చీము పుండ్లు లేదా ప్యోడెర్మా గాంగ్రెనోసం అంటే ఏమిటి?
చీముతో కూడిన పుండు లేక పయోడెర్మా గాంగ్రెనోసం (PG) అనేది ఓ అనారోగ్య చర్మరుగ్మతను సూచిస్తుంది, ఇది నొప్పిని, బాధాకరమైన పుండు, వ్రణోత్పత్తుల లక్షణాలను కలిగి ఉంటుంది.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
చీము పుండ్లు (పయోడెర్మా గాంగ్రెనోసం) సాధారణంగా కాళ్ళమీదనే ఏర్పడుతాయి, అయితే ఈ పుండ్లు శరీరంపై మరెక్కడైనా సంభవించే అవకాశాలు ఉన్నాయి. ఈ చీముపుండ్ల రుగ్మత యొక్క సాధారణ సంకేతాలు మరియు లక్షణాలు కొన్ని:
- చిన్నగా, ఎర్రటి లేదా ఊదా (పర్పుల్)-రంగుతో కూడిన గడ్డలు లేదా బొబ్బలు ఏర్పడి వేగంగా వ్యాపిస్తాయి.
- బాగా వాపుతో కూడుకున్నకురుపులు, వ్రణాలు లేక పుండ్లు బాగా నిర్వచించిన, నీలం లేదా వైలెట్ రంగు అంచులతో వివిధ పరిమాణాలు మరియు లోతుల్లో ఏర్పడవచ్చు.
- కొన్నిసార్లు వ్రణాలు, పుండ్లు (పూతలు) విస్తృతంగా పెరుగుతాయి మరియు అత్యంత బాధాకరంగా ఉంటాయివి. అవి చికిత్స లేకుండానే నయం కాగలవు లేదా చెక్కుచెదరకుండా అట్లాగే ఉండపోనూవచ్చు.
- సంక్రమణ సందర్భాలలో జ్వరం రావచ్చు..
- కీళ్ళ నొప్పులు లేదా స్థానికీకరించిన సున్నితత్వం చూడవచ్చు.
- బలహీనత లేదా అనారోగ్యం.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
ఈ పరిస్థితి యొక్క ఖచ్చితమైన కారణం ఇంకా స్పష్టంగా తెలియలేదు (ఇడియోపతిక్ అని పిలుస్తారు). అయితే, కిందివాటికి సంబంధించినదై ఉంటుంది:
- ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ (శరీరం ఆరోగ్యకరమైన కణజాలం నుంచి ప్రతిరోధకాలను ఉత్పత్తి చేస్తుంది).
- ఇంఫలమేటరీ బౌల్ వ్యాధి, కొన్ని రక్త రుగ్మతలు మరియు ఆర్థరైటిస్ యొక్క కొన్ని రూపాలు.
- ఆకస్మిక గాయం లేదా శస్త్రచికిత్సానికి (పాదపీయం) సెకండరీ.
దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
వైద్యుడు వ్యక్తి యొక్క వివరణాత్మక చరిత్రను అడిగి తెలుసుకుంటాడు మరియు వైద్యపరంగా వ్యక్తిని అంచనా వేస్తారు, ఇతర రుగ్మతలను తోసిపుచ్చడానికి ప్రయత్నిస్తాడు. ఇందుగ్గాను జరిపే కొన్ని విశ్లేషణ పరీక్షలు ఇలా ఉన్నాయి:
- ప్రభావిత కణజాలం యొక్క జీవాణుపరీక్ష.
- గాయం సంక్రమణ అవకాశాలపై చర్చించడానికి స్వాబ్ పరీక్ష.
- సంబంధిత పరిస్థితులను కనుగొనడానికి కొన్ని రక్త పరీక్షలు.
- ప్యాథర్జీ పరీక్ష (గాయాలు కనిపింపజేసే ఒక చర్మం గుచ్చుడు పరీక్ష).
చీము పుండ్లు (పయోడెర్మా గాంగ్రెనోసం) చికిత్స కష్టం, మరియు దీనికి చేసే వైద్యప్రక్రియకు సమయం పడుతుంది మరియు పూర్తి పునరుద్ధరణ కోసం బహుళ చికిత్స పద్ధతులు అవసరం కావచ్చు. చికిత్సా ఎంపికలుగా చర్మానికి అంటుకట్టుట మరియు శస్త్రచికిత్సలు నివారించబడతాయి, ఎందుకంటే అవి పుండు యొక్క విస్తరణకు కారణం కావచ్చు. వ్యాధి తీవ్రతను బట్టి చీము పుండ్లను స్థానిక లేదా పైపూత మందుల చికిత్స లేదా దైహిక చికిత్స ద్వారా చికిత్స చేయవచ్చు.
- పైపూతచికిత్సలో కిందిచర్యలు కలిగి ఉంటాయి:
- నొప్పి తగ్గించడానికి చిన్నపుండ్లపై మరియు వాటి చుట్టూ క్రింది మందుల పూత లేక పైపూత వాడకం ఉంటుంది:
- బలమైన స్టెరాయిడ్ ప్రేపరేషన్లు .
- కాల్సినిరిన్ ఇన్హిబిటర్లు (టాక్రోలిమస్).
- నొప్పి తగ్గించడానికి చిన్నపుండ్లపై మరియు వాటి చుట్టూ క్రింది మందుల పూత లేక పైపూత వాడకం ఉంటుంది:
- దైహిక చికిత్సలు:
- సంక్రమణల విషయాల్లో మినియోసైక్లైన్ లేదా డాప్సోన్ వంటి యాంటీ బియోటిక్స్ మందులు.
- మెథిల్ప్రెడ్నిసోలోన్ (methylprednisolone) మరియు ప్రిడ్నిసోన్ వంటి స్టెరాయిడ్లు, నోటి ద్వారా లేదా వాపు తగ్గించడానికి ఇంట్రామస్కులర్ లేదా ఇంట్రాజెస్సనల్ ఇంజెక్షన్లు ఇవ్వబడతాయి.
- సిక్లోస్పోరిన్, అజాథియోప్రిన్, ఇన్ఫ్లిక్సిమాబ్, ఆడాలిమియాబ్ మరియు మైకోఫెనోలట్ మోఫేటిల్ వంటి ఇమ్యునోసప్రెస్సివ్ మందులు శరీర రోగనిరోధక ప్రతిస్పందనను తగ్గించటానికి సహాయపడతాయి.
- తీవ్రమైన కేసులను మందులతో సహా చికిత్స చేస్తారు:
- సైక్లోఫాస్ఫామైడ్.
- జీవ చికిత్సలు (Biological treatments).
- ఇంట్రావెనస్ స్టెరాయిడ్స్.
- ఇమ్యునోగ్లోబ్యులిన్లు.
- ఈ పరిస్థితి యొక్క చరిత్ర ఉన్నవారికి శస్త్రచికిత్సకు ముందు కార్టికోస్టెరాయిడ్స్తో నిరారణా చికిత్స, ఎందుకంటే శస్త్ర చికిత్సవాళ్ళ ఈ రుగ్మత పునరావృతమవుతుంది.
- పూతల మీద తడి డ్రెస్సింగ్.