సాల్మోనెల్లాసిస్ - Salmonella in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

January 05, 2019

March 06, 2020

సాల్మోనెల్లాసిస్
సాల్మోనెల్లాసిస్

సాల్మోనెల్లోసిస్ అంటే ఏమిటి?

సాల్మొనెల్లా సంక్రమణం/ఇన్ఫెక్షన్  లేదా సాల్మొనెల్లోసిస్ అనేది జీర్ణాశయ ప్రేగుల యొక్క (intestinal tract) బాక్టీరియా సంక్రమణ/ఇన్ఫెక్షన్. ఈ బాక్టీరియా మానవుల మరియు జంతువుల ప్రేగులలో ఉంటుంది మరియు అది మలం ద్వారా విసర్జించబడుతుంది. అయినప్పటికీ, సంక్రమణ/ఇన్ఫెక్షన్ కలుషితమైన ఆహారం లేదా నీటి ద్వారా వ్యాపిస్తుంది.

సాధారణంగా, సాల్మొనెలోసిస్ రోగకారక బాక్టీరియా శరీరంలోకి వెళ్లిన 2 గంటలలోనే అతిసారం, కడుపు తిమ్మిరి మరియు జ్వరం వంటి లక్షణాలను కలిగిస్తుంది. అలాగే ఏటువంటి ప్రత్యేక చికిత్సా లేకుండానే నయం కావచ్చు. ఒక సాధారణ స్టూల్ (మల) పరీక్ష ఈ వ్యాధి ఉనికిని నిర్ధారిస్తుంది. అయితే, ఈ వ్యాధి/సంక్రమణ వృద్ధులకు మరియు శిశులకు ప్రాణాంతకంగా మారవచ్చు.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

ఈ పరిస్థితి అనేక లక్షణాల ద్వారా గుర్తించబడుతుంది, అవి వీటిని కలిగి ఉంటాయి

తీవ్రమైన సందర్భాల్లో, ఇది నిరంతరమైన  అధిక జ్వరానికి దారితీయవచ్చు మరియు రోగి యొక్క పరిస్థితిని మరింత క్షిణించేలా చేయవచ్చు.

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

పచ్చిపాల ఉత్పత్తుల తినడం లేదా సాల్మోనెల్లా టైఫి (Salmonella typhi) అనే బాక్టీరియాతో కలుషితమైన మాంసాన్ని సరిగ్గా వండకుండా తినడం లేదా పౌల్ట్రీ ఉత్పత్తులను తీసుకోవడం వలన సాల్మొనెల్ల సంక్రమణ/ఇన్ఫెక్షన్ సంక్రమిస్తుంది. అలాగే, వ్యాధి సోకిన (కలుషిత) పౌల్ట్రీ నుంచి వచ్చిన ఎరువును ఉపయోగించినట్లయితే, పండ్లు మరియు కూరగాయలలో కూడా ఈ బాక్టీరియా వ్యాపించవచ్చు. కడుపు పై ​​దాని ప్రభావం కారణంగా, ఇది గ్యాస్ట్రోఎంటిరైటిస్ (gastroenteritis) లేదా కడుపు ఫ్లూగా వర్గీకరించబడింది.

జంతువులను తాకిన తరువాత చేతులను సరిగ్గా శుభ్రపరచుకోకుండా ఆహారాన్ని తీసుకున్నట్లైతే దాని ద్వారా కూడా సంక్రమణ వ్యాపించవచ్చు. అదేవిధంగా, పేలవమైన శుభ్రత పరిస్థితులు ఉన్నపుడు మానవ వాహకాల (human carriers, వ్యక్తి నుండి వ్యకికి సంక్రమించడం)  ద్వారా ఇతరులకు వ్యాపిస్తుంది.

అందువలన, ఈ కింది ఉత్పత్తులను జాగ్రత్త వహించి తీసుకోవాలి:

  • గుడ్లు
  • మాంసం
  • పౌల్ట్రీ ఉత్పత్తులు
  • పాలు తీయని పాలు
  • సరీసృపాలు (Reptiles)

దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

సంక్రమణ యొక్క కారణాన్ని తెలుసుకోవడానికి ప్రభావిత వ్యక్తి యొక్క రక్తం లేదా మలం యొక్క పరీక్ష ద్వారా రోగ నిర్ధారణ చేయబడుతుంది,అంటే రక్తంలో టైఫాయిడ్ బ్యాక్టీరియాలకు వ్యతిరేకంగా యాంటీబాడీలు ఉంటాయి లేదా మలంలో బాక్టీరియా ఉంటుంది. సాల్మొనెలోసిస్ను వర్గీకరించడానికి అదనపు పరీక్షలు కూడా నిర్వహించవచ్చు.

అనేక సందర్భాల్లో, సంక్రమణను/ఇన్ఫెక్షన్ను శరీర సహజ రోగనిరోధక వ్యవస్థ ఎదుర్కొంటుంది. అయినప్పటికీ, తీవ్రమైన సందర్భాల్లో, ఆసుపత్రిలో ఇంట్రావీయస్ రీహైడ్రేషన్ (నరాల ద్వారా ద్రవాలను ఎక్కించడం)తో పాటుగా లక్షణాల నిర్వహణకు యాంటిబయోటిక్ చికిత్స కూడా అవసరం అవుతుంది.

సంక్రమణను నివారించడానికి, ఈ కింది వాటిని పాటించాలి:

  • హై-రిస్క్ (పాడైపోయిన, బాగా నిల్వ అయిన) ఆహారాలను లేదా ముడి పౌల్ట్రీ ఉత్పత్తులను నివారించాలి
  • రిఫ్రిజిరేట్ (Refrigerate) మరియు పాశ్చరైజ్ చెయ్యాలి
  • వంట చేసే ముందు మరియు తినే ముందు చేతులను కడగాలి
  • వండిన మరియు వండని ఆహారాలను విడివిడిగా నిల్వ చేయాలి
  • వంట ప్రక్రియ పూర్తయిన తర్వాత చుటూ ఉన్న ప్రదేశాన్ని శుభ్రం చెయ్యాలి
  • ఏవైనా జంతువులని తాకిన తర్వాత చేతులు కడగాలి
  • పెంపుడు జంతువుల పరిశుభ్రత కోసం జాగ్రత్త వహించాలి.



వనరులు

  1. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Salmonella
  2. Department for Health and Wellbeing. Salmonella infection - including symptoms, treatment and prevention. Government of South Australia [Internet]
  3. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Salmonella Infections
  4. Food Safety [Internet] U.S. Department of Health & Human Services. Salmonella.
  5. World Health Organization [Internet]. Geneva (SUI): World Health Organization; Salmonella (non-typhoidal).