విశ్రాంతిలేమి అంటే ఏమిటి?
విశ్రాంతి లేకపోవడం లేక విశ్రాంతిలేమి అనేది వ్యక్తి ఒకే స్థలంలో ఉండలేక పోవడం లేదా కదలకుండా నిరంతరాయంగా ఒక పనిని చేయలేక పోవడం. విశ్రాంతిలేమి అనేది ఒక విస్తృత పదం. విశ్రాంతిలేమి రుగ్మతతో ఉన్న వ్యక్తి విస్తృత స్థాయి సంకేతాలు మరియు వ్యాధి లక్షణాలను కల్గి ఉంటారు. ఈ రుగ్మత విభిన్న వ్యక్తులలో భిన్నంగా పొడజూపడం జరుగుతుంది. విశ్రాంతిలేమి రుగ్మతలో వ్యక్తి శారీరక మరియు మానసిక చిక్కులను కలిగి ఉంటారు.
దీని ప్రధాన సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
- సాధారణంగా, విశ్రాంతి లేకపోవటం అనేది అతిక్రియాశీలత (హైపర్బాక్టివిటీ)లా కనిపిస్తుంది. అంటే, ఒక వ్యక్తి ఒకే స్థలంలో లేదా స్థానం లో కూర్చుని ఉండలేకపోతాడు మరియు నిరంతరం స్థలాలను తరలించడం లేదా మార్చడం అవసరం అవుతూ ఉంటుంది.
- విశ్రాంతిలేమి రుగ్మతతో ఉన్న వ్యక్తిని చాలా సమయంపాటు పాటు సంభాషణలోనో లేదా ఏదైనా పనిలో నిమగ్నం చేయడం కష్టం.
- విశ్రాంతిలేమి రుగ్మతతో ఉన్నవారు కూర్చున్నప్పుడు కాళ్లలో బాధాకరమైన తిమ్మిరిని పొందుతారు.
- అవయవాలలో జలదరింపు, తిమ్మిరి మరియు ప్రకంపాలు అనేవి మరికొన్ని ఇతర చిహ్నాలు.
- విశ్రాంతిలేమి రుగ్మత కల్గిన వ్యక్తులకు తరచుగా నిద్ర పట్టడం కష్టమవుతూ ఉంటుంది. దీనితో పాటుగా ఆందోళనలు మరియు స్థితిభ్రాంతిని అనుభవిస్తూ ఉంటారు.
- తీవ్ర సందర్భాల్లో, హృదయ కంపనాల్ని మరియు చెమట పెట్టడాన్ని అనుభవించవచ్చు.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
- విశ్రాంతిలేమి యొక్క అతి సాధారణ కారణం ఔషధ సంబంధమైనది. ఇది శ్రద్ధ లోటు హైపర్ ఏక్టివిటీ డిజార్డర్ (attention deficit hyperactivity disorder-ADHD) వంటి వ్యాధులకిచ్చే అనేక మందుల సేవనం యొక్క దుష్ప్రభావం, ఆస్త్మా వంటి అనేక పరిస్థితులకు మరియు అనేక మత్తుమందులు మరియు యాంటీ-ఎమెటిక్స్ వంటి అనేక మందుల యొక్క దుష్ప్రభావం.
- కాస్ఫిన్ వ్యసనం లేదా చాలా టీ లేదా కాఫీ లాంటి కెఫిన్ కలిగిఉన్న ఉత్పత్తుల మితిమీరిన వినియోగం విశ్రాంతిలేమికి మరొక సాధారణ కారణం.
- స్కిజోఫ్రెనియా, ADHD, చిత్తవైకల్యం మరియు ఆందోళన వంటి నరాల సంబంధిత రుగ్మతలతో పాటుగా విశ్రాంతిలేమి సంభవిస్తుంది.
- హైపర్ థైరాయిడిజంలో హార్మోన్ల అసమతుల్యత కూడా వ్యక్తి లో విశ్రాంతిలేమి పెరగడానికి కారణం కావచ్చు.
దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
- విశ్రాంతిలేమి అనేది ప్రతి వ్యక్తిలోనూ కాస్త హెచ్చు తక్కువగా ఉంటుంది. ఇది లక్షణాలు మరియు గత వైద్య చరిత్ర ఆధారంగా నిపుణుడు నిర్ధారణ చేస్తారు.
- రోగ నిర్ధారణ చేయడానికి ముందు, మీ జీవనశైలి గురించి, ఏవైనా మందులు తీసుకుంటూ ఉంటే వాటి గురించీ డాక్టర్ మీ భౌతిక పరీక్ష చేసింతర్వాత మీ వైద్యుడికి తెలియజేయడం ముఖ్యం.
- విశ్రాంతిలేమికి ఔషధ నిర్వహణ కంటే, జీవనశైలి మరియు అలవాట్లలో మార్పులు ఉంటాయి.
- ఓ నిలకడ కల్గిన నిద్ర సమయాన్ని పాటించమని మరియు రాత్రి తగినంతగా విశ్రాంతి తీసుకోమని డాక్టర్ మీకు సలహా ఇస్తారు.
- విశ్రాంతిలేమి రుగ్మతను మెరుగుపర్చడానికి కెఫైన్ తీసుకోవడం తగ్గించటం మంచిది.
- ఒక ఔషధం కారణంగా ఈ రుగ్మత ఏర్పడితే, మీ వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. ఇలా వైద్యుడ్ని సంప్రదించడమనేది ఔషధం యొక్క మోతాదును మానివేయడానికి లేదా సవరించడానికి ముందుగానే జరగాలి, ఎందుకంటే ఇది శరీరంలో అసాధారణమైన దుష్ప్రభావాలను కలిగి ఉంటుంది.
- దృష్టి లోటు హైపర్ ఏక్టివిటీ డిజార్డర్ (ADHD), లేదా స్కిజోఫ్రెనియా వంటి వైద్య పరిస్థితుల విషయంలో తగిన మత్తుమందులు లేదా మత్తుపదార్థాలు సూచించబడవచ్చు.