సోగ్రెన్స్ సిండ్రోమ్ అంటే ఏమిటి?
1933 లో డాక్టర్ హెన్రిక్ సోగ్రెన్ మొదట ఈ సిండ్రోమ్ను ఒక ఆటోఇమ్యూన్ వ్యాధిగా గుర్తించాడు, దీనిలో శరీరంలోని తేమను-ఉత్పత్తి (moisture-producing) చేసే కణాలు నాశనమవుతాయి. ఇది సాధారణంగా 40 సంవత్సరాల వయసు పైబడిన వారిలో కనిపిస్తుంది మరియు మహిళలు ఎక్కువగా ప్రభావితమవుతారు. తరచుగా, ఇది ఇతర ఆటోఇమ్యూన్ వ్యాధులైన రుమటాయిడ్ ఆర్థరైటిస్ లేదా లూపస్ వంటి వాటి యొక్క లక్షణం లేదా ఫలితం.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
ప్రధాన లక్షణాలు వీటిని కలిగి ఉంటాయి
- కళ్ళు పొడిబారి దురద, మంట, నొప్పి కలిగిస్తాయి మరియు కళ్ళు వాచి అస్పష్టంగా కనిపిస్తాయి
- నోరు పొడిబారి ఈ కింది వాటిని కలిగిస్తుంది:
- నోరు లేదా గొంతులో ఆహారం అంటుకుని ఉండిపోవడం
- గొంతు బొంగురుపోవడం మరియు నాలుక నున్నగా ఎరుపు రంగులోకి మారిపోతుంది
- పెదాలు పొడిబారి మూలలు పగులుతాయి
- రుచి సంచలనం/అనుభూతి మారిపోతుంది
- దంత క్షయం, నోటి పూతలు, నోటి థ్రష్ (ఈస్ట్ సంక్రమణ)
- చర్మం పొడిబారడం మరియు దురద
- కీళ్ళ మరియు కండరాల నొప్పి
- లాలాజల గ్రంథుల వాపు
- మహిళల్లో యోని పొడిబారడం
- చెమట పొక్కులు ఏర్పడడం
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
కారణం తెలియలేదు కానీ ఈ వ్యాధితో బాధపడుతున్న చాలామంది వారి రక్తంలో అసాధారణ ప్రోటీన్ ను కలిగి ఉన్నట్లు గుర్తిచబడింది. రోగనిరోధక వ్యవస్థ మొదటిగా ముక్కు, కళ్ళు మరియు నోటి చుట్టూ ఉన్న శరీరం యొక్క తేమ-ఉత్పత్తి గ్రంధుల మీద దాడి చేస్తుంది.
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
వైద్యులు లక్షణాల కోసం రోగి యొక్క కళ్ళు మరియు నోటిని పరిశీలిస్తారు. నోరు మరియు కళ్ళ యొక్క పొడిదనం అనేక మందుల యొక్క దుష్ప్రభావం ఫలితంగా కూడా కలుగుతుంది అందువల్ల, అనేక సందర్భాలలో రోగ నిర్ధారణ కష్టం అవుతుంది. రక్త పరీక్షలు, కంటి పరీక్ష, సయోలోగ్రఫీ (sialography, లాలాజల ప్రవాహాన్ని/ఉత్పత్తిని పరీక్షించడానికి లాలాజల గ్రంధిలో ఒక డైను ప్రవేశపెట్టి ఎక్స్-రే నిర్వహిస్తారు), సలైవరి సిన్టిగ్రఫీ (salivary scintigraphy, కొన్ని రేడియోయాక్టీవ్ ఐసోటోపూలను రక్తంలోకి ఎక్కించి అవి లాలాజల గ్రంధిని చేరుకోవడానికి ఎంత సమయం తీసుకుంటున్నాయో అంచనా వేస్తారు), మరియు పెదవి యొక్క బయాప్సీ (జీవాణుపరీక్ష) వంటి కొన్ని పరీక్షలు రోగ నిర్ధారణను ధ్రువీకరించడానికి నిర్వహిస్తారు.
లూబ్రికేటింగ్ కంటి చుక్కలను (lubricating eye drops) ఉపయోగించి కళ్ళ యొక్క పొడిదనాన్ని నిర్వహించవచ్చు. తరచుగా నీటి తీసుకోవడం, చూయింగ్ గమ్ములు నమలడం, మరియు లాలాజల ప్రత్యామ్నాయాలు (salivary substitutes) నోటి యొక్క పొడిదనాన్ని తగ్గిస్తాయి. నోటి యొక్క ఈస్ట్ ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి యాంటీ ఫంగల్ ఔషధాలను ఉపయోగిస్తారు. అప్పుడప్పుడూ రోగనిరోధక వ్యవస్థను నియంత్రించడానికి ఇమ్యునో సప్రెసెంట్ (immunosuppressant) మందులను ఉపయోగిస్తారు.