సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ (యస్ఏడి) - Seasonal Affective Disorder (SAD) in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

January 05, 2019

March 06, 2020

సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్
సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్

సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ (యస్ఏడి) అంటే ఏమిటి?

యస్ఏడి అని కూడా పిలువబడే సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్, పేరులో సూచించినట్లుగా, కాలానుగుణ (ఋతువుల) మార్పుల వలన సంభవించే కుంగుబాటుకు గురిచేసే ఒక రుగ్మత (depressive disorder). ఇది శీతాకాలంలో ఎక్కువగా జరుగుతుంది అందువలన దీనిని 'శీతాకాలపు కుంగుబాటు (winter depression) లేదా శీతాకాల బ్లూస్ (winter blues)' అని కూడా పిలుస్తారు. ఇది సాధారణంగా  ఎండాకాలం చివరిలో ప్రారంభమవుతుంది మరియు శీతాకాలంలో మొదటిలో ముగుస్తుంది. వేసవి కాలంలో, దీని సంభవ్యత తక్కువగా ఉంటుంది. ఇది మహిళల్లో, టీనేజ్ లో ఉన్న వారిలో మరియు భూమధ్యరేఖ (equator) నుండి దూరంగా నివసిస్తున్న వ్యక్తుల్లో ఎక్కువగా సంభవిస్తునట్లు గుర్తించబడింది. గతచరిత్ర ఆధారిత అధ్యయనాల (retrospective studies) ప్రకారం దీని ప్రాబల్యం  0% -6.9% గా ఉందని కనుగొనబడింది.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

లక్షణాలు నాన్ సీజనల్ టైప్ డిప్రెషన్ రకం (సాధారణ కుంగుబాటు) మాదిరిగానే ఉంటాయి. యస్ఏడి యొక్క ప్రధాన లక్షణాలు:

  • అధిక కుంగుబాటు/నిరాశ
  • ఎల్లప్పుడూ విచారంగా ఉండడం
  • ప్రతికూల (Negative) ఆలోచనలు
  • బలం లేకపోవడం
  • అధిక కార్బోహైడ్రేట్లు (పిండి పదార్థాలు) ఉండే ఆహారాలు తినాలనే కోరిక కలగడం
  • నిద్రలేమి
  • దృష్ఠి కేంద్రీకరించడంలో సమస్య

చలికాలంలో ప్రభావితం చేసే యస్ఏడి యొక్క లక్షణాలు ఈ క్రింది విధంగా ఉండవచ్చు:

  • శక్తి/బలం లేకపోవడం
  • పగటి వేళ అధికంగా నిద్రపోవడం
  • ఆకలి పెరగడం
  • ప్రజల నుండి దూరంగా ఉండటం

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

యస్ఏడి యొక్క కారణం గురించి స్పష్టంగా తెలియలేదు. జన్యుపరమైన అసాధారణతలు సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ కు దోహదం చేయవచ్చు.

ప్రమాద కారకాలు:

  • పురుషులతో పోలిస్తే మహిళలు ఈ రుగ్మత అనుభవించే ప్రమాదం నాలుగు రెట్లు అధికంగా ఉంటుంది
  • ఉత్తర లేదా దక్షిణ ధ్రువాల (north or south poles) సమీపంలో నివసించే ప్రజలలో ఈ సమస్య సంభవించే ప్రమాదం/సంభావ్యత అధికంగా ఉంటుంది
  • యస్ఏడి యొక్క కుటుంబ చరిత్ర కలిగిన వారిలో ఇది సంభవించే ప్రమాదం ఉంటుంది
  • వృద్ధుల కన్నా యువతను అధికంగా ప్రభావితం అవుతారు
  • విటమిన్ D యొక్క లోపం కూడా నిరాశ ఎపిసోడ్లకు (depressive episodes) కారణం కావచ్చు

దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

కుంగుబాటుకు గురిచేసే లక్షణాలను పరిశీలించడం ద్వారా యస్ఏడిను నిర్ధారించవచ్చు . రోగి యొక్క మానసిక ఆరోగ్యాన్ని విశ్లేషించడానికి ఒక ప్రశ్నాపత్రాన్ని(questionnaire) ఉపయోగించవచ్చు.

యస్ఏడి చికిత్సకు అత్యంత సాధారణమైన విధానం guidance (light therapy). సమర్థవంతమైన ఫలితాల కోసం ఈ చికిత్స ప్రతిరోజూ సిఫార్సు చేయబడుతుంది మరియు మానసిక ఆరోగ్య నిపుణుడి నేతృత్వంలో మాత్రమే దీనిని (guidance) నిర్వహించాలి. తరువాతి విధానం లక్షణాల తగ్గుదలకు మరియు దీర్ఘ-కాలిక ప్రయోజనాన్ని అందించడానికి యాంటీ-డిప్రెస్సివ్ (anti-depressive) మందులు సూచించబడతాయి. కాగ్నిటివ్ బెహవియరల్ థెరపీ (CBT) ఆలోచన ప్రక్రియలను గమనించడానికి మరియు సానుకూల (positive) ఆలోచనలు కలిగేలా చెయ్యడానికి ఉపయోగించబడుతుంది. విటమిన్ డి సప్లిమెంట్లను కూడా ఇవ్వవచ్చు.

యస్ఏడి అనేది కుంగుబాటుకు గురిచేసే ఒక రకమైన రుగ్మత, ఇది కాలానుగుణ మార్పుల కారణంగా మాత్రమే ప్రేరేపించబడుతుంది కాబట్టి, సులభంగా దీనిని నివారించవచ్చు. సరైన గుర్తింపు(నిర్దారణ)తో ప్రారంభంలోనే దీనిని తగ్గించవచ్చు.



వనరులు

  1. National Institute of Mental Health [Internet] Bethesda, MD; Seasonal Affective Disorder. National Institutes of Health; Bethesda, Maryland, United States
  2. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Seasonal Affective Disorder
  3. American Psychological Association [internet] St. NE, Washington, DC. Seasonal Affective Disorder Sufferers Have More Than Just Winter Blues.
  4. National Institutes of Health; [Internet]. U.S. National Library of Medicine. Seasonal affective disorder
  5. Mental Health. Seasonal Affective Disorder. U.S. Department of Health & Human Services, Washington, D.C. [Internet]

సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ (యస్ఏడి) కొరకు మందులు

Medicines listed below are available for సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ (యస్ఏడి). Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.

Medicine Name

Price

₹129.0

₹215.0

Showing 1 to 0 of 2 entries