వెన్నుముక గాయం అంటే ఏమిటి?
వెన్నెముక గాయం అనేది వెన్నుముకకు లేదా వెన్నుపాము/ముక నుండి వచ్చే నరములకు ఆకస్మిక గాయం లేదా దెబ్బ తగలడం/కలగడం. ఈ రకమైన గాయం సాధారణంగా సంచలనాల/అనుభూతుల (sensations) మార్పులకు, కండరాల దృఢత్వం యొక్క మార్పులు, మరియు కొన్నిసార్లు పక్షవాతానికి కూడా దారి తీయవచ్చు. వెన్నెముక గాయం అనేది పై నుండి కింద పడడం వలన, ప్రమాదాలు లేదా వెన్నుపూస ఎముకల యొక్క సంక్రమణల వలన సంభవించవచ్చు. గాయం చిన్నగా ఉంటే, అది త్వరగానే నయం కావచ్చు/ తగ్గవచ్చు, అయితే తీవ్ర గాయం ఐతే, అది శాశ్వత నష్టాన్ని కలిగించవచ్చు.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
వెన్నుపాము గాయం యొక్క సంకేతాలు మరియు లక్షణాలు గాయం యొక్క తీవ్రతతో పాటు గాయం సంభవించిన స్థానం లేదా స్థాయిపై ఆధారపడి ఉంటుంది.
- పారాప్లీజియా (Paraplegia) లేదా క్వాడ్రిప్లీజియా (quadriplegia)- ఒకటి లేదా నాలుగు కాళ్ళు చేతుల యొక్క పక్షవాతం
- సంచలన మార్పు లేదా సంచలనాన్ని పూర్తిగా కోల్పోవడం, ముఖ్యంగా స్పర్శ, వేడి లేదా చల్లదనానికి
- మలవిసర్జన లేదా మూత్రవిసర్జన మీద నియంత్రణను కోల్పోవడం
- కదలికల నష్టం
- రిఫ్లెక్స్ చర్యలు (ప్రతిస్పందనలు) అధికమవ్వడం లేదా తగ్గిపోవడం
- లైంగిక చర్యలు మారిపోవడం
- దగ్గడం మరియు శ్వాస తీసుకోవడంలో కఠినత
తీవ్రమైన గాయాన్ని సూచించే సంకేతాలు మరియు లక్షణాలు:
- మెడ మరియు తల వరకు విస్తరించే తీవ్రమైన వెన్ను నొప్పి
- ప్రభావితమైన భాగం యొక్క పక్షవాతం
- శరీర భంగిమను నిర్వహించడంలో మరియు నడవడంలో కఠినత
- గాయం తర్వాత శ్వాస తీసుకోవడంలో సమస్య
- మలవిసర్జన లేదా మూత్రవిసర్జన మీద నియంత్రణను కోల్పోవడం
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
వెన్నుపూస యొక్క ఎముకలకు, ఇంటర్ వెర్టిబ్రల్ డిస్క్ (intervertebral disc) లేదా వెన్నుపూసను బలపరిచే కండరాలు మరియు లిగమెంట్లకు ప్రమాదం జరిగినపుడు, వెన్నుముక గాయం యొక్క లక్షణాలు సంభవిస్తాయి. ఈ భాగాలకు గాయం ఆకస్మికంగా (వెన్నుపూస యొక్క ఫ్రాక్చర్ లేదా దాని ఎముకల స్థానం మారడం) జరుగవచ్చు లేదా ఆర్థరైటిస్, వాపు, సంక్రమణం, క్యాన్సర్ లేదా డిస్క్ క్షీణత (disc degeneration) కారణంగా జరగవచ్చు.
ఫ్రాక్చర్ వల్లనే కాక, వెన్నెముక యొక్క సంకోచానికి (compression) కారణమయ్యే వెన్నెముక చుట్టూ వాపు, ద్రవం చేరడం మరియు రక్తస్రావం వల్ల కూడా వెన్నుముక గాయాలు సంభవిస్తాయి. ఈ గాయాలు పడిపోవడం వల్ల, వాహన ప్రమాదాలు, భౌతికంగా గాయపరచడం, క్రీడలు గాయాలు లేదా ఇతర వ్యాధుల కారణంగా కూడా సంభవించవచ్చు.
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
వెన్నెముక గాయం కేసులను సాధారణంగా అత్యవసర గదిలో(emergency room) చేరుస్తారు, క్షుణ్ణమైన వైద్య పరీక్ష, రిఫ్లెక్స్ (reflexes)ల యొక్క విశ్లేషణ వెన్నుముక గాయపడిన స్థాయిని మరియు గాయం యొక్క తీవ్రతను సూచిస్తుంది. ఆరోగ్య చరిత్రతో పాటు, కొన్ని ఇమేజింగ్ పరీక్షలు గాయం యొక్క పరిధిని తెలుసుకోవడానికి సహాయం చేస్తాయి. ఇమేజింగ్ పరీక్షలు ఈ కింది వాటిని కలిగి ఉంటాయి:
- ఎక్స్-రే, ఫ్రాక్చర్ మరియు డిస్క్ హెర్నిషన్ (disc herniation) మొదలైన వాటి తనిఖీ కోసం సహాయం చేస్తుంది.
- సిటి (CT) స్కాన్: ఇది ఎక్స్-రే కంటే మెరుగైన దృశ్యాన్ని అందిస్తుంది మరియు ఎముకలు మరియు డిస్కుల గురించి ఒక స్పష్టతను అందిస్తుంది మరియు వెన్నుపూస యొక్క ఎముకలలోని ఇన్ఫెక్షన్లు లేదా క్యాన్సర్లను తనిఖీ చేయడంలో కూడా సహాయపడుతుంది.
- ఎంఆర్ఐ (MRI) స్కాన్ - ఇది అత్యంత అధునాతన పద్ధతి మరియు పరిశోధనా ఎంపిక, ఇది ఎముకలు, కండరాలు, స్నాయువులు (లిగమెంట్లు) మరియు ఇంటర్ వెర్టిబ్రల్ డిస్కుల యొక్క స్పష్టమైన చిత్రాలని ఇస్తుంది. ఇది వెన్నుముక సంకోచం (compression) యొక్క పరిధిని తెలుసుకోవడానికి కూడా సహాయపడుతుంది.
వెన్నెముక గాయం యొక్క చికిత్స ముఖ్యంగా వైకల్యం/అసామర్ధ్యత మరియు నొప్పి మరియు అసౌకర్యం యొక్క లక్షణాలను తగ్గించడంపై దృష్టి పెడుతుంది, ఎందుకంటే వెన్నుపాము నష్టాన్నీ/హానిని తగ్గించడానికి పరిమిత/తక్కువ మార్గాలు మాత్రమే ఉంటాయి.
తీవ్రమైన గాయాలు కోసం ఉపయోగించే చికిత్సా విధానాలు:
- వెన్నెముక చుట్టూ ఉన్న నరముల వాపు మరియు మంటను తగ్గించడం కోసం మందులు.
- వెన్నుపూసను స్థిరీకరించడానికి (stabilize) ఇమ్మొబిలైజెషన్ (Immobilization).
- వెన్నుపూస యొక్క ఎముకలు మరియు లిగమెంట్ల గాయాలను సరిచేసేందుకు శస్త్రచికిత్స.
దీర్ఘకాలిక గాయాలకు చికిత్సా విధానాలు:
- మందులు - కొన్ని రకాల మందులు నొప్పిని తగ్గిస్తాయి, కండరాలకు ఉపశమనాన్ని కలిగిస్తాయి మరియు మూత్రవిసర్జన మరియు మలవిసర్జన పై నియంత్రణను మెరుగుపరుస్తాయి.
- భౌతిక చికిత్స (Physical therapy) - దీనిని రీహాబిలిటేషన్ చికిత్స (rehabilitation therapy) అని కూడా పిలుస్తారు, ఇది గాయం యొక్క ప్రభావాన్ని తగ్గిస్తుంది మరియు కాళ్ళు/చేతులు కోల్పోయిన విధులు మెరుగుపరుస్తుంది. వీటి కోసం అనేక ఆధునిక పద్ధతులు ఉపయోగించబడతాయి, అవి:
- ఎలెక్ట్రిక్ నెర్వ్ స్టిములేషన్ (Electric nerve stimulation)
- రోబోటిక్ గెయిట్ శిక్షణ (Robotic gait training)
- ఆధునిక ఎలక్ట్రిక్ వీల్చైర్ల యొక్క ఉపయోగం (Use of modern electrical wheelchairs).