టెన్నిస్ ఎల్బో అంటే ఏమిటి?
ముంజేతి కండరాల్ని-మోచేయి కీలును కలిపే కండరనరాలు (tendons) వాపుదేలి, ఎరుపెక్కి, మంట గలిగే బాధాకర పరిస్థితినే మోచేతినొప్పి లేక “టెన్నిస్ ఎల్బో,” గా పిలుస్తారు. “టెన్నిస్ ఎల్బో” రుగ్మతను వైద్యపరంగా ‘పార్శ్వ ఎపికోండిలిటీస్’ (lateral epicondylitis) గా పిలుస్తారు. మోచేతివంపుపై అధికమైన మరియు మళ్ళీ మళ్ళీ మోపబడే శ్రమ కారణంగా ఈ టెన్నిస్ ఎల్బో (మోచేతి నొప్పి) సంభవిస్తుంది. టెన్నిస్ లాంటి కఠినతరమైన ఆటలను ఆడేటపుడు సాధారణంగా స్నాయువులపై (tendons) ఒత్తిడితో కూడిన పునరావృత చర్య కారణంగా నొప్పితో కూడిన ఈ టెన్నిస్ ఎల్బో రుగ్మత వస్తుంది. క్రికెట్, టెన్నిస్, బ్యాడ్మింటన్ మరియు స్క్వాష్ ఆటగాళ్ళలో ఇది ఓ సాధారణ రుగ్మత.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
టెన్నిస్ ఎల్బో యొక్క రోగలక్షణాలు క్రమంగా సమయంతోపాటు పెరుగుతాయి మరియు దీన్ని పట్టించుకోకుండా అశ్రద్ధ చేస్తే రుగ్మత మరింత తీవ్రమవుతుంది. ఈ రుగ్మత యొక్క అత్యంత సాధారణ సంకేతాలు కిందివిధంగా ఉంటాయి
- మోచేయికీలు మీద,చుట్టూ మరియు బయట స్థిరమైన నొప్పి
- పట్టు తప్పి పోవడం (loss of grip)
- మోచేతికీలుపై కదలికలతో కూడిన చిన్న చిన్న పనులు చేయడానికి కూడా మోచేయి నొప్పి మరియు పెడసరం కల్గుతుంది.
- మోచేయి కీలు వాపుదేలడం మరియు ఎరుపెక్కడం
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
టెన్నిస్ ఎల్బో అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణం మోచేతికీలుపై శ్రమతో కూడిన చర్యల్ని పదే పదే మోపడంవల్లనే, ఇది స్నాయువులను దెబ్బతీస్తుంది. ఈ పరిస్థితి అభివృద్ధికి ఇతర కారణాలు:
- స్పోర్ట్స్ ఆడడం, దీనికి ఎగువ చేయి (upper arm) బలం అవసరం, ఉదా., టెన్నీస్, స్క్వాష్
- జావెలిన్ త్రో, డిస్కస్ త్రో మరియు తోటపనిలో పాల్గొన్నపుడు చేసే కార్యకలాపాలు వంటి ఇతర కార్యకలాపాలు
దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
వైద్యుడు శారీరక పరీక్షను జరపవచ్చు మరియు ఏ విధమైన చర్యలు టెన్నిస్ ఎల్బో లక్షణాలకు దారి తీశాయని మిమ్మల్ని అడిగి విచారించవచ్చు. స్నాయువులకు మరియు కండరాలకు ఎటువంటి హాని జరిగిందో తెలుసుకోవడానికి డాక్టర్ కొన్ని పరీక్షలను నిర్ధారించవచ్చు:
- ఎక్స్-రే
- ఎంఆర్ఐ స్కాన్
- ఎలెక్ట్రోమయోగ్రఫీ (EMG) నరాలకు దెబ్బ తగిలిందేమో తెలుసుకోవడానికి చేసే తనిఖీ
శస్త్రచికిత్స మరియు శస్త్రచికిత్సేతర చికిత్సలు రెండూ అందుబాటులో ఉంటాయి. టెన్నిస్ ఎల్బో యొక్క చాలా కేసులను శస్త్రచికిత్స లేకుండానే నిర్వహించవచ్చు. చికిత్స ఎంపికలు కిందివిధంగా ఉన్నాయి
- భౌతిక చికిత్స
- శోథ నిరోధక మందులు
- విశ్రాంతి మరియు శ్రమతో కూడిన కార్యకలాపాల్ని నివారించడం.
దీని పరిస్థితి మరింత తీవ్రమయితే సంధిబంధన స్నాయువులకు ఆపరేషన్ చేయడం జరుగుతుంది మరియు దెబ్బతిన్న స్నాయువులకు మరమ్మతులు చేయడం జరుగుతుంది. అయితే, దీంతర్వాత (చికిత్స తర్వాత) తిరిగి బలం పుంజుకోవడానికి పునరావాసం అవసరం. మొత్తంమీద, ఈ రుగ్మతవల్ల భయపడాల్సిన పని లేదు, ఎందుకంటే ఇది దాదాపు శస్త్రచికిత్స అవసరం లేకుండా ఇతర చికిత్సలతోనే నయం కాగలదు కాబట్టి.