స్విమ్మర్స్ ఇయర్ అంటే ఏమిటి?
బాహ్య చెవి కాలువ (outer ear canal) సంక్రమణానికి గురి కావడాన్నే “చెవిపోటు” గా చెప్పవచ్చు. ఈ చెవిపోటు రుగ్మత “ఈతగాడి చెవి” (Swimmer’s Ear),గా పేరుగాంచింది. చెవిపోటునే ’ఓటిటిస్ ఎక్స్టెర్నా’ అని కూడా పిలుస్తారు. బాహ్య చెవి కాలువ అనేది చెవిలోకి ధ్వనిని మోసుకువచ్చే కాలువ. ఈ చెవిపోటు వ్యాధిని 'స్విమ్మర్’స్ ఇయర్' అని ఎందుకు పిలుస్తారంటే నీటిలో చాలా ఎక్కువ సమయాన్ని గడిపేవాళ్లలోనే ఈ చెవిపోటు సర్వసాధారణం కాబట్టి.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
చెవిపోటు యొక్క తేలికపాటి లక్షణాల్లో చెవి నొప్పి మరియు దురద ఉంటాయి. చెవి ఎరుపుదేలవచ్చు. మరియు చెవి నుండి ద్రవం కారడాన్ని మనం గమనించొచ్చు.
సంక్రమణ పెరగడంతో పాటుగా నొప్పి తీవ్రత, చెవి ఎరుపుదేలడం మరియు చెవిదురద పెరుగుతాయి. చెవి నుండి ద్రవంతో పాటు చీము కూడా కారుతుంది. చెవిపోటుకు గురైన రోగి తన వినికిడి శక్తి అస్తవ్యస్తమైందని కూడా ఫిర్యాదు చేయవచ్చు.
ఈ చెవి సంక్రమణ గణనీయంగా పెరిగిన తరువాత, పైన తెలిపిన అన్ని వ్యాధి లక్షణాలు మరింత తీవ్రమైపోతాయి. అదనంగా, ఈ చెవిసంక్రమణ జ్వరం మరియు శోషరసగ్రంథుల వాపును కలిగించవచ్చు.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
- స్విమ్మర్ యొక్క చెవి ప్రధానంగా సూక్ష్మ జీవులు, శిలీంధ్రాలు, మరియు వైరస్ల వలన సంభవిస్తుంది.
- చెవిలో తేమ ఉండటంవల్ల బాక్టీరియా వృద్ధి కావడానికి సరైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. అందువల్లనే, నీటిలో చాలా ఎక్కువ సమయం గడిపే వ్యక్తులు ఈ చెవిపోటు వ్యాధికి మరింత ఎక్కువగా గురవుతుంటారు.
- ఇయర్ బడ్స్ (చెవిలో తేమను తుడవడానికి ఉపయోగించేవి), పిన్నులు లేదా వేలు పెట్టి నిరంతరంగా చెవిని కెలకడం కారణంగా ఈ చెవిపోటు సంక్రమణ సంభవించే అవకాశాలు పెరుగుతాయి.
- చెవి ఉపకరణాలు మరియు ఇయర్ఫోన్స్ వంటి విదేశీ వస్తువులు కూడా సంక్రమణను కలిగి ఉంటాయి.
- చర్మపు అలెర్జీలు కలిగిన వ్యక్తి ఇటువంటి చెవిపోటు అంటురోగాలకు ఎక్కువ గురయ్యే అవకాశం ఉంది.
చెవిపోటు ను ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
మీ చెవిపోటు వ్యాధి లక్షణాలు మరియు వైద్య చరిత్ర ఆధారంగా, వైద్యుడు మీ చెవిని పరిశీలించడం ద్వారా మీ చెవిపోటు వ్యాధి నిర్ధారణ ప్రారంభమవుతుంది.
- ఓటోస్కోప్ అని పిలవబడే ఒక ప్రత్యేక పరికరాన్ని చెవి కాలువ లోపల ఏదైనా ఎరుపుదేలి ఉన్న భాగాన్ని, చీము లేదా ఇతర శిధిలాల్ని చూడడానికి ఉపయోగిస్తారు.
- కర్ణభేరి (చెవిగూబ or ear drum) తీవ్రంగా దెబ్బ తిని ఉంటే, ఏ సూక్ష్మజీవి ఈ చెవిపోటు సంక్రమణకు కారణమవుతుందో తెలుసుకోవడానికి తదుపరి పరిశోధనలు అవసరమవుతాయి.
చికిత్స
- ప్రాధమిక చికిత్సగా సూక్ష్మజీవనిరోధకాల ద్వారా సూక్ష్మజీవుల్ని (micro-organism) తొలగించడం.
- చెవిని ఒక ప్రత్యేకమైన తేలికపాటి ఆమ్ల ద్రావణంతో శుభ్రం చేయబడుతుంది మరియు చెవి నుండి అన్ని శిధిలాలు తొలగించబడతాయి.
- చెవి కాలువలో వచ్చిన వాపును తగ్గించడానికి స్టెరాయిడ్లను కలిగి ఉన్న చెవి డ్రాప్స్ ను వాడడం.
- ఈ చెవి సంక్రమణ సాధారణంగా 10-12 రోజుల్లో ఎలాంటి పెద్ద సమస్యలు లేకుండా నయమైపోతుంది.