పేయిరోనీస్ డిసీస్ - Peyronie's disease in Telugu

Dr. Rajalakshmi VK (AIIMS)MBBS

March 30, 2019

March 06, 2020

పేయిరోనీస్ డిసీస్
పేయిరోనీస్ డిసీస్

పేయిరోనీస్ వ్యాధి అంటే ఏమిటి?

పేయిరోనీస్ వ్యాధి అనేది పురుషాంగం యొక్క అనుసంధాన కణజాల వ్యాధి. ఈ రుగ్మతలో పురుషాంగం వక్రతకు గురవుతుంది. సాగుదల లేని నారకణజాల రూపాలు పురుషాంగం లోపల చోటుచేసుకుని ఉండడంవల్లనే శిశ్న వక్రతకు దారితీస్తుంది. ఈ రుగ్మత కల్గిన వ్యక్తి బాధాకరమైన అంగస్తంభనను అనుభవించవచ్చు, ఇది సంభోగం సమయంలో అతన్ని అసంతృప్తికి గురి చేస్తుంది. ఈ రుగ్మత మానసికంగా ఓ సవాలుగా ఉంటుంది, అందువల్ల, చికిత్స కోసం ఒక నరాల నిపుణుడిని (యూరాలజిస్ట్) సంప్రదించడం ముఖ్యం.

పేయిరోనీస్ వ్యాధి  ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

వక్రతకు గురైన పురుషాంగ జబ్బునే “పేయిరోనీస్ వ్యాధి” గా సూచిస్తారు,  ఈ వ్యాధి క్రింది చిహ్నాలు మరియు లక్షణాలను కల్గిఉంటుంది.

  • పురుషాంగంపై గడ్డలు లేదా కఠిన కణజాలాలు.
  • పురుషాంగంలో వక్రత పైకి మరియు కిందికి కూడా ఉంటుంది.
  • ఈ రుగ్మతతో కూడిన పురుషాంగం ఇసుక గడియారం వంటి ఆకృతిని కల్గి ఉంటుంది.
  • ఇది పురుషాంగాన్ని కురుచయ్యేట్టు చేస్తుంది.
  • నొప్పి.

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

పెయోరోనీ వ్యాధి యొక్క ప్రధాన కారణాలు క్రింది విధంగా ఉంటాయి :

  • పురుషాంగం యొక్క పునరావృత గాయం: క్రీడా కార్యకలాపాల్లో , ప్రమాదం లేదా పునరావృతం సంభోగం సమయంలో పురుషాంగం కు ట్రామా ఫలకం ఏర్పడటానికి దారితీసింది గాయం సైట్ వద్ద ఒక తాపజనక ప్రతిస్పందన దారితీస్తుంది. ఒత్తిడి పరిస్థితి మరింత దిగజారుస్తుంది.
  • రెండవ కారణం వ్యాధి జన్యు బదిలీ.

దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఎలా చేస్తారు?

నరాల నిపుణుడైన వైద్యుడు పురుషాంగాన్ని ప్రధానంగా భౌతిక పరీక్ష ద్వారా రోగ నిర్ధారణ చేయబడుతుంది. పురుషాంగం గాయమైన సమయం, పురుషాంగం స్థిరత్వం యొక్క పురోగతి మరియు మీ లైంగిక జీవితాన్ని ఈ రుగ్మత ఎలా దెబ్బ తీస్తోందో వంటి చరిత్రను గుర్తించడం రోగ నిర్ధారణకు ఉపయోగకరంగా ఉంటుంది.

  • పురుషాంగం మెత్తని స్థితిలో ఉన్నపుడు పట్టి పరీక్షించడం ద్వారా అందులో  కణితులు, గడ్డలు వంటి వాటి పెరుగుదల స్థానాన్ని మరియు పరిమాణం గుర్తించడానికి సహాయపడుతుంది.
  • పురుషాంగం స్తంభన సమయంలో దాని వక్రతను కొలవడం.
  • పరిమాణం, స్థానం మరియు కణజాలాలలో కాల్షియం డిపాజిట్లను నిర్ణయించడం కోసం డ్యూప్లెక్స్ డాప్లర్ పరీక్ష.
  • అల్ట్రాసోనోగ్రఫీ.
  • మధుమేహం లేదా హార్మోన్ల హెచ్చుతగ్గులు ఉన్న వ్యక్తుల వంటి ప్రమాదకర సమూహాల కోసం రక్త పరిశోధనను సూచించవచ్చు.

మీ పురుషాంగం యొక్క వక్రత మీ లైంగిక జీవితాన్ని ఏమాత్రం దెబ్బ తీయడం లేదంటే మీ వైద్యుడు మీకు ఏ చికిత్సను సూచించలేరు. వక్రతతో కూడిన మీ పురుషాంగానికి చికిత్స ఎంపికలు క్రింది విధంగా ఉన్నాయి:

మందులు:

  • పురుషాంగంలోని కంతి యొక్క పరిమాణాన్ని తగ్గించే మందులు పైపూతగాను, మౌఖికంగా లేదా కణితి ఉన్నచోటనే (intra-lesionally) మందును ఎక్కించడం లేదా ఇయోంటోఫొరెటిక్ (iontophoretic) పద్ధతిలో (ఎలెక్ట్రిక్ కరెంట్ ను ఉపయోగించి) చర్మం ద్వారా మందు ఇవ్వబడుతుంది.
  • ఆక్సీకరణ ఒత్తిడి తగ్గించే మందులు.

శస్త్రచికిత్సేతర చికిత్సలు:

  • పెనైల్ ట్రాక్షన్
  • వాక్యూమ్ ఎరెక్టయిల్ డివైస్
  • రేడియేషన్ థెరపీ
  • హైపర్థెర్మియా థెరపీ
  • అదనపు శారీరక (corporeal) షాక్ వేవ్ థెరపీ.

శస్త్ర చికిత్స (సర్జరీ)

పెయిరోనీస్ వ్యాధికి పలు విధాలుగా చికిత్స చేయవచ్చు. సెక్సువల్ కౌన్సెలర్ చేత సరైన మానసిక సలహాలు మరియు ఈ రుగ్మతవల్ల కల్గిన మానసిక ఒత్తిడిని తగ్గించేటందుకు ఓ మాససిక వైద్యుడి శ్రద్ధ, సలహాలు కూడా అవసరమని సూచించబడింది. తక్షణ చికిత్స కోసం మీ వైద్యుడి సరైన వైద్య సలహా కోరడం మంచిది.



వనరులు

  1. Gianni Paulis et al. Recent Pathophysiological Aspects of Peyronie's Disease: Role of Free Radicals, Rationale, and Therapeutic Implications for Antioxidant Treatment—Literature Review. Adv Urol. 2017; 2017: 4653512. PMID: 28744308
  2. Ailyn Bilguty and Alaexander W Pastuszak. Peyronie’s Disease: A review of etiology, diagnosis and Management. Curr Sex Health Rep. 2015 Jun 1; 7(2): 117–131. PMID: 26279643
  3. Oliver Kayes and Rauf Khadr. Recent advances in managing Peyronie’s disease. Version 1. F1000Res. 2016; 5: F1000 Faculty Rev-2372. PMID: 27746896
  4. Franklin E Kuehas et al. Peyronie’s Disease: Nonsurgical Therapy Options. Rev Urol. 2011; 13(3): 139–146. PMID: 22110397
  5. Miner MM,Seftel AD. Peyronie's disease: epidemiology, diagnosis, and management. Curr Med Res Opin. 2014 Jan;30(1):113-20. PMID: 24040888