లాలాజల గ్రంధి సమస్యలు అంటే ఏమిటి?
లాలాజల గ్రంధులు లాలాజలాన్నీ ఉత్పత్తి చేస్తాయి మరియు దానిని నోటిలోకి విడుదల చేస్తాయి. నోటిలో ఉండే అనేక చిన్న గ్రంధులలో ఒక మూడు గ్రంథులు ప్రధానంగా లాలాజల గ్రంథులుగా ఉన్నాయి. అవి:
- పేరోటిడ్ గ్రంధి (Parotid gland) - ఇది చెవికి కొంచెం ముందుకి, చెంపలో ఉంటుంది. పైన ఉండే మొలార్ దంతాల దగ్గర ఈ గ్రంధి యొక్క వాహిక (duct) ముగుస్తుంది.
- సబ్ మాండిబ్యులార్ గ్రంధులు (Submandibular glands) - ఈ గ్రంథులు దిగువ (కింది) దవడ క్రింద ఉంటాయి, వాటి వాహికలు కింద ఉండే ముందరి పళ్ళ వెనుకకు ఉంటాయి.
- సబ్ లింగ్యువల్ గ్రంథి (Sublingual gland) - ఇవి నాలుక క్రింద ఉంటాయి మరియు లాలాజలాన్ని నోటి లోపలికి ఉత్పత్తి చేస్తాయి.
ఈ గ్రంధులు దెబ్బతిన్నప్పుడు లేదా తగినంతగా లాలాజలాన్ని ఉత్పత్తి చేయలేనప్పుడు, అది లాలాజల గ్రంథి సమస్యలకు దారి తీస్తుంది. లాలాజల ఉత్పత్తి అధికమవుతుంది లేదా తగ్గిపోతుంది లేదా పూర్తిగా లేకపోవచ్చు.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
లాలాజల గ్రంధి సమస్యలు చికాకుపెడతాయి మరియు ఈ క్రింది లక్షణాలకు దారితీస్తాయి:
- నోటిలో చెడు రుచి భావన
- నోరు ఎండిపోవడం
- నోటిని తెరవడంలో సమస్య
- ముఖం నొప్పి
- ముఖం లేదా మెడ మీద లేదా నాలుక కింద వాపు
- లాలాజలస్రావం లేకపోవడం
- అధిక లాలాజలస్రావం ఉండడం
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
లాలాజల గ్రంథి సమస్యలకు ఈ కిందవి కారణం కావచ్చు:
- సయోలోలిథియాసిస్ (Sialolithiasis) - కాల్షియం రాళ్ళు ఏర్పడతాయి, ఇవి లాలాజల వాహికను అడ్డుకుంటాయి మరియు వాపుకు కారణమవుతాయి.
- సయోలాడినైటిస్ (Sialadenitis) - గ్రంధి యొక్క బాక్టీరియల్ సంక్రమణ ఇది లాలాజల వాహికను నిరోధిస్తుంది.
- ఫ్లూ వైరస్, కోక్స్సాకీ (coxsackie) వైరస్, మమ్ప్స్ (గవదబిళ్లలు), ఎకోవైరస్ మరియు సైటోమెగలోవైరస్ వంటి వైరస్లు కూడా లాలాజల గ్రంథులను ప్రభావితం చేస్తాయి.
- జొగ్రెన్స్ సిండ్రోమ్ (Sjogren’s syndrome).
- మూడు గ్రంధులలో ఏదైనా ఒకదానిలో క్యాన్సరస్ లేదా క్యాన్సరస్ కాని కణితులు ఏర్పడడం.
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
వైద్యులు రోగి నోటిని పూర్తిగా పరిశీలిస్తారు మరియు లాలాజల గ్రంథి వాహికల యొక్క ఏవైనా అడ్డంకులను గుర్తించటానికి ఎక్స్-రేను నిర్వహిస్తారు. వివరణాత్మక పరిశీలన కోసం ఎంఆర్ఐ(MRI) మరియు సిటి (CT) స్కాన్లు అవసరమవుతాయి. వాహికలకు అడ్డంకులు ఉన్నట్లయితే అప్పుడు నోటి శస్త్రవైద్యురు (oral surgeon) ప్రభావిత ప్రదేశానికి తిమ్మిరి (మత్తు) ఇచ్చి, శస్త్రచికిత్స ద్వారా లాలాజల వాహిక నుండి అడ్డంకులను తొలగిస్తారు. ఒకవేళ రోగి ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్నట్లయితే రోగనిర్ధారణ కోసం వైద్యులు ప్రభావిత గ్రంథి యొక్క జీవాణుపరీక్ష (బయాప్సీ) ను నిర్వహించవచ్చు.
ఏదైనా సిస్టమిక్ వ్యాధి కారణంగా సమస్య ఉన్నట్లయితే, ముందు దానికి చికిత్స చెయ్యడం అవసరం. క్యాన్సర్ కాని కణితులు శస్త్రచికిత్స ద్వారా తొలగించబడతాయి. క్యాన్సర్ కణితులకు వాటి యొక్క శస్త్రచికిత్స తొలగింపు తర్వాత రేడియేషన్ థెరపీ కూడా అవసరం అవుతుంది .