ప్రోస్టేట్ క్యాన్సర్ - Prostate Cancer in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

December 13, 2018

March 06, 2020

ప్రోస్టేట్ క్యాన్సర్
ప్రోస్టేట్ క్యాన్సర్

ప్రోస్టేట్ క్యాన్సర్ అంటే ఏమిటి?

పురుషులలో వచ్చే క్యాన్సర్ల యొక్క అత్యంత సాధారణ క్యాన్సర్ రకాల్లో ప్రోస్టేట్ క్యాన్సర్ ఒకటి. “ప్రోస్టేట్” అని పిలువబడే ఓ చిన్న పునరుత్పత్తి గ్రంథిలోని కణాల అనియంత్రిత పెరుగుదలే ప్రోస్టేట్ క్యాన్సర్.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

వ్యాధి ఆఖరి దశలు చేరుకునే వరకు ప్రోస్టేట్ క్యాన్సర్ ఎలాంటి సంకేతాలు లేదా లక్షణాలను చూపించదు. కొన్ని సందర్భాల్లో, కొన్ని సంకేతాలను అంతర్లీన ప్రోస్టేట్ క్యాన్సర్ సూచనలుగా భావిస్తారు. ఈ సంకేతాలు మరియు లక్షణాలు:

  • మూత్రవిసర్జనలో నొప్పి లేదా మంటతో కూడిన నొప్పి
  • అంగస్తంభన పొందడానికి కష్టం.
  • మూత్రంలో లేదా వీర్యంలో రక్తం పడటం.
  • పురీషనాళం లేదా పొత్తికడుపు, తొడలు, లేదా తుంటి ప్రాంతాలలో నొప్పి.
  • చుక్కలు-చుక్కలుగా లేదా బొట్లు-బొట్లుగా కారే మూత్రం (dribbling of urine).
  • మూత్రం యొక్క ప్రవాహాన్ని ప్రారంభించడంలో సమస్య.

ప్రధాన కారణాలు ఏమిటి?

ప్రోస్టేట్ క్యాన్సర్ కు దారితీసే ప్రధాన కారణం స్పష్టంగా తెలియరాలేదు కానీ ప్రోస్టేట్ క్యాన్సర్ కు కారణమైన యంత్రాంగం సూచించే అనేక సాధారణ అంశాలు ఉన్నాయి. DNA లోని పరివర్తనల ఫలితంగా ప్రోస్టేట్లోని కణాల యొక్క అనియంత్రిత పెరుగుదలకు దారితీస్తుంది.

ఒక ముఖ్యమైన కారకం ఆన్కోజెన్లు (oncogenes) మరియు కణితి నిరోధక జన్యువుల మధ్య అసమతుల్యత. శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలకు ఆన్కోజెన్లు బాధ్యత వహిస్తాయి మరియు కణితి అణిచివేత జన్యువులు ఏదేని కణితి పెరుగుదల వేగాన్ని తగ్గించడమో లేక కణితి పెరుగుదలను నివారించడానికి సరైన సమయంలో పనిచేస్తాయి.

దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

ప్రోస్టేట్ క్యాన్సర్ ఉనికిలో ఉన్న అత్యంత నిశ్చయాత్మకమైన మరియు ఖచ్చితమైన పరీక్ష ఒక మూత్రాశయం ద్వారా నిర్వహించిన బయాప్సీ.

ఇతర పరీక్షలలో ఒక డిజిటల్ మల పరీక్ష (DRE) పరీక్ష మరియు ప్రోస్టేట్-నిర్దిష్ట యాంటిజెన్ (PSA) పరీక్ష. అయినప్పటికీ, ప్రొస్టేట్ లో క్యాన్సర్ను వారు నిర్థారించరు, ఎందుకంటే వృద్ధి కూడా ఇతర అంటువ్యాధులు లేదా ప్రోస్టేట్ యొక్క క్యాన్సర్ కాని వ్యాకోచం యొక్క ఫలితం కావచ్చు.

ప్రోస్టేట్ క్యాన్సర్ చికిత్స ఎక్కువగా విజయవంతమవుతుంది. ఈ వ్యాధికి  ఇచ్చే కొన్ని మందులు మరియు చికిత్సలు:

  • రేడియోధార్మిక చికిత్స - క్యాన్సర్ కణాలకు గామా కిరణాలు వంటి ప్రత్యక్ష రేడియేషన్లను నిర్దేశిస్తారు.  
  • శస్త్రచికిత్స - కణితి వ్యాప్తి చెందని మరియు చిన్నదిగా ఉన్న పరిస్థితులలో అంటే ప్రారంభ దశలో కణితిని తీసివేయడానికి ఒక ప్రయత్నంగా  శస్త్రచికిత్సను చేయబడుతుంది.
  • కీమోథెరపీ - ప్రోస్టేట్ క్యాన్సర్ వ్యాధి ముదిరిన సందర్భాల్లో చికిత్స చేసేందుకు కీమోథెరపీ ఉపయోగపడుతుంది.
  • మందులు - క్యాన్సర్ కణాల పెరుగుదలను నివారించడానికి కొన్ని మందులు కూడా నిర్వహించబడతాయి.



వనరులు

  1. Prostate Cancer Foundation, Santa Monica [Internet]; About Prostate Cancer
  2. National Health Service [Internet]. UK; Prostate cancer.
  3. Prostate Cancer Foundation of Australia [Internet]; What you need to know about prostate cancer
  4. National Cancer Institute [Internet]. Bethesda (MD): U.S. Department of Health and Human Services; Prostate Cancer—Patient Version
  5. National Cancer Institute [Internet]. Bethesda (MD): U.S. Department of Health and Human Services; Treatment Choices for Men With Early-Stage Prostate Cancer
  6. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Prostate Cancer
  7. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Prostate Cancer

ప్రోస్టేట్ క్యాన్సర్ వైద్యులు

Dr. Anil Gupta Dr. Anil Gupta Oncology
6 Years of Experience
Dr. Akash Dhuru Dr. Akash Dhuru Oncology
10 Years of Experience
Dr. Anil Heroor Dr. Anil Heroor Oncology
22 Years of Experience
Dr. Kumar Gubbala Dr. Kumar Gubbala Oncology
7 Years of Experience
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు

ప్రోస్టేట్ క్యాన్సర్ కొరకు మందులు

Medicines listed below are available for ప్రోస్టేట్ క్యాన్సర్. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.