స్పోరోట్రైకోసిస్ అంటే ఏమిటి?
స్పోరోథ్రిక్స్ (sporothrix) అనే ఫంగస్ వలన కలిగే దీర్ఘకాలిక ఫంగల్ సంక్రమణను స్పోరోట్రైకోసిస్ అని అంటారు. ఈ ఫంగస్ వెచ్చని వాతావరణాలలోని నేలలో నివసిస్తుంది అలాగే తరచుగా గులాబీ పొదలు వంటి మొక్కలలో, నాచు మరియు ఎండుగడ్డి కనిపిస్తుంది, స్పారోట్రైకోసిస్ను తరచుగా రోజ్ గార్డెనర్ వ్యాధి (rose gardener’s disease) గా పిలుస్తారు. ఈ ఫంగల్ సంక్రమణ చర్మంపై తెగిన గాయాలు లేదా కమిలిన గాయాలు మీద అభివృద్ధి చెందవచ్చు. ఈ ఇన్ఫక్షన్ సాధారణంగా రైతులను మరియు తోటమాలిలను ప్రభావితం చేస్తుంది.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
స్పోరోట్రైకోసిస్ యొక్క లక్షణాలు చర్మం పై తెగిన గాయాలు లేదా పుండ్లకు స్పోరోథ్రిక్స్ స్కెన్స్కి (Sporothrix schenckii) అనే ఫంగస్ సోకిన మొదటి 12 వారాలలో ఎప్పుడైనా సంభవించవచ్చు.
ఇది మొదట చర్మం మీద నొప్పిలేని చిన్న ఎర్రని బొడిపెను అభివృద్ధి చేస్తుంది, తర్వాత అది పుండుగా మారుతుంది. ఫంగస్ శ్వాస వ్యవస్థలోకి ప్రవేశిస్తే అది శ్వాస ఆడకపోవడాన్ని, దగ్గు, ఛాతీ నొప్పి మరియు జ్వరాన్ని కలిగిస్తుంది.
రెండు రకాల స్పోరోట్రైకోసిస్లు ఉన్నాయి: స్థిరమైనది (fixed) మరియు వ్యాపించేది (disseminated). స్థిరమైన స్పోరోట్రైకోసిస్ చర్మ బొడిపెల (skin nodules) మీద మాత్రమే పరిమితమై ఉంటుంది, అయితే, వ్యాపించే స్పోరోట్రైకోసిస్ చర్మం నుండి ఇతర శరీరం భాగాలకు వ్యాపిస్తుంది. డయాబెటిస్ మెల్లిటస్ (మధుమేహం), కాన్సర్ మరియు ఎయిడ్స్ వంటి సిస్టమిక్ వ్యాధులతో బాధపడే రోగులలో వ్యాపించే స్పోరోట్రిసిస్ వ్యాధి యొక్క అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల, ఆర్థరైటిస్, తలనొప్పులు మరియు మూర్ఛలు వ్యాపించే స్పోరోట్రైకోసిస్(disseminated sporotrichosis) యొక్క సాధారణ లక్షణాలు.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
ఫంగస్ సోకిన మొక్కలను నిర్వహించే వారి చేతులు మీద బహిరంగ గాయం/పుండ్లు లేదా తెగిన గాయాల ద్వారా ఫంగస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది అది క్యుటేనియస్ స్పోరోట్రైకోసిస్ (Cutaneous sporotrichosis) కు కారణమవుతుంది. అరుదుగా స్పోరోట్రైకోసిస్, ఫంగల్ బీజాంశలను (స్పోర్స్) పీల్చడం వలన ఊపిరితిత్తులుకు సోకుతుంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో వ్యాపించే (disseminated) స్పోరోట్రైకోసిస్ అధికంగా సంభవిస్తుంది.
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
సాధారణంగా వైద్యులు వైద్య పరీక్ష ద్వారా మరియు ఆరోగ్య చరిత్రను తెలుసుకోవడం ద్వారా స్పోరోట్రైకోసిస్ను సులభంగా నిర్ధారిస్తారు. ఫంగస్ సాగు కోసం చర్మ బొడిపె నుండి చీమును సేకరించడం మరియు ఇన్ఫెక్షన్ సోకిన చర్మం యొక్క నమూనాకు జీవాణుపరీక్ష నిర్వహించడం ద్వారా రోగనిర్ధారణను ధృవీకరిస్తారు. క్యుటేనియస్ స్పోరోట్రైకోసిస్ ఎక్కువగా రక్త పరీక్షలు ద్వారా గుర్తించబడుతుంది. ఈ అంటువ్యాధులు/సంక్రమణలు ప్రాణాంతకము కానప్పటికీ, ఈట్రాకనోజోల్ (itraconazole) వంటి యాంటీ ఫంగల్ మందులతో చికిత్స చేయాలి. అయితే, ఈ మందులు గర్భదారణ సమయంలో ఉపయోగించరాదు. తీవ్రమైన స్పోరోట్రైకోసిస్ చికిత్సకు అంఫోటేరిసిన్ బి (Amphotericin B) ను ఇంట్రావీనస్ ఇంజెక్షన్ ద్వారా ఇస్తారు.
గాయాల ద్వారా ఫంగస్ శరీరంలోకి ప్రవేశించడాన్ని నివారించడానికి చర్మ గాయాలను/పుండ్లు పూర్తిగా శుభ్రం చెయ్యాలి మరియు కప్పి ఉంచాలి. గాయం/పుండు వేగంగా నయం కావడానికి/ తగ్గడానికి గాయాన్ని అధికంగా గోకకూడదు.