నెలలు నిండని కాన్పు - Premature Labor in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

December 14, 2018

March 06, 2020

నెలలు నిండని కాన్పు
నెలలు నిండని కాన్పు

నెలలు నిండని కాన్పు అంటే ఏమిటి?

నెలలు నిండని కాన్పు అంటే శిశువు జననానికి ఉపకరించే గర్భాశయంలోని సాధారణ సంకోచాలు మరియు గర్భకోశంలో వచ్చే మార్పులు నిర్దిష్టమైన 37 వారాల గర్భధారణ వ్యవధి పూర్తి కాక ముందే సంభవించడం.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

నెలలు నిండని కాన్పు యొక్క ప్రధానమైన మరియు అత్యంత ప్రత్యేకమైన సంకేతం ఏమిటంటే ప్రసవం (డెలివరీ) యొక్క ఊహించిన తేదీకి ముందే తల్లి గర్భంలో నీటిని కలిగిఉండే తిత్తి పగిలిపోవడం. ఇలా తల్లి గర్భంలోలి నీటితిత్తి పగిలినపుడు ద్రవ ప్రవాహ ఉదృతి కల్గుతుంది, దీనికి వెంటనే వైద్య సంరక్షణ అవసరం.

ప్రసవం అయ్యే ముందు ఇతర సంకేతాలు మరియు లక్షణాలు కూడా సంభవిస్తాయి, ఈ సంకేతాలు ఏవంటే:

  • యోని ఉత్సర్గ (స్రవాలా) పరిమాణం పెరుగుతుంది.
  • యోని ఉత్సర్గలో మార్పొస్తుంది, రక్తం లేదా శ్లేష్మంతో కూడిన ద్రవ ఉత్సర్గ.
  • పొత్తికడుపు మరియు కటిలోపలి ప్రాంతంలో ఒత్తిడి అనుభూతి.
  • క్రమంగా సంకోచాలు కలుగుతుంటాయి, ఇవి బాధాకరంగా ఉండవచ్చు, ఉండకపోనూవచ్చు.

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

నెలలు నిండని ప్రసవం అనేక కారణాలపై ఆధారపడి ఉంటుంది. ప్రసవపూర్వ మరియు ప్రసవానంతర సంరక్షణ కారణాలు, సూచించిన ఔషధాల వినియోగం వంటి అనేక కారణాలపై నెలలు నిండని కాన్పు ఆధారపడి ఉంటుంది. నెలలు నిండని కాన్పుకు కారణమైన కొన్ని కారణాలు:

  • మునుపటి నెలలు నిండని ప్రసవం (లేదా అకాల ప్రసవం).
  • కవలలు, ముగ్గురు కవలలు లేదా అంతకంటే ఎక్కువమంది శిశువుల్నికనే గర్భధారణ.
  • గత ప్రసవం యొక్క 6-7 నెలల లోపే మళ్ళీ వెంటవెంటనే కలిగే గర్భం.
  • పొగతాగడం, మద్యపానం, లేదా గైనకాలజిస్ట్ సూచించని మందుల వాడకం.
  • ఊబకాయం.
  • అధిక రక్తపోటు లేదా అధిక చక్కెర స్థాయిలను కలిగి ఉన్న పరిస్థితులు.

దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

నెలలు నిండని ప్రసవానికి సంబంధించిన సంకేతాలు మరియు లక్షణాలను చూసినప్పుడు వెంటనే డాక్టర్ను సంప్రదించడం ముఖ్యమని సూచించడమైంది. గర్భాశయంలోని మార్పు ఉంటే డాక్టర్ కటి పరీక్షను నిర్వహించవచ్చు; గర్భవతి తల్లిని పరిశీలనలో ఉంచుతారు మరియు స్థిర సమయ వ్యవధిలో అనేక సార్లు తనిఖీ చేయబడుతుంది మరియు పురోగతిని గమనించడం జరుగుతుంది మరియు ప్రసవాన్ని ప్రేరేపించే అవసరాన్ని గుర్తించడం జరుగుతుంది. అదనంగా, గర్భస్థ శిశువు యొక్క పొడవును కొలిచేందుకు మరియు ప్రసవం కోసం ఆసుపత్రికి చేర్పించాల్సిన సరైన సమయాన్ని నిర్ధారించడం కోసం ప్రసూతి వైద్యులు  ట్రాన్స్వాజీనల్ ఆల్ట్రాసౌండ్ను సూచించవచ్చు మరియు నిర్వహిస్తారు.

ఫలితాలు నెలలు నిండని కాన్పును (అకాల ప్రసవం) సూచించిన వెంటనే, తల్లిని ఆసుపత్రిలో చేర్చి ఇంట్రావీనస్ (IV) డ్రిప్ లను (నరాలద్వారా) ఎక్కించడం మరియు యోని ప్రసవం కోసం సంకోచాల్ని పర్యవేక్షించబడుతుంటాయి. అట్లు కాని కొన్ని సందర్భాల్లో, అంటే యోని ప్రసవంతో సంక్లిష్టతలను ఎదుర్కోబోయే కొన్ని సందర్భాల్లో, ప్రసవానికి ఆపరేషన్ నిర్వహించబడుతుంది. నెలలు నిండని ప్రసవం శిశువుకు హాని కలిగించే సందర్భాల్లో, సంకోచాల్ని తగ్గించడానికి మరియు ప్రక్రియను తగ్గించడానికి తల్లికి కొన్ని మందులు ఇవ్వబడతాయి. పురిటినొప్పుల్ని, ప్రసవాన్ని ఆలస్యం చేసేందుకుగాను టోక్యోటిక్స్ లేదా మెగ్నీషియం సల్ఫేట్ ను గర్భవతి తల్లికి ఇవ్వబడుతాయి.

సకాలప్రసవం అనేది గర్భిణి స్త్రీ తన చుట్టూ ఉండే హితుల నుండి పొందే శ్రద్ధ, సంరక్షణలపై ఆధారపడి ఉంటుంది. సకాల ప్రసవం, తదనుగూనంగా ఆరోగ్యకరమైన తల్లి-బిడ్డ క్షేమం అనేవి గర్భవతి తల్లి చుట్టూ ఉండే హితులు-సన్నిహితులు తీసుకునే సంరక్షణ, శ్రద్ధాసక్తులపైనే ఆధారపడి ఉంటాయి, ప్రసవ సమయంలో గర్భవతిపట్ల ఈ సంరక్షణా శ్రద్ధాసక్తులు లోపిస్తే పరిణామం కష్టమవుతుంది, చాలా అవాంఛిత లేదా ఆకస్మిక ప్రమాద పరిస్థితులకు దారితీస్తుంది, తత్ఫలితంగా ప్రసవం ఓ సవాలుగా మారుతుంది.



వనరులు

  1. American Pregnancy Association. [Internet]; Premature Labor.
  2. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Preterm Birth
  3. Eunice Kennedy Shriver National Institute of Child Health and Human; National Health Service [Internet]. UK; What are the risk factors for preterm labor and birth?
  4. Eunice Kennedy Shriver National Institute of Child Health and Human; National Health Service [Internet]. UK; Preterm Labor and Birth: Condition Information
  5. National Health Portal [Internet] India; Preterm birth
  6. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Preterm labor
  7. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Premature infant
  8. Better health channel. Department of Health and Human Services [internet]. State government of Victoria; Pregnancy - premature labour

నెలలు నిండని కాన్పు కొరకు మందులు

Medicines listed below are available for నెలలు నిండని కాన్పు. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.