రోజేసియా అంటే ఏమిటి?
‘రోజేసియా’ లేదా ‘మోటిమల రోజేసియా’ అనేది ఒక రకమైన చర్మ-సంబంధ రుగ్మత, ఇది సాధారణంగా ముఖ చర్మాన్ని దెబ్బ తీస్తుంది. అదేవిధంగా, ఈ రోజేసియా రుగ్మతలో నుదురు, బుగ్గలు మరియు చుబుకం (గడ్డం) పై మోటిమలను పోలిన పసుపురంగు మొటిమలు వస్తాయి. కొన్ని సందర్భాల్లో, ఈ పసుపురంగు మొటిమల్ని మామూలు మోటిమలు అని పొరపాటు పడే అవకాశం ఉంది. అయితే ఒక విషయమేమంటే, మొటిమలైతే మచ్చల్ని మిగిల్చి పోతాయి కానీ రోజేసియా మొటిమలు అలా మచ్చల్ని మిగిల్చవు, ఈ రుగ్మత విషయంలో ఇదొక చెప్పదగ్గ ముఖ్య విషయం.
ఈ రుగ్మత సాధారణంగా 30 నుండి 50 సంవత్సరాల వయస్సు అంతరంలో గల స్త్రీల సముదాయంలో సంభవిస్తుంది మరియు ఈ రుగ్మత చర్మానికి ఎరుపురంగునిస్తుంది. ఈ రుగ్మత ముదిరేకొద్దీ (ఈ రుగ్మత కారణంగా సంభవించిన) సూక్ష్మమైన ముఖనరాలు పెద్దవవటంవల్ల శాశ్వత ఎరుపురంగు తీవ్రతరమైపోతుంది. పురుషుల్లో అయితే, ఈ రుగ్మతవల్ల ముక్కు కూడా ఎర్రబడిపోతుంది..
దీని ప్రధాన సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
ఈ రుగ్మతను ముఖం మీద ఏర్పడే ఎరుపుదనం లేదా ముఖంలో తరచుగా బుగ్గలు ఎరుపెక్కడం వంటి లక్షణాలతో గుర్తిస్తారు. కొన్ని సందర్భాల్లో, ఈ రుగ్మతవల్ల కళ్ళు దెబ్బతినడం జరుగుతుంది, అలాంటపుడు కళ్ళు రక్తవర్ణంతో ఎరుపెక్కుతాయి, కళ్ళు మెరికాలుగా తయారవుతాయి. ఇతర లక్షణాలు:
- నుదురు, బుగ్గలు మరియు గడ్డం (chin) ఎరుపుదేలడం
- బుగ్గలు ఎరుపెక్కడం (ఫ్లషింగ్).
- గడ్డలు మరియు చీము నిండిన మొటిమలు.
- సొగసైన చర్మం (ఫెయిర్-స్కిన్డ్) కల్గిన ఆడవాళ్లలో రక్త నాళాలు స్పష్టంగా అగుపించడం.
- గరుకుగా మరియు అసమాన చర్మం రీతి మరియు రంగు.
- ముక్కు చర్మం మందమెక్కడం (Rhinophyma).
- ముఖం మీద మంటబెట్టి నట్లుండే మంటతో కూడిన నొప్పి.
- ముఖంపై మచ్చలు.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
ఈ రుగ్మత సాధారణంగా ముఖంలో దాగుండే సూక్ష్మపురుగుల కారణంగా రావచ్చు. ఈ రుగ్మతకు కారణమయ్యే ఇతర వ్యాధికారకాలు కిందివిధంగా ఉంటాయి:
- రక్తనాళాల అసాధారణతలు.
- టీ మరియు సూప్ లాంటి వేడి లేదా కెఫిన్ కల్గిన పానీయాలు.
- అల్ట్రా వయొలెట్ (UV) కిరణాలకు బహిర్గతం కావడం.
- ఒత్తిడి.
- రెడ్ వైన్ లేదా మద్యపానీయాలు ( ఆల్కహాలిక్ పానీయాలు).
- ఉష్ణోగ్రత తీవ్రతలు.
- తీవ్రమైన వ్యాయామం.
- మందులు.
దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
శారీరక పరీక్ష ద్వారా మరియు వివరణాత్మక వైద్య చరిత్రను డాక్టర్ గ్రహించడం వల్ల రోజేసియా వ్యాధి నిర్ధారణ చేయబడుతుంది. రక్తం పరీక్షలు ల్యూపస్ ఎరిథెమాటోసస్ లాంటి ఇదేరకం రుగ్మతల్ని తోసిపుచ్చడానికి ఉపయోగపడతాయి. అందువల్ల, డాక్టర్ ను సందర్శించినట్లైతే రుగ్మత యొక్క మూల కారణాన్ని గుర్తించడానికి కూడా సహాయపడవచ్చు.
అయితే, సాధారణ వ్యక్తులకు మొటిమలు-రోజేసియా రుగ్మతల్ని గుర్తించడంలో గందరగోళం ఎదుర్కొంటారు. మొటిమలు, సోబోర్హెయిక్ డెర్మటైటిస్ మరియు పెరియోరల్ డెర్మాటిటిస్తో ఉన్న అనురూప వ్యాధి లక్షణాలు ఒక సాధారణ వ్యక్తిని గందరగోళానికి గురి చేయడమనేది సర్వసాధారణం.
ఈ రుగ్మత చికిత్సలో కింది చికిత్సా పద్ధతులుంటాయి:
- అంతర్లీన వ్యాధి కారకాల్ని నివారించుకోవడం
- నిత్యం ముఖ ప్రక్షాళన చేయడం.
- సన్ స్క్రీన్ (ఔషదం) క్రీముల పైపూత
- కాంతిచికిత్స (Phototherapy): కాంతికిరణాలతో రోగము నయం చేసే చికిత్స
- డోక్సీసైక్లిన్ లేదా మినోసైక్లైన్ వంటి యాంటీబయాటిక్స్ మందులు.
- సారాంశాలు మరియు లోషన్లతో పైపూతగా చేసే చికిత్స.
- డయాథెర్మి: శరీర కణజాలములను విద్యుఛ్ఛక్తి యంత్రముతో వేడి చేయు వైద్య చికిత్స.
- లేజర్ చికిత్స.
- ఐసోట్రిటినోయిన్ చికిత్స చేయడం .
- శస్త్ర చికిత్స (సర్జరీ).