ధూమపాన వ్యసనం అంటే ఏమిటి?
ధూమపాన వ్యసనం అనేది మనిషి (బీడీ, సిగరెట్ల వంటి) పొగతాగే అలవాటుపైన భౌతికంగా ఆధారపడిపోయి ఇక ఆ అలవాటును వదిలిపెట్టలేని స్థితి. ఈస్థితి సుదీర్ఘకాలంపాటు కొనసాగుతూ ఉంటుంది. ఓ వ్యక్తి తనజీవితంలో చిన్నవయసులోనే ధూమపాన దురలవాటును ప్రారంభించి ఉంటే ఆ వ్యక్తికి త్వరలోనే ధూమపానం ఓ వ్యసనంగా మారిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. ధూమపానం చేసేవారిలో కేవలం 6% మంది మాత్రమే ధూమపానాన్ని విజయవంతంగా వదిలి పెట్టేయగలిగారు.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
పొగత్రాగడం అనేది తమను శాంతపరుస్తుందని ధూమపానప్రియులు మొదట భావిస్తున్నప్పటికీ, ఈ దురలవాటు దగ్గు, ఊపిరితిత్తుల అంటువ్యాధులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతకమైన అనేక ఆరోగ్య సమస్యలు తెచ్చిపెట్టడమే కాకుండా ఒక్కోసారి మరణానికి కూడా దారి తీస్తుంది. ఒక వ్యక్తి ధూమపానం విడిచిపెట్టాలని ప్రయత్నించినప్పుడు అతని/ఆమె లో క్రింది ఉపసంహరణ లక్షణాలు చూడవచ్చు:
- అసాధారణ విచారం
- కోపం రావడం లేదా విసుగుచెందడం
- దేనిపైనా దృష్టి పెట్టలేకపోవడం
- తగ్గించబడిన గుండె స్పందన రేటు
- పెరిగిన ఆకలి మరియు శరీర బరువు
- నిద్రలేమి
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
ధూమపాన వ్యసనం ఎక్కువగా మానసిక మరియు భావోద్వేగ అవాంతరాలతో ముడిపడి ఉంటుంది. కొందరు ఒత్తిడి నుండి బయటపడటానికి ధూమపానం ప్రారంభించవచ్చు; ఇంకొందరు ఒత్తిడి కారణంగానే ధూమపానం చేస్తుంటారు. ధూమపానం ప్రారంభించిన తరువాత, శరీరం నికోటిన్ కు బానిస అవుతుంది మరియు రాను రాను ధూమపానం యొక్క పరిమాణం పెరుగుతుంది, తద్వారా వ్యక్తి ధూమపానం పెరుగుతుంది. అందువలన, వ్యక్తి భౌతికంగా మరియు మానసికంగా ధూమపానంపై ఆధారపడిపోయి దానికి బానిసగా మారిపోవడం జరుగుతుంది.
దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
రోగికి అతని/ఆమె ధూమపాన వ్యసనంవల్ల కలిగే లక్షణాల చరిత్రను అడగడం ద్వారా వైద్యుడు ఈ వ్యసనం యొక్క నిర్ధారణను చేయవచ్చు. రక్త పరీక్షలూ ఆదేశించబడవచ్చు మరియు నికోటిన్ స్థాయిల్ని కొలుస్తారు. మూత్రం, లాలాజలం మరియు జుట్టు యొక్క నమూనాలు విశ్లేషణ కోసం తీసుకోవచ్చు.
చికిత్స
వ్యక్తులు ధూమపాన వ్యసనం నుండి బయట పడటానికి ఆహారం మరియు ఔషధ పరిపాలనా విభాగం (FDA) ఆమోదిత చికిత్సలు దండిగా అందుబాటులో ఉన్నాయి. గమ్స్ లేదా పాచెస్ వంటి నికోటిన్ పునఃస్థాపన చికిత్సల్ని వైద్యులు సిగరెట్ల ధూమపాన వ్యసనానికి లోనైనవారు ఆవ్యసనాన్ని మానుకోవడం కోసం సూచిస్తుంటారు.
ఔషధ చికిత్సతో పాటు కొన్ని నాన్-ఫార్మకోలాజికల్ పద్ధతులైన ప్రవర్తనా చికిత్స వంటివి కూడా ధూమపానాన్ని విడిచిపెట్టడంలో సహాయపడతాయి. వ్యక్తి తనను తాను బిజీగా ఉంచుకోవడం అనేది ధూమపానం వ్యసనం నుండి బయటపడటానికి సహాయపడుతుంది. ధూమపానం వ్యసనం నుండి బయటపడే క్రమంలో వ్యక్తికి కలిగే ఒత్తిడిని ఎదుర్కోవడంలో కౌన్సెలింగ్ ద్వారా ఆ వ్యక్తికి చేయబడే బోధన మంచిగా సహాయపడుతుంది.