పింటా అంటే ఏమిటి?
అజ్యుల్ (Azul), టినా (Tina) మరియు లోటా (Lota) వంటి ఇతర పేర్లతో కూడా పింటా వ్యాధిని పిలుస్తారు, ఇది అరుదైన సంక్రమణ వ్యాధి. ఇదొక చర్మ వ్యాధి. ఈ వ్యాధి మొట్టమొదట పదహారవ శతాబ్దంలో మెక్సికోలోని ప్రజలకు వచ్చినట్లు నివేదించబడింది. ప్రస్తుత కాలంలో పింటా యొక్క ప్రాబల్యం చాలా అరుదుగా మారింది కాబట్టి బాగా నివేదించబడలేదు.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
పింటా మూడు దశలలో వ్యక్తిని దెబ్బ తీస్తుంది:
- ప్రారంభ దశలో, వ్యక్తి చేతులు మరియు కాళ్ళు మరియు శరీరం యొక్క ఇతర భాగాలలో ఎరుపు మచ్చలు మరియు గాయాలు అభివృద్ధి చెందుతాయి. ఈ మచ్చలు దురదను కలిగించొచ్చు మరియు పెద్ద పరిమాణంలో పెరుగుతాయి.
- ఈ వ్యాధి ద్వితీయ దశ పింటిడ్స్ అని పిలువబడే ద్వితీయ చర్మపు విస్పోటనల రూపాన్ని కలిగి ఉంటుంది. ఇవి తొలి గాయాలను కలిగి ఉన్న ప్రాంతాల్లో కనిపిస్తాయి మరియు పొడిగా మరియు కరకరలాడుతుంటాయి.
- పింటా యొక్క చివరి దశ వ్యాధి ప్రారంభమైన 2-5 సంవత్సరాల తరువాత రావచ్చు మరియు తెలుపు లేదా రంగులేని గాయాలు ఏర్పడతాయి. వ్యక్తికి మందపాటి మరియు పొడి చర్మం సంభవిస్తుంది, చర్మం మచ్చలుకల్గి ముడతలు పడి ఉంటుంది..
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
పింటా వ్యాధి ‘ట్రెపోనెమా కార్యేటం’ బాక్టీరియం ద్వారా కలుగుతుంది, మరియు ఈ సూక్ష్మజీవి ప్రత్యక్ష స్పర్శ ద్వారా వ్యాపిస్తుంది. సాధారణంగా వ్యక్తిగత ఆరోగ్య పరిశుభ్రత మరియు పారిశుద్ధ్యం కారణంగా, ఈ జీవి యొక్క ఉనికి మరియు వ్యాప్తి దాదాపుగా తెలియదు. ఏదేమైనప్పటికీ, కొన్ని ఆఫ్రికన్ దేశాల వంటి కొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఈ రుగ్మత ఇప్పటికీ స్థానికంగానే ఉంది.
దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
ప్రారంభ దశలో ఉండే పింటా వ్యాధిని ఇతర చర్మరుగ్మతలేమోనని పొరబడి అయోమయం చెందడం వలన ఈ వ్యాధి నిర్ధారణకు చాలా కాలం పడుతుంది. డాక్టర్ సాధారణంగా వ్యాధి చరిత్ర గురించి వివరంగా అడిగి తెలుసుకుంటాడు, వ్యక్తి ప్రయాణ వివరాల గురించి తెలుసుకుంటాడు, ఎందుకంటే ఈ వ్యాధి ఉండే స్థానిక ప్రాంతంలో నుండి వ్యాధిని వ్యక్తి శోకించుకున్నాడేమోనని డాక్టర్ కు అనుమానం కల్గుతుంది కాబట్టి. ఇతర నిర్ధారణ పరీక్షల్లో ఇవి ఉన్నాయి:
- రక్త పరీక్షలు.
- కణజాల నమూనాల పరీక్ష.
పింటా (Pinta)కు సాధారణంగా యాంటీబయాటిక్స్తో చికిత్స చేయడం జరుగుతుంది, ఇవి బ్యాక్టీరియాను తొలగించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటాయి మరియు తద్వారా వ్యాధి లక్షణాలను తగ్గిస్తాయి. ఆలస్యంగా గుర్తించిన పింటా చికిత్సకు చాలా ఎక్కువ సమయం పడుతుంది. ఈ వ్యాధి యునైటెడ్ స్టేట్స్లో ప్రబలంగా లేదు, కానీ ఉష్ణమండల ప్రాంతాల్లో సంభవిస్తుంది, అందువల్ల ఈ ప్రాంతాల నుండి వచ్చే,పోయే ప్రయాణికులు ఈ వ్యాధి లక్షణాలను వారు అనుభవిస్తే పరీక్షలు చేయించుకోవచ్చు.