ప్లేగు వ్యాధి - Plague in Telugu

Dr. Ajay Mohan (AIIMS)MBBS

December 21, 2018

March 06, 2020

ప్లేగు వ్యాధి
ప్లేగు వ్యాధి

ప్లేగు వ్యాధి అంటే ఏమిటి?

ప్లేగు వ్యాధి మానవులను మరియు ఇతర క్షీరదాలను (mammals, పిల్లలకు పాలిచ్చి పెంచే జీవులు) ప్రభావితం చేసే చాలా అధికంగా వ్యాపించే ఒక బ్యాక్టీరియల్ వ్యాధి. మధ్యయుగంలో ఐరోపాలో లక్షలాది మంది ప్రజలు ఈ వ్యాధి వలన మరణించారు. ఈ వ్యాప్తి  బ్లాక్ డెత్ (Black Death) అని పిలువబడింది. ప్రస్తుతం, యునైటెడ్ స్టేట్స్ యొక్క పశ్చిమ ప్రాంతంలో మానవ ప్లేగు వ్యాధి (human plague) ఇంకా అక్కడక్కడా సంభవిస్తూ ఉన్నది, అయితే ఆఫ్రికా మరియు ఆసియాలోని మారుమూల ప్రాంతాలలో దీని సంభావ్యత ఎక్కువగా ఉంది.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

ప్లేగు వ్యాధిలో మూడు రకాలు ఉన్నాయి మరియు వ్యాధి యొక్క రకం ఆధారంగా లక్షణాలు మారుతూ ఉంటాయి.

  • బుబోనిక్ ప్లేగు వ్యాధి (Bubonic plague), ఇది టోన్సిల్స్ మరియు ప్లీహము (స్ప్లీన్)కు తీవ్రమైన వాపును కలిగిస్తుంది దాని ఫలితంగా జ్వరం, శరీర నొప్పులు, గుండ్రంగా ఉండే పుండ్లు ఏర్పడడం మరియు శోషరస కణుపులలో (లింఫ్ నోడ్లలో) సున్నితత్వం వంటి లక్షణాలు సంభవిస్తాయి. ఈ రకమైన ప్లేగు శోషరస కణుపుల (లింఫ్ నోడ్ల) నుండి శరీర ఇతర భాగాలకు వ్యాప్తి చెందుతుంది.
  • సెప్టిక్ఎమిక్ ప్లేగు వ్యాధి (Septicaemic plague) తీవ్రమైన బలహీనత, జ్వరం, చలి, తీవ్ర కడుపు నొప్పి, మరియు పై భాగాలు నల్లబడటం వంటి లక్షణాలకు దారితీస్తుంది. ఎక్కువగా ఈ రకమైన ప్లేగు బుబోనిక్ ప్లేగు వ్యాధికి చికిత్స చేయకపోవడం వల్ల సంభవిస్తుంది.
  • ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో కష్టం, నిరంతర దగ్గు, మరియు న్యుమోనియా వంటి లక్షణాలను న్యుమోనిక్ ప్లేగు వ్యాధి (Pneumonic plague) వ్యాధి కలిగిస్తుంది.

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

ఈ సంక్రమణ ఎర్సినియా పెస్టిస్ (Yersinia pestis) అనే బాక్టీరియా వలన వస్తుంది, ఇది ముఖ్యంగా ఎలుకలు మరియు గుమ్మడి పురుగుల (fleas) లో కనిపిస్తుంది. వ్యాధి సంక్రమిత ఎలుకలు లేదా పురుగులు కుట్టడం వలన ఈ బ్యాక్టీరియా మానవులకు మరియు ఇతర క్షీరదాలకు వ్యాపిస్తుంది. డైరెక్ట్ కాంటాక్ట్ (నేరుగా తాకడం) వలన కూడా ఈ వ్యాధి వ్యాపిస్తుంది.

దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

రక్తం మరియు వ్యాధి సోకిన కణజాల నమూనాల ఆధారంగా ప్లేగు వ్యాధి యొక్క ఉనికిని నిర్ధారించడానికి అనేక రోగనిర్ధారణ పరీక్షలు నిర్వహించబడతాయి. ఇది ఒక గమనింపదగిన వ్యాధి మరియు దీని వ్యాప్తిని నివారించడానికి వెంటనే స్థానిక వైద్య అధికారులకు నివేదించాలి.

ప్లేగు ఒక తీవ్రమైన అనారోగ్యం మరియు దీనికి తక్షణ చికిత్స అవసరం. వైద్య అధ్యనాలలో పురోగతి కారణంగా, ఇప్పుడు యాంటీబయాటిక్స్ సహాయంతో ప్లేగు వ్యాధికి చికిత్స చేయవచ్చు. ప్రారంభ దశలలో గుర్తించడం మరియు తక్షణ చికిత్సతో త్వరగా నయమయ్యే అవకాశాలు పెరుగుతాయి.

వ్యాధి సోకిన వ్యక్తికి శ్రద్ధ తీసుకునే వ్యక్తులను కూడా పరిశీలనలో ఉంచాలి మరియు సంక్రమణను నివారించడానికి  నేరుగా తాకడాన్ని నివారించాలి. ఇప్పటి వరకు దీనికి టీకా (vaccine) అందుబాటులో లేదు.



వనరులు

  1. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Diagnosis and Treatment.
  2. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Symptoms.
  3. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Plague.
  4. National Institute of Allergy and Infectious Disease. [Internet]. U.S. Department of Health & Human Services; Plague.
  5. National Health Portal [Internet] India; Plague.