వృషణాల క్యాన్సర్ అంటే ఏమిటి?
వృషణాలు (testicles) మగవాళ్లలో ఉండే పునరుత్పత్తి అవయవాలు. ఇవి వీర్యాన్ని(స్పెర్మ్లను) ఉత్పత్తి చేస్తాయి మరియు టెస్టోస్టెరాన్ (testosterone) అనే హార్మోన్ ని స్రవిస్తాయి. వృషణాల క్యాన్సర్ (లేక వృషణ క్యాన్సర్) ఓ అరుదైన క్యాన్సర్ రకం, ఇది 15 నుండి 45 సంవత్సరాల మధ్య ఉండే మగాళ్లకు సంభవిస్తుంది. ఈ వృషణ క్యాన్సర్ వృషణాల్లో నొప్పిలేని గడ్డలా గోచరిస్తుంది.
వృషణాల క్యాన్సర్ కు చికిత్స లభ్యత ఉంది మరియు ఈ వ్యాధికి చేసిన చికిత్సలు అధికరేటులో విజయవంతమైనాయి.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
టెస్టోస్టెరాన్ హార్మోన్ యొక్క అధిక ఉత్పత్తి కారణంగా, వృషణభాగంలో సంభవించే ఒత్తిడి మార్పులు మరియు వాపు కారణంగా వృషణ క్యాన్సర్ యొక్క సంకేతాలు మరియు లక్షణాలు గోచరిస్తాయి. ఈ లక్షణాలు ఇలా ఉంటాయి:
- రెండు వృషణాల్లో గాని లేదా ఒక వృషణంలో గాని గడ్డ (lump) లేదా వాపు
- వృషణ తిత్తుల్లో భారంగా ఉన్నాయని వ్యక్తికీ అనుభూతి కలగడం
- వృషణ తిత్తుల్లో ద్రవ సేకరణ
- చిగురు లో అసౌకర్యం లేదా నొప్పి
- కటి (పెల్విక్) భాగంలో మూగ నొప్పి
- నడుము నొప్పి
- రొమ్ము సున్నితత్వం లేదా విస్తరణ
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
వృషణ క్యాన్సర్ యొక్క ఖచ్చితమైన కారణం ఇప్పటికీ అస్పష్టంగా ఉంది, కానీ వ్యక్తిలో వృషణ క్యాన్సర్ ఉన్నట్లయితే రోగిని ముందుగానే ఆయత్తపరిచే ప్రమాద కారకాలు పొడజూపుతాయి, ఈ వ్యాధికారకాలు వ్యక్తిని వృషణక్యాన్సర్కు గురిచేస్తాయి. ఆ ప్రమాద కారకాలు ఇలా ఉన్నాయి:
- వృషణాల అభివృద్ధిలో అసహజత - క్లైన్ఫెల్టర్ యొక్క సిండ్రోమ్ అని పిలువబడే జన్యుపరమైన రుగ్మతతో కనిపించే వృషణాల యొక్క పేలవమైన అభివృద్ధి లేదా అసాధారణ అభివృద్ధి వృషణ క్యాన్సర్కు కారణం కావచ్చు.
- దిగని వృషణాలు (Undescended testis-క్రిప్టోరిచిడిజం) - మనిషి తల్లిగర్భంలో పిండం దశ జీవితంలో ఉన్నపుడు వృషణాలు సాధారణంగా పొత్తికడుపు నుండి వృషణాభాగానికి దిగివస్తాయి, కానీ కొన్ని ప్రస్తుత రుగ్మత సందర్భాల్లో ఇది ఎప్పుడూ జరగదు మరియు వృషణాలు పొత్తికడుపు భాగంలోనే ఉండిపోతాయి.
- వృషణాల క్యాన్సర్ యొక్క బలమైన కుటుంబ చరిత్ర.
- వయస్సు - వృషణాల క్యాన్సర్ 15-45 ఏళ్ల వయస్సు గల వ్యక్తుల్లోనే ఎక్కువగా రావడం జరుగుతుంది.
దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
వైద్యుడిచే సరైన వైద్య చరిత్రసేకరణ, శారీరక పరీక్షలు వృషణ క్యాన్సర్ నిర్ధారణను సూచించగలవు, కానీ వ్యాధి నిర్ధారణను ఖచితపరిచేందుకు మరియు వ్యాధి చికిత్సను నిర్ధారించడానికి కూడా కొన్ని పరిశోధనలు తప్పనిసరి. ఆ పరిశోధనలు:
- రక్త పరిశోధనలు - ఆల్ఫా-ఫెరోప్రొటీన్, బీటా HCG మరియు లాక్టేట్ డీహైడ్రోజినేస్ వంటి ట్యూమర్ మార్కర్స్ వృషణ క్యాన్సర్ నిర్ధారణలో సహాయపడతాయి.
- సోనోగ్రఫీ - వృషణ (scrotal) ప్రాంతం యొక్క అల్ట్రాసౌండ్ మూల్యాంకనం క్యాన్సర్ వ్యాప్తి యొక్క పరిధి నిర్ణయించడానికి సహాయపడుతుంది, ఇంకా, క్యాన్సరు గడ్డ రకాన్ని కూడా నిర్ణయిస్తుంది.
- సిటి (CT) స్కాన్ - సాధారణంగా క్యాన్సర్ వ్యాప్తి యొక్క పరిధిని నిర్ణయించడంలో సహాయపడుతుంది.
- హిస్టోపాథాలజీ - క్యాన్సర్ కణితిని తొలగించినన తరువాత, క్యాన్సర్ రకాన్ని విశ్లేషించడానికి ఆ కణతిని సూక్ష్మదర్శిని క్రింద తనిఖీ చేయబడుతుంది.
చికిత్స మార్గదర్శకాలు (ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్) వ్యక్తి యొక్క క్యాన్సర్ దశ (stage) మరియు క్యాన్సర్ రకంపై పూర్తిగా ఆధారపడి ఉంటాయి. కొన్నిసార్లు, రోగి యొక్క మొత్తం ఆరోగ్య స్థితి మరియు రోగి ప్రాధాన్యతలు కూడా చికిత్స పద్దతి యొక్క ఎంపికను ప్రభావితం చేస్తాయి. ఆ చికిత్స ఎంపికలు ఇలా ఉన్నాయి:
- శస్త్రచికిత్స (ఆర్కిడెక్టోమీ) - శస్త్రచికిత్స ద్వారా వ్యాధిబాధిత వృషణాన్ని మరియు అనుసంధానమైన శోషరస కణుపుల (లోకో-ప్రాంతీయ నోడ్స్) ను కూడా తొలగించడమనేది ఉత్తమమైన చికిత్స. ఈ చికిత్స సాధారణంగా వృషణాల క్యాన్సర్ను పూర్తిగా తొలగిస్తుంది.
- రేడియోధార్మిక చికిత్స - క్యాన్సర్ కణాలను నాశనం చేయడానికి హై ఎనర్జీ X- రే కిరణాలు ఉపయోగిస్తారు, కానీ రేడియో ధార్మిక చికిత్స అనేక దుష్ప్రభావాలను కలిగి ఉంటుంది మరియు కొన్ని రకాల క్యాన్సర్లలో మాత్రమే ఉపయోగపడుతుంది.
- కెమోథెరపీ - కెమోథెరపీ ఎజెంట్ క్యాన్సర్ కణాలను చంపడంలో సహాయపడుతుంది. శస్త్రచికిత్స తర్వాత అవశేష క్యాన్సర్ కణాల తొలగింపుకు తరచూ దీనిని ఉపయోగిస్తారు. ఇది అనేక దుష్ప్రభావాలు కూడా కలిగి ఉంటుంది.