స్కార్లెట్ జ్వరం అంటే ఏమిటి?
స్కార్లెట్ జ్వరం స్ట్రెప్టోకోకి (streptococci) అని పిలవబడే బ్యాక్టీరియా వల్ల కలిగే సంక్రమణం/ఇన్ఫెక్షన్. వ్యాధి సోకిన వ్యక్తిలో సంక్రమణ యొక్క లక్షణాలు అభివృద్ధి చెందడానికి 2-5 రోజుల సమయం పడుతుంది. ఇది పిల్లలలో సాధారణంగా కనిపించే ఒకరకమైన అంటువ్యాధి మరియు ఇది ఎక్కువగా గొంతునొప్పితో మొదలవుతుంది. అయితే, పెద్దలు బ్యాక్టీరియాకు ప్రధాన వాహకాలు (prime carriers) గా ఉన్నారు. జ్వరం, వాంతులు, చలి మరియు కడుపు నొప్పి ఈ పరిస్థితి యొక్క ఇతర లక్షణాలు, పిల్లల నాలుక మీద తెల్లటి పూత కూడా ఏర్పడుతుంది. మొత్తంగా, ఈ బాక్టీరియా టాన్సిలైటిస్, చర్మ ఇన్ఫెక్షన్/సంక్రమణ మరియు తీవ్రమైన రుమాటిక్ జ్వరాన్ని కలిగించవచ్చు.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
ఈ ఇన్ఫెక్షన్ యొక్క సంకేతాలు మరియు లక్షణాలు:
- గొంతు నొప్పి
- జ్వరం
- వాచిన ఎర్రని టాన్సిల్స్
- వాచిన లేదా స్ట్రాబెర్రీ (ఎర్రని మరియు పెద్ద బొడిపె వలె ఉండే) నాలుక
- వికారం
- వాంతులు
- ఆకలిలేమి
- చెమట పొక్కుల వలె శరీరమంతా ఎర్రటి దద్దుర్లు ఏర్పడతాయి, అందువలన ఈ వ్యాధికి స్కార్లెట్ జ్వరం అనే పేరు వచ్చింది
తీవ్రమైన సందర్భాల్లో, పరిస్థితి ఇలాంటి సమస్యలకు దారితీస్తుంది:
- టాన్సిల్స్ చుట్టూ చీము నిండిన గడ్డలు/బొడిపెలు
- శోషరస కణుపుల (లింఫ్ నోడ్ల) వాపు
- చర్మము లేదా చెవి సంక్రమణం
- రుమాటిక్ జ్వరము
- న్యుమోనియా
- కీళ్ల వాపు లేదా ఆర్థరైటిస్
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
సంక్రమణ ఈ కింది వాటి ద్వారా వ్యాపిస్తుంది:
- వ్యాధి సోకిన వ్యక్తుల దగ్గు లేదా తుమ్ము నుండి వచ్చిన బాక్టీరియా ఉండే బిందువులను పీల్చడం
- సంక్రమిత వ్యక్తితో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉండడం (వారి కూడా ఉండడం మొదలైనవి)
- కలుషిత ప్రదేశలని తాకి, ఆపై తమ నోరు లేదా ముక్కును తాకడం
- సంక్రమిత వ్యక్తితో తువ్వాళ్లు, దుస్తులు లేదా ఆహారం వంటి వ్యక్తిగత వస్తువులను పంచుకోవడం
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
గొంతును ఒక స్వబుతో రుద్ది మరియు మైక్రోస్కోప్ ద్వారా ఆ స్వబును పరిశీలించడం ద్వారా పరిస్థితిని నిర్ధారించడానికి ఒక స్ట్రెప్టోకోకి పరీక్ష జరుగుతుంది. స్కార్లెట్ జ్వరమును ధృవీకరించడానికి వైద్యులు గొంతు స్వబును ఉపయోగించి స్ట్రెప్టోకోకి సాగును చేయవచ్చు. చికిత్స చేయని స్కార్లెట్ జ్వరం, రుమటిక్ జ్వరానికి దారితీసే ప్రమాదం ఉంది అందువల్ల చిన్న పిల్లలు మరియు టీనేజ్ లో ఉన్న పిల్లలు జాగ్రత్తగా ఉండడం ముఖ్యం.
ఈ పరిస్థితి చికిత్స కోసం పెన్సిలిన్ (penicillin) లేదా అమోక్సిసెలిన్ (amoxicillin) కలిగి ఉండే యాంటిబయోటిక్ థెరపీని సూచిస్తారు. ఐదవ రోజునే చాలామందికి వ్యాధి నయం అవుతుంది, కానీ ఒక 20 రోజుల పాటు నియమానుసారం మందులను తప్పకుండా వాడాలి. జ్వరం మరియు నొప్పి మందులు కూడా సూచించబడవచ్చు. ఉప్పునీటిని పుక్కిలించడం, తగినంత ద్రవాలను తీసుకోవడం మరియు జావ వంటి తేలికైన ఆహారం తీసుకోవడం వంటి ఇంటి చిట్కాలను కూడా పాటించాలి.