మెడ పట్టేయడం లేక మెడ పెడసరం అంటే ఏమిటి?
మెడ పట్టేయడం (లేక మెడ పెడసరం) అనే రుగ్మతవల్ల మెడ నిర్మాణాలకు మిక్కిలి అసౌకర్యంగా ఉంటుంది. వెంటనే దీనిపట్ల శ్రద్ధ తీసుకొని చికిత్స చేయకపోతే, మెడను కదిలించేందుకే వీల్లేనంతగా నొప్పిని మరియు ఎంతో కష్టానికి గురి చేస్తుంది. మెడ పట్టేయడం (మెడలో దృఢత్వం) అనేది ప్రధానంగా మెడలో కండరాలు ఆకస్మికంగా పట్టేయడం లేక పెడసరానికి గురికావడంవల్ల సంభవిస్తుంది.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
మెడ పట్టేయడం అనేది మీ మెడలో నొప్పిని, అసౌకర్యాన్ని కలిగించేందుకు దారితీస్తుంది, తద్వారా తలను హాయిగా అటు ఇటు కదపడం చాలా కష్టమౌతుంది. చేతిలో ఒక నరం లేదా నాడి ఒత్తిడికి (కంప్రెస్) గురైనట్లయితే, ఒత్తిడి కల్గిన వైపున మీరు జలదరింపు, తిమ్మిరి, మరియు బలహీనతను అనుభవించవచ్చు,
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
సాధారణంగా మెడనొప్పికి (మెడ పట్టేయడానికి) రోజువారీ కార్యకలాపాలనే కారణంగా చెప్పవచ్చు. వీటిలో గంటలపాటు ల్యాప్టాప్లు లేదా మొబైల్ ఫోన్లలో పని చేయడం, పేలవమైన అంటే ఇబ్బంది కల్గించే భంగిమల్లో కూర్చోవడం, నడిచేటప్పుడు వంగి నడవడం, భారీగా బరువుండే వస్తువుల్ని ఎత్తడం, లాగడం మొదలైనవి ఉంటాయి. ఈ చర్యలన్నీ మీ మెడపై ఒత్తిడిని తెచ్చి, సుదీర్ఘకాలంపాటు అసౌకర్యవంతమైన కోణంలో ఉండటానికి ప్రేరేపిస్తాయి. ఇతర ముఖ్యమైన అంశం మానసిక ఒత్తిడి, ఇది మెడ కండరాలలో ఉద్రిక్తతను కలిగిస్తుంది మరియు ఎక్కువ గంటలపాటు మెడను ఒత్తిడికి గురిచేస్తుంది. స్పోర్ట్స్ గాయాలు మరియు ప్రమాదాలు కూడా మెడ పట్టేయడానికి (మెడ పెడసరానికి) ఉన్న సాధారణ కారణాల్లో కొన్ని. మెడపెదసరానికి కారణమయ్యే కొన్ని వైద్య పరిస్థితులు ఏవంటే గర్భాశయ స్పోండిలోసిస్, టార్టికాలిస్ మరియు ఫైబ్రోమైయాల్జియా ఉన్నాయి.
దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
మెడ పట్టేసిన రుగ్మత లక్షణాల ఆధారంగా, మీ డాక్టర్ మీ మెడను పరిశీలిస్తారు. తీవ్రమైన నొప్పిని కల్గించే స్థితికి మెడను ఎంత పరిధిలో కదిలించవచ్చనే విషయాన్ని వైద్యుడు తనిఖీ చేసి చూస్తారు. సాధారణంగా స్కాన్లు తీయాల్సిన అవసరం ఉండదు.
చికిత్సలో కండరాల సడలింపును కలుగజేసే మందులు, నొప్పి నివారణ మందులు మరియు అవసరమైతే వాపు (శోథ) నిరోధక మందుల సేవనం ఉంతుంది.
గృహోపచారాలు, ఇతర ఉపశమన ప్రక్రియాదులు మరియు స్వీయ రక్షణ చర్యలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి గనుక వాటిని తప్పకుండా. అలాంటి ఉపశమన ప్రక్రియాదుల్లో కింద సూచించినవి ఉంటాయి:
- 10 నుండి 15 నిమిషాలపాటు రోజులో కొన్ని సార్లు వేడి మరియు చల్లని ఒత్తడాల్ని(fomentations) నొప్పికల్గిన మెడభాగానికి పెట్టడం.
- మెడకు పూర్తిగా విశ్రాంతినివ్వడం మరియు వ్యాధిలక్షణాలు పూర్తిగా ఉపశమనం చెందే వరకు ఎలాంటి వ్యాయామం చేయకుండా ఉండడం.
- మెడలోని నొప్పికల్గిన భాగానికి సున్నితంగా రుద్దుతూ మసాజ్ చేయవచ్చు. దీనివల్ల పెడసరం తగ్గించేందుకు, మెడలో కండరాల పట్టు తగ్గడానికి వీలుంటుంది.
- బాగా దిట్టమైన పరుపు పైన మెడను పెట్టుకుని నిద్రించడంవల్ల మెడకు మంచి మద్దతు లభిస్తుంది మరియు మెడ పెడసరానికి (మెడలో కండర పట్లు) ఉపశమనం కల్గుతుంది.
కొన్ని సాధారణ జీవనశైలి మార్పులతో పట్టేసిన మెడ (stiff neck) నొప్పిని నివారించవచ్చు, అల్లాంటి కొన్ని జీవనశైలి మార్పులు కింద సూచిస్తున్నాం:
- మీ ల్యాప్టాప్ మరియు మొబైల్ ఫోన్లో పనిగంటల సంఖ్యను పరిమితం చేయండి.
- పని చేసేచోట కంప్యూటర్ మీ కంటి స్థాయిలో సులభంగా పనిచేసేందుకు వీలుగా ఉండేట్టుగా మీ కుర్చీ యొక్క ఎత్తును సర్దుబాటు చేసుకోండి.
- ఒకే స్థానంలో ఉంటున్నపుడు (అంటే పనిచేసే చోట కావచ్చు) తరచూ విరామాలు తీసుకోవడం అవసరం. దీనివల్ల కండరాల్లో సాగడు కల్గి సౌకర్యం లభిస్తుంది
- క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మరియు మంచి భంగిమను నిర్వహించడం.