రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అంటే ఏమిటి?
రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అనేది నాడీ వ్యవస్థతో ముడిపడి ఉన్న ఒక సమస్య అది నిరంతరం కాళ్ళు కదిలించాలనే బలమైన కోరికతను కలిగిస్తుంది. ఇది తొడలు, పిక్కలు, కాళ్ళు మరియు అరుదుగా, ముఖం, చేతులు మరియు ఛాతీ మీద అసహ్యకరముగా ఎదో ప్రాకుతున్న అనుభూతిని కలిగిస్తుంది, మరియు సాధారణంగా ఇది సాయంత్రం లేదా రాత్రి సమయాలలో మరింత తీవ్రమవుతుంది,.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
లక్షణాలు అసహ్యకరమైనవి, తేలికపాటి నుంచి మధ్యస్థంగా ఉంటాయి మరియు అరుదుగా లేదా రోజూ ఉండవచ్చు. లక్షణాలు వీటిని కలిగి ఉంటాయి:
- కాళ్ళలో తిమ్మిరితో కూడిన నొప్పులు, దురద, ఎదో ప్రాకుతున్న భావన, జలదరించటం, మంటలు లేదా సలుపు ఉండడం (ముఖ్యంగా కాళ్ళ పిక్కలలో).
- కాళ్ల రక్తనాళాలలో బుడగలుగల/నురుగు నీరు నిండి ఉన్న భావన/అనుభూతి.
- ఎక్కువ సమయం పాటు కూర్చొని ఉండడం కష్టం అవుతుంది.
- పీరియాడిక్ లింబ్ మూవ్మెంట్స్ ఇన్ స్లీప్ (PLMS,నిద్ర మధ్యలో కాళ్ళు కదిలించడం) నిద్రిస్తున్న సమయంలో ప్రతి 20 నుంచి 40 సెకన్లకి చిన్నగా, పదేపదే, నియంత్రిచలేని కుదుపులు లేదా కదలికలు సంభవిస్తాయి.
- మేల్కొని ఉన్న మరియు విశ్రాంతి తీసుకుంటున్నా కూడా అస్థిరమైన కాళ్ల కదలికలు.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
ఈ పరిస్థితి యొక్క ప్రధాన కారణం ఇంకా గుర్తించబడలేదు మరియు వంశపారంపర్యంగా మరియు కొన్ని నిర్దిష్ట జన్యువులతో సంబంధం కలిగి ఉంటుందని భావించబడుతుంది. కొన్ని ముడి పడి ఉండే కారణాలు ఈ కింది విధంగా ఉండవచ్చు:
- కండరాల కదలికలకు మరియు నియంత్రణకు అవసరం అయ్యే డోపమైన్ అనే న్యూరోట్రాన్స్మిటర్ (neurotransmitter) స్థాయి తగ్గడం.
- ఐరన్ లోపం వలన సంభవించిన అనీమియా, దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి, మధుమేహం లేదా గర్భం వంటి అంతర్లీన ఆరోగ్య పరిస్థితుల/సమస్యలు.
- కొన్ని మందులు, ధూమపానం, కెఫిన్, మద్యం, ఊబకాయం, ఒత్తిడి మరియు వ్యాయామం లేకపోవడం వంటి ప్రేరేపకాలు (ట్రిగ్గర్లు).
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
లక్షణాల యొక్క వివరణాత్మక చరిత్రను తెలుకుకుని, వాటి తీవ్రత, అవి కనిపించే సమయం, ఎలా మళ్ళి ఉపశమనం పొందుతున్నాయి, అనూహ్యకరమైన మరియు ఒత్తిడితో కూడిన లక్షణాలు కారణంగా నిద్రలో ఆటంకాలు వంటి పూర్తి వివరాల తెలుకున్న తర్వాత పూర్తి అంచనా వేయడం జరుగుతుంది. తర్వాత ఒక పూర్తిస్థాయి/క్షుణ్ణమైన భౌతిక పరీక్షను నిర్వహిస్తారు:
- రక్తహీనత, మూత్రపిండ సమస్యలు మరియు మధుమేహ సంభావ్యతను నిర్ములించడానికి రక్త పరీక్ష.
- వ్యక్తి శరీర భాగాలను కదిలించకుండా , ఒక ఇమ్మొబిలైసెషన్ పరీక్షను (immobilisation test) కలిగి ఉండే ఒక నిద్ర పరీక్ష (Sleep test).
- నిద్రిస్తున్న సమయంలో శ్వాస రేటు, మెదడు తరంగాల (waves) ను మరియు హృదయ స్పందనను పర్యవేక్షించడానికి పోలీసోమ్నోగ్రఫీ (Polysomnography).
రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ నిర్వహణ వీటిని కలిగి ఉంటుంది:
- తేలికపాటి కేసులు జీవనశైలి మార్పులతో నిర్వహించబడతాయి/తగ్గించబడతాయి:
- పైన పేర్కొన్న ట్రిగ్గర్స్ను నివారించడం.
- మంచి నిద్ర అలవాట్లు.
- క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం.
- ఒక ఎపిసోడ్ సంభవిస్తున్నపుడు, చికిత్స ఈ వాటిని కలిగి ఉంటుంది:
- కాళ్లకు మసాజ్/మర్దన చెయ్యడం, వేడినీళ్ల లేదా చన్నీళ్ళ కాపడం పెట్టడం లేదా వేడి నీటితో స్నానం చెయ్యడం.
- దృష్టిని మార్చే పనులు/చర్యలు చెయ్యడం, పుస్తకాలు చదవడం వంటివి.
- శరీరాన్ని సాగదీసే లేదా విశ్రాంతి కలిగించే వ్యాయామాలు చెయ్యడం.
- మందులతో కూడిన చికిత్సను ఉపయోగించడం, అవి:
- రోపినిరోల్ (ropinirole), ప్రామిపిక్సోల్ (pramipexole) లేదా రోటిగాటిన్ స్కిన్ ప్యాచ్ (rotigotine skin patch) వంటి డోపమైన్ ఆగోనిస్ట్లు(agonists, డోపమైన్ చర్యలను పెంచేవి).
- నొప్పి ఉపశమనానికి కోడైన్ (codeine), గబాపెన్టిన్ (gabapentin)మరియు ప్రీగాబాలిన్ (pregabalin) వంటి మందులు ఉన్నాయి.
- నిద్ర-సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి టమేజీపం (temazepam) మరియు లాప్రాజోలం(loprazolam) వంటి మందులు ఉపయోగించబడతాయి.
-
ఈ పరిస్థితి ఐరన్ లోపం కారణంగా ఐతే, అది ఐరన్ సప్ప్లీమెంట్ల ద్వారా పరిష్కరించబడుతుంది, మరియు గర్భాధారణ వలన ఐతే, దాని కాదే తగ్గిపోతుంది.