స్ట్రెప్ థ్రోట్ (గొంతులో పుండ్లు) అంటే ఏమిటి?
స్ట్రెప్ థ్రోట్ (గొంతులో పుండ్లు) అనేది స్ట్రెప్టోకోకస్ పియోజెనిస్ (Streptococcus pyogenes ) అని పిలవబడే బ్యాక్టీరియా వల్ల కలిగే ఒక సంక్రమణం/ఇన్ఫెక్షన్, ఇది గొంతుక నొప్పి, వాపు మరియు అసౌకర్యానికి దారితీస్తుంది. ఇది ఏ వయస్సు వారినైనా ప్రభావితం చేస్తుంది అయినప్పటికీ, పిల్లలలో ఇది చాలా సాధారణంగా కనిపిస్తుంది.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
- స్ట్రెప్ థ్రోట్ ముందుగా గొంతు నొప్పి మరియు అసౌకర్యంతో మొదలవుతుంది, ఇది ప్రత్యేకించి మ్రింగుతున్నపుడు లేదా తింటున్నప్పుడు తీవ్రతరం అవుతుంది మరియు దురద కూడా కలుగుతుంది; అయితే, దగ్గు ఉండదు/రాదు.
- మెడలోని శోషరస కణుపులు (లింఫ్ నొడ్లు) పెరగడం/విస్తరించడంతో పాటు టాన్సిల్స్ యొక్క వాపు మరియు ఎరుపుదనం.
- ఈ సంక్రమణ ఫలితంగా జ్వరం మరియు చలి సంభవిస్తాయి.
- వ్యక్తికి అలసట, తలనొప్పి మరియు జలుబు కూడా కలుగవచ్చు.
- ఆకలిలేమి, వికారం, వాంతులు కూడా స్ట్రెప్ థ్రోట్ ఉన్న వ్యక్తులలో కనిపించే ఇతర సాధారణ లక్షణాలు.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
- గ్రూప్ A స్ట్రెప్టోకోకస్(Streptococcus) కు చెందిన, స్ట్రెప్టోకోకస్ పియోజెనిస్ (Streptococcus pyogenes) అనే బ్యాక్టీరియా వలన స్ట్రిప్ థ్రోట్ సంభవిస్తుంది.
- దగ్గు లేదా తుమ్ము నుండి వచ్చే బిందువుల ద్వారా ఈ సంక్రమణం ఒక వ్యక్తి నుండి ఇంకొక వ్యక్తికీ వ్యాపిస్తుంది.
- ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తికి దగ్గరగా ఉండడం వలన కూడా స్ట్రిప్ థ్రోట్ సంభవించే ప్రమాదం ఉంది. అంటే వ్యక్తిగత వస్తువులను పంచుకోవడం లేదా తాకడం వంటివి.
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
- స్ట్రెప్టోకోకస్ ఇన్ఫెక్షన్ల లక్షణాలు ఇతర సూక్ష్మజీవుల సంక్రమణల/ఇన్ఫెక్షన్ల యొక్క లక్షణాల మాదిరిగానే ఉంటాయి. లక్షణాలు కనిపించిన తర్వాత, బ్యాక్టీరియాను గుర్తించడానికి వైద్యులు రాపిడ్ స్ట్రిప్ పరీక్ష (rapid strep test) అని పిలవబడే ఒక ప్రత్యేక పరీక్షను సూచిస్తారు, దీనిలో గొంతు స్వబును సేకరించి ప్రయోగశాలలో పరిశీలిస్తారు.
- సంక్రమణ తనిఖీ కోసం మరియు ఏ ఇతర ప్రధాన ఆరోగ్య సమస్యల సంభావ్యతను నిర్ములించడానికి రక్త పరీక్ష కూడా నిర్వహించబడుతుంది.
చికిత్స:
- స్ట్రెప్ థ్రోట్ సంక్రమణల, ప్రాధమిక చికిత్స యాంటీబయాటిక్స్ ద్వారా ఉంటుంది. రోగి శరీరం నుండి బ్యాక్టీరియాను పూర్తిగా తొలగించడానికి యాంటిబయోటిక్ యొక్క ఏ మోతాదును విడిచిపెట్టరాదు (మందుల మోతాదును పూర్తిగా వాడాలి).
- నొప్పి లేదా జ్వరం ఉన్నట్లయితే, అనాల్జేసిక్ (analgesic) మరియు యాంటిపైరెటిక్ (antipyretic) మందులు కూడా ఇవ్వబడతాయి.
- మందుల యొక్క మోతాదును పూర్తిగా వాడకపోతే మళ్ళి స్ట్రెప్ థ్రోట్ సంభవించే ప్రమాదం ఉంటుంది లేదా మందులకు వ్యతిరేకంగా బాక్టీరియా నిరోధకతను (resistance) అభివృద్ధి చేసుకుంటుంది.