ఉప్పు లోపం అంటే ఏమిటి?
ఉప్పు సహజసిధ్ధంగా ఆహారాలలో ఉంటుంది, కానీ చాలా సార్లు, ఉప్పును ఆహారాల తయారీలో ప్రత్యేకంగా అనుబంధక పదార్థంగా చేరుస్తారు. సాధారణ ఉప్పు లేదా సోడియం క్లోరైడ్ అనేది రక్తపోటు మరియు రక్త పరిమాణాన్ని నిర్వహించడానికి సహాయపడే ఓ ముఖ్యమైన పోషక పదార్థం. ఇది శరీరం యొక్క ద్రవం సంతులనాన్ని నియంత్రించడానికి కూడా సహాయపడుతుంది. శరీరంలో తక్కువ ఉప్పు స్థాయిలు కల్గిన పరిస్థితిని లేదా రుగ్మతను ‘హైపోనాట్రేమియా’ మరియు లేదా ‘హైపోక్లోరమియా’ అని పిలుస్తారు.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
ఉప్పు లోపం ప్రధాన చిహ్నాలు మరియు లక్షణాలు:
- వాంతులు మరియు వికారం
- గందరగోళం
- తక్కువ శక్తి స్థాయిలు లేదా బద్ధకం
- కోమా
- విరామము లేకపోవటం
- అలసట
- చిరాకు
- మూర్ఛ
- బలహీనత, తిమ్మిరి, కండరములు లేదా కండరాలలో తిమ్మిరి లేక లాగడం
- చెడు ఆవేశం
- అల్ప రక్తపోటు
- పాదాలు మరియు ముఖంలో వాపు
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
ఉప్పు లోపం ప్రధాన కారణాలు:
- శరీరంలో అధిక ద్రవం లేదా నీరు ఉండడం
- శరీరం నుండి ఉప్పు లేదా ఉప్పు మరియు ద్రవం రెండింటిని కోల్పోవడంవల్ల
- మూత్రపిండ వైఫల్యం
- రక్త ప్రసారం స్తంభించి గుండె ఆగిపోవడం (congestive heart failure)
- తక్కువ థైరాయిడ్ స్థాయిలు వంటి కొన్ని హార్మోన్లు స్థాయిల్లో మార్పు
- మందులు (మూత్రవిసర్జనకారక మందులు, నొప్పి నివారణలు మరియు కుంగుబాటు నివారణా మందులు లేక యాంటీడిప్రజంట్స్)
- పాలీడిప్సియా (మితిమీరిన దాహం)
- తీవ్ర అతిసారం మరియు వాంతులు
దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
రోగి యొక్క వైద్య చరిత్ర ద్వారా మరియు శారీరక పరీక్షను నిర్వహించడం ద్వారా ఉప్పు లోపం గుర్తించబడుతుంది. జీర్ణశయాంతర, నరాల, గుండె, మూత్రపిండాలు మరియు అంతస్స్రావ గ్రంధుల (ఎండోక్రైన్) వ్యవస్థలో సమస్యల్ని ప్రత్యేకంగా గుర్తించడం జరుగుతుంది. అవసరమైతే, ప్రయోగశాల పరీక్షలైన క్రియేటినిన్ స్థాయి పరీక్ష, పూర్తి జీవక్రియ ప్యానెల్, మూత్ర మరియు రక్త సోడియం మరియు క్లోరిన్ స్థాయి పరీక్షలు మరియు ఇతర పరీక్షలు జరుపబడతాయి.
ఉప్పు లోపం రుగ్మతకు చికిత్స దాని అంతర్లీన కారణం మీద ఆధారపడి ఉంటుంది. ఉప్పు లోపాన్ని చికిత్స చేయడానికి ఉపయోగించే పద్ధతులు కింద సూచించినవిధంగా ఉంటాయి:
- సోడియం ద్రావణాన్ని నోటి ద్వారా కడుపుకు లేదా సిరల ద్వారా (సిరకు సూది ద్వారా) ఇవ్వబడుతుంది.
- మూత్రపిండాలు శరీరం నుండి అదనపు నీటిని తీసివేయడంలో సహాయపడటానికి డయాలసిస్
- శరీరం లో ఉప్పు స్థాయిలు నిలుపుకోవటానికి మందులు
- మూర్ఛలు, వికారం మరియు తలనొప్పితో సహా ఉప్పు లోపం యొక్క వ్యాధి లక్షణాలను నిర్వహించడానికి మందులు
- తగినంత ఉప్పు స్థాయిలు కలిగిన ఆహారాన్ని సిఫార్సు చేయబడడం
- వ్యాధికారణాలకు చికిత్స చేయడానికి స్వల్పకాలిక చికిత్సల్లో ఔషధాలను సర్దుబాటు చేయడం మరియు నీరు తాగడాన్ని నియంత్రించడం వంటివి ఉంటాయి.