అరికాలి వాపు (ప్లాంటర్ ఫాస్సైటిస్) అంటే ఏమిటి?
అరికాలి అడుగుభాగాన్ని అంటిపెట్టుకుని ఉండే మందమైన కండర కణజాలం యొక్క పొరనే ప్లాంటర్ ఫాస్సైటిస్అంటారు. ఈ అరికాలి కండరపొర వింటి తాడు (bowstring) ను పోలి ఉంటుంది, ఎందుకంటే ఇది మడిమ ఎముకను అరికాలివేళ్ళను కలుపుతూ ఏర్పడి ఉంటుంది కాబట్టి. అరికాలితో లోని ఈ ప్లాంటర్ ఫ్లాస్సీయ పోర యొక్క వాపునే “ప్లాంటర్ ఫాస్సిటిస్” అని పిలుస్తారు. ఇది చాలా తరచుగా నివేదించబడిన అరికాలి వైద్య ఫిర్యాదులలో ఒకటి మరియు ఇది వ్యక్తిని చాలా దుర్బలునిగా (డిసేబుల్) మార్చగలదు.
దీని ప్రధాన సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
స్నాయువు యొక్క వాపు వలన ఈ రుగ్మత సంభవించినందున, అరికాలి వాపు (ఫాసిసిటిస్) యొక్క ప్రాధమిక లక్షణం మడమ నొప్పి మరియు మడమ ప్రాంతంలో నొప్పి, ఈ నొప్పి మడమ ప్రాంతంలో ఎరుపుదేలి ఉండడం మరియు వాపుదేలి ఉండే లక్షణాలతో కూడుకుని ఉండవచ్చు. నొప్పిని కొన్నిసార్లు మండే అనుభూతిగా భావించవచ్చు. నొప్పి పదునైనదిగాను లేదా మందకొడిగా ఉండవచ్చు. సాధారణంగా, ఉదయం పాదాల మీద నిలబడిన తర్వాత ఈ నొప్పి అనుభవంలోకి వస్తుంది.
నడవడం, పరుగెత్తడం, లేదా మెట్లు ఎక్కడం వంటి శారీరక కార్యకలాపాల కోసం పాదాన్ని ఎక్కువగా ఉపయోగించడంవల్ల ఈ నొప్పి తీవ్రతరం కావచ్చు.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
ప్లాంటర్ ఫాస్సైటిస్ కిందివాటి వల్ల కలుగవచ్చు:
- క్రీడలో పాల్గొన్నపుడు మడమ ఎముకపై ప్రయాస కల్గడం.
- వ్యక్తి అధిక బరువును కల్గి ఉండటం.
- దీర్ఘ వ్యవధులపాటు నిలబడుటవల్ల.
- సుదీర్ఘకాలంపాటు ఎత్తు మడమల పాదరక్షలు ధరించుటవల్ల.
- పాదాల వంపు (arch of the foot) కు తక్కువ మద్దతు ఇచ్చే పాదరక్షలు ధరించడంవల్ల.
- అధికంగా పరుగు పెట్టడంవల్ల.
- దూకినపుడయ్యే (జంపింగ్) గాయం.
- మడమ చీలిక (అస్థి పెరుగుదల).
ఆర్థరైటిస్ వంటి కొన్ని వ్యాధులు అరికర్ ఫాస్సైటిస్ ప్రమాదాన్ని పెంచుతాయి.
దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
ఈ రుగ్మతను నిర్ధారించడానికి, డాక్టర్ మొదట నొప్పి ఏవిధంగా ప్రారంభమైంది మరియు నొప్పి తీవ్రత గురించి మరియు ఇటీవల వ్యక్తి ఏ ఏ కార్యకలాపాలలో పాల్గొనడం జరిగిందన్న విషయం గురించి విచారణ చేస్తాడు. వ్యాధి లక్షణాలు మరియు వ్యక్తి యొక్క భౌతిక పరీక్ష యొక్క వివరణ వైద్యుడు వ్యాధిని గుర్తించడానికి సహాయం చేస్తుంది. డాక్టర్ కింది చిహ్నాలు కోసం చూస్తుంది:
- ఎర్రగా మారుతుంది.
- వాపు లేదా మంట .
- పెడసరం (బిరుసుదనం)
ఎక్స్-రే వంటి ఒక ఇమేజింగ్ పరీక్షను రోగనిర్ధారణను నిర్ణయించడానికి మరియు ఏవైనా అంతర్లీన రుగ్మతల్ని గుర్తించడం కోసం నిర్వహించవచ్చు.
అరికాలి ఫస్సిటిస్ చికిత్సకు, వైద్యుడు నొప్పి తగ్గించే మందులను సూచించవచ్చు, ఇది వాపును తగ్గిస్తుంది మరియు తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది. ఇతర చర్యలు:
- విశ్రాంతి.
- ఇతర శారీరక శ్రమకార్య కలాపాల్ని చేయడం లేదా రాత్రి నిద్రపోతున్నప్పుడు రాత్రిపూట బద్దీ (night splints) ఉపయోగించడం.
- సౌకర్యవంతమైన పాదరక్షలు ధరించడం.
స్నాయువు ఒత్తిడి నుండి తిరిగి కోలుకోవడంతో సమయం గడిచే కొద్దీ వ్యాధి లక్షణాలు తగ్గిపోయి తిరిగి బాగయిపోతుంది.
కొన్ని సందర్భాల్లో, శస్త్రచికిత్స అవసరమవుతుంది.
స్వీయ రక్షణ చర్యల్లో భాగంగా, వాపు మరియు నొప్పిని తగ్గించడానికి పాదాల్ని 15-20 నిమిషాల పాటు వేడినీటితో నింపిన తొట్టెలో నానబెట్టే ప్రక్రియ ఉంటుంది.