకరించబడుతుంది. డాక్టర్ ప్రోస్టేట్ ప్రమేయం కోసం ఒక మల పరీక్ష చేయవచ్చు. వీటితో పాటు, అంటువ్యాధుల కోసం రక్తం మరియు మూత్ర పరీక్షలు జరుగుతాయి. అల్ట్రాసౌండ్ లేదా రంగు డాప్లర్ (colour Doppler) వాపు యొక్క ఖచ్చితమైన స్వభావం మరియు సంభావ్య కారణాన్నిగుర్తించడానికి సహాయపడుతుంది.
వాపు యొక్క మూల కారణం ఆధారంగా చికిత్స మారుతూ ఉంటుంది. బాక్టీరియల్ సంక్రమణ విషయంలో, యాంటీబయాటిక్ కోర్సు 10-14 రోజులు సూచించబడుతుంది. వాపు-నొప్పి నివారణ మందులతో బాటు నొప్పి నిర్వహణ మందుల్ని అవసరం మేరకు ఇవ్వబడుతాయి. జ్వరం విషయంలో, యాంటిపైరేటిక్ సలహా ఇవ్వబడుతుంది. లైంగికంగా చురుగ్గా ఉన్న పురుషులు కండోమ్స్ ధరించడం లేదా లైంగిక సంపర్కము నుండి దూరంగా ఉండాలని వారికి సూచించడమైంది. స్వీయ రక్షణలో భాగంగా వృషణాభాగానికి మద్దతు, ప్రతిరోజూ 15-20 నిమిషాలపాటు ఐస్ ప్యాక్ తాపడాన్ని పెట్టడం ఉంటాయి.