పులితేన్పు అంటే ఏమిటి?
కడుపులో ఎక్కువగా గ్యాస్ చేరడంవల్ల ఈ పులితేన్పులు వస్తాయి. పుల్లని తేన్పులు అనేవి గంధకంతో కూడిన తేన్పులు. కడుపులో ఎక్కువగా గాలి ఎలా చేరుతుందంటే ఆహారాన్ని తొందర తొందరగా తినేటపుడు మనిషి ఎక్కువగాలిని మింగడం జరుగుతుంది. అలాగే ధూమపానం, చూయింగ్ గం నమిలేటపుడు కూడా ఇలా ఎక్కువ గాలిని మింగడం జరుగుతుంది. కొన్ని వాయువు-ఏర్పడే ఆహారాల్ని తినడంవల్ల కూడా పొట్టలో గాలి ఏర్పడడానికి కారణమవుతాయి. పులితేన్పును పులితేపు, పులిత్రేపు అని కూడా వ్యవహరిస్తారు
దీని సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
ఆమ్లత (రిఫ్లాక్స్) వ్యాధితో బాధపడే వ్యక్తులలో పులితేన్పులు (సోర్ బర్ప్) సాధారణంగా కనబడుతాయి, అందుకే గుండె మంట, ఉబ్బరం, గాలిచేరినట్టుండే భావన, అపానవాయువు, వికారం మరియు నోరు వాసన వంటివి అన్ని సంబంధిత పులితేన్పుల వ్యాధి లక్షణాలే. వ్యక్తి భోజనం చేసిన తర్వాత మరియు రాత్రిపూట ఈ వ్యాధి లక్షణాలు మరింత అధ్వాన్నంగా రావచ్చు, ఇది రోగి తన తల, ముఖాన్ని కిందికిబెట్టుకున్న స్థితిలో నిద్రపోయేలా చేస్తుంది.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్ ఉత్పత్తి కారణంగా పులితేన్పులు (సోర్ బర్ప్స్) ఏర్పడతాయి. మనిషి గ్రహించిన ఆహారాన్ని నోటి కుహరం మరియు జీర్ణ వ్యవస్థలో ఉండే బ్యాక్టీరియా పతనం చేస్తుంది, అపుడే ఈ వాయువు ఉత్పత్తి అవుతుంది. అధిక ప్రోటీన్-ఆహారాలు, బ్రోకలీ వంటి కూరగాయలు మరియు మద్యం హైడ్రోజన్ సల్ఫైడ్ ను విడుదల చేసేవిగా ఉన్నాయి. తరచుగా వచ్చే పులితేన్పులు మరియు దీర్ఘకాలిక పులితేన్పులకు ఇతర సాధారణ కారణాలు ఏవంటే గ్యాస్ట్రో-ఓసోఫాగియల్ రిఫ్లస్ వ్యాధి (GERD) మరియు ప్రకోప ప్రేగు సిండ్రోమ్ వంటి జీర్ణవ్యవస్థ వ్యాధులు. ఈ వ్యాధులవల్ల కడుపు నుండి గ్యాస్ పైకి ఉబికి తేన్పులరూపంలో వెలుపలికి దూసుకొస్తాయి. ఆహారం విషతుల్యమవడం, కొన్ని మందులు, ఒత్తిడి మరియు గర్భధారణ అనేవి పులితేన్పులకు కొన్ని ఇతర కారణాలుగా ఉన్నాయి.
పులితేన్పుల్ని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
పులితేన్పుల (పుల్లని తేన్పులు) వ్యాధి నిర్ధారణ అనేది వ్యాధి లక్షణాలు మరియు వివరణాత్మక చరిత్ర ఆధారంగా తయారు చేయబడుతుంది. గ్యాస్ట్రో-ఒసిఫేగల్ రిఫ్లక్స్ వ్యాధి (gastro-oesophageal reflux disease -GERD)ని తోసిపుచ్చడానికి ఎండోస్కోపీ చేయవచ్చు.
ఆహారసేవనంలో మరియు జీవనశైలిలో మార్పులు చేయడంవల్ల రోగికి అవాంఛనీయమైన మరియు బాధించే పుల్లని తేన్పుల్ని నివారించడంలో సహాయపడుతాయి. కొన్ని ఇంటి చిట్కాలు నివారణలు సోర్ బర్ప్స్ తగ్గించటానికి సహాయపడతాయి. గ్రీన్ టీ జీర్ణక్రియకు సహాయపడే ఉత్తమ ఏజెంట్లలో ఒకటి; ఇది గొప్ప యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఆపిల్ సైడర్ వినెగార్ (apple cider vinegar) అనేది పేగుల్లో ఆరోగ్యకరమైన సంతులనాన్ని కొనసాగించడానికి ఉపయోగించే మరో గొప్ప మూలకం. ఇది పేగుల్లో బ్యాక్టీరియా విపరీతంగా పెరిగిపోకుండా నియంత్రించేందుకు సహాయపడుతుంది. బ్రోకలీ, మొలకలు మరియు వెల్లుల్లి వంటి పొట్టలో గాలిని పెంచే ఆహారాల్ని వాడకూడదు. ధూమపానం ఆపాలి. పాలు ఉత్పత్తుల్ని తినడాన్ని కూడా ఆపు చేయాలి. పులితేన్పులకు కారకాలైన కార్బొనేటెడ్ పానీయాలు, మద్యపానీయాల్ని తాగటాన్ని తప్పనిసరిగా నిలిపివేయబడాలి.
పులితేన్పుల్ని నివారించడంలో పైన పేర్కొన్న పరిహార చికిత్సలు (రెమిడీస్) విఫలమైతే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. గాలి ఉత్పత్తిని తగ్గించేందుకు వైద్యుడు మీకు యాంటాసిడ్ మందుల్ని సూచించవచ్చు. ఇంకా, నిరంతర వ్యాధి లక్షణాలు కలిగించే ఏవైనా జీర్ణ సమస్యలను గుర్తించడానికి నిర్ధారణా (డయాగ్నొస్టిక్) పరీక్షలను నిర్వహించవచ్చు.