ఎండకు చర్మం కమలడం (సన్బర్న్) అంటే ఏమిటి?
ఎండకు లేదా సూర్యుని యొక్క అతినీలలోహిత (UV) కిరణాల తీవ్రతకు వ్యక్తి అతిగా బహిర్గతమై చర్మం యొక్క ఉపరితలం ఎర్రబడి మరియు మంట కల్గి కమిలిపోతుంది, దీన్నే “ఎండకు చర్మం కమలడం” అంటారు. దీన్ని ‘సన్బర్న్’ అని కూడా అంటారు. ఎక్కువ సమయాన్ని ఎండలో గడిపేవారు గాని లేదా ఎండలో పనిచేసేవారికి ఈ ఎండకు చర్మం కమలడం అనే వ్యాధి చాలా సాధారణం.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
- సన్బర్న్ మొదటి సంకేతం దురదతో కూడిన ఎరుపుదేలిన చర్మం.
- ఎండదెబ్బ వల్ల కమిలిన చోట చర్మం నొప్పి, అసౌకర్యం, మరియు మంట కలుగుతాయి
- తరచుగా, మీరు ఎండవల్ల దెబ్బతిన్న శరీరభాగాల్లో చర్మంపై బొబ్బలు మరియు వాపు (ద్రవం చేరడం కారణంగా వాపు) పెరగవచ్చు.
- బొబ్బలు చర్మం ఉపరితలంపై లేదా చర్మంలోని లోతు పొరల్లో ఉండొచ్చు. ఈ బొబ్బలు నీటితో నింపబడి తరచుగా బాధాకరమైనవిగా ఉంటాయి.
- ఇతర లక్షణాలు జ్వరం, వికారం మరియు వాంతులు.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
సన్బర్న్ ప్రధానంగా అతినీలలోహిత కిరణా (UV) లకు దీర్ఘకాలంపాటు బహిర్గతం కావడం కారణంగా సంభవిస్తాయి. ఎండ (సూర్యుని కిరణాలు) కాకుండా, అతినీలలోహిత (UV) కిరణాల యొక్క ఇతర వనరులు కృత్రిమ దీపాలు కావచ్చు.
ప్రమాద కారకాలు:
- ఓజోన్ పొర సన్నగా ఉన్నచోట్లలో లేదా ఓజోన్ పోర పూర్తిగా క్షీణించిన ప్రాంతాలలో నివసించే జనాభా కూడా సన్బర్న్ ప్రమాదానికి ఎక్కువగా గురయ్యే అవకాశం ఉంది.
- మధ్య వయస్కులు మరియు యుక్తవయసు వారితో పోల్చితే పిల్లలు మరియు వృద్ధులు సన్బర్న్ సమస్యకు ఎక్కువగా గురవుతారు.
- తేలికైన చర్మపు (తత్త్వం) టోన్ కలిగిన వారు సన్బర్న్ కు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే వారి చర్మంలో మెలనిన్ లేకపోవటంతో ఎండకు బహిర్గతం కావడాన్నితట్టుకోవడంలో పరిమిత సామర్థ్యం మాత్రమే కలిగి ఉంటారు.
- అరుదుగా, ఒక జన్యు స్థితి సన్బర్న్ ని శరీరంలో వృద్ధి చేయడానికి వ్యక్తిని ఆయత్తపరుస్తుంది. ఈ పరిస్థితిని లేదా రుగ్మతను ‘జెరోడెర్మా పిగ్మెంటోసుం’ (xeroderma pigmentosum) అంటారు.
- సల్ఫా మందులు, డిఫెన్హైడ్రామైన్, ప్రొమెథాజిన్, అమిట్రిటీటీలైన్ మరియు ఇతరులు వంటి కొన్ని మందులతో సన్బర్న్ ప్రమాదం అధికంగా ఉంటుంది.
సన్బర్న్ ను ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
- సన్బర్న్ వైద్యపరంగా స్పష్టమైన పరిస్థితి, అందువల్ల, రోగ నిర్ధారణ ప్రధానంగా అలెర్జీలు, ఫోటో అలెర్జీలు మరియు ఫోటో-టాక్సిటిటి ప్రతిచర్యలు వంటి ఇతర చర్మ రుగ్మతలవలే కాకుండా వేరుగా ఉంటుంది.
- ఎండకు గురికావడాన్ని ఆపేసినట్లయితే చాలా మటుకు సన్బర్న్ కేసులు కొన్ని వారాలలో సహజంగా నయమైపోతాయి.
- వాపు-మంట మరియు నొప్పి నుండి ఉపశమనం కలిగించడానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులు సహాయపడతాయి. ఆస్పిరిన్ వంటి మందులు కూడా సూచించబడవచ్చు.
- చర్మం ఎరుపుదేలి మంటరేపుతున్న పరిస్థితికి ఉపశమనంగా, తేమకల్గించే క్రీమ్లు, జెల్ లు (gels) మరియు చల్లని జల్లుల స్నానాలను (cool showers) ఉపశమనానికి సిఫార్సు చేస్తారు.
- ఎండవేడిమి చేత చర్మం నుండి మొత్తం నీరు ఆవిరైపోయి ఉండడంతో రోగి తగినంతగా ద్రవాహారాల్ని పుచ్చుకోవడం చాలా అవసరమని సూచించబడుతుంది.