పెరిటోనిటిస్ అంటే ఏమిటి?
పెరిటోనిటిస్ అనేది పెరిటోనియం యొక్క వాపు. పెరిటోనియం అనేది ఉదరకుహరాన్ని ఆవరించి ఉండేపొర. పొత్తికడుపు లోపలి గోడల్లో (లైనింగ్) ఏర్పడిన కణజాలం మరియు కడుపు అవయవాలను రక్షించే పొరనే ‘పెరిటోనియం’ అంటారు. పెర్టోనిటిస్ ఒక సాధారణ రుగ్మతే కానీ తీవ్రమైన పరిస్థితిని కల్గిఉంటుందిది. ఇది బ్యాక్టీరియల్ సంక్రమణ వలన సంభవించవచ్చు లేదా శస్త్రచికిత్స లేదా పెరిటోనియల్ డయాలిసిస్ తెచ్చిపెట్టే సమస్య కావచ్చు ఇది. ఈ రుగ్మతకు వెంటనే చికిత్స చేయబడాలి, చికిత్స చేయకుండా వదిలేస్తే మరింత తీవ్రతరం కావచ్చు.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
సంకేతాలు మరియు లక్షణాలు:
- పొత్తికడుపులో వాపు మరియు సున్నితత్వం.
- పొత్తికడుపులో తీవ్ర నొప్పి.
- జ్వరం మరియు చలి.
- ఆకలి యొక్క నష్టం
- మితిమీరిన దాహం.
- వికారం మరియు వాంతులు
- అపానవాయువు (గ్యాస్) మరియు మలవిసర్జనలో అసమర్థత.
- పొత్తికడుపు ఉబ్బరం.
- స్థితి నిర్ధారణ రాహిత్యము.
- విరామము లేకపోవటం.
- షాక్.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
పెర్టోనిటిస్ యొక్క అత్యంత సాధారణ కారణం ఒక తీవ్రమైన బాక్టీరియల్ సంక్రమణం. ఈ సంక్రమణం ప్రాధమికమైన కారణమో (ఏదైనా అంతర్లీన వ్యాధి లేకుండా) లేదా రెండవ కారణమో కావచ్చు. ఈ సంక్రమణ ఇతర అవయవాల నుండి లేదా శరీరభాగం నుండి వ్యాపిస్తుంది. అయినప్పటికీ, పెర్టోనిటిస్ కు దారితీసే అనేక ఇతర కారణాలు ఉండవచ్చు. పెర్టోనిటిస్ యొక్క ఇతర కారణాలు క్రింది విధంగా ఉన్నాయి:
- పొత్తికడుపు గాయం లేదా పుండు.
- పెరిటోనియల్ డయాలిసిస్ - డయాలిసిస్ ఆఫ్ పెరిటోనియల్ ఫ్లూయిడ్, అక్కడ ఉన్న ద్రవం ఒక యంత్రాన్ని ఉపయోగించి ఫిల్టర్ చేయబడుతుంది.
- కడుపు శస్త్రచికిత్స.
- అపెండిసైటిస్.
- కడుపు పూతలు (stomach ulcers)
- క్రోన్స్ వ్యాధి- ఒక రకం ప్రేగు శోథ వ్యాధి
- క్లోమము లేదా పొత్తికడుపు యొక్క వాపు
- పిత్తాశయం లేదా ప్రేగు యొక్క సంక్రమణ.
- డయాసిసిస్ తర్వాత ఫంగల్ ఇన్ఫెక్షన్.
- ఆహార ట్యూబ్ ఉపయోగించడం.
దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
పైన పేర్కొన్న లక్షణాలు ఏవైనా ఉంటే మీ డాక్టర్ ను వెంటనే కలిసి సలహా తీసుకోవాలి. రోగనిర్ధారణ వైద్య చరిత్ర అంచనాతో రోగ నిర్ధారణ పరీక్ష ప్రారంభమవుతుంది. రోగనిర్ధారణకు కింద సూచించిన పరీక్షలుంటాయి:
- ఉదరం యొక్క భౌతిక పరీక్ష.
- రక్త పరిశోధన
- పెరిటోనియం ను దెబ్బ తీసే బ్యాక్టీరియాను తెలుసుకోవటానికి రక్తం సంస్కృతి (blood culture) పరీక్ష.
- ఉదర ద్రవ విశ్లేషణ.
- డీయాలిసిస్ ప్రసరించే విశ్లేషణ, మీరు పెరిటోనియల్ డయాలిసిస్లో ఉంటే.
- అల్ట్రాసౌండ్ ఇమేజింగ్.
- CT స్కాన్లు మరియు X- కిరణాలు పెరిటోనియంలోని రంధ్రాలను గుర్తించడానికి.
- లాపరోస్కోపీ - కారణం వెతకడానికి ఉదరం లోపల అన్వేషించడానికి ఒక కెమెరా-బిగించిన గొట్టం ఉపయోగించి చేసే పరీక్ష.
సంక్రమణ బహుళ అవయవ వైఫల్యానికి దారితీసే ప్రమాదముంది గనుక పెర్టోనిటిస్కు తక్షణ చికిత్స అవసరం. చికిత్స పద్ధతులు క్రింది విధంగా ఉన్నాయి:
- మందులు: యాంటీబయాటిక్స్, యాంటీ ఫంగల్స్.
- సోకిన కణజాలం తొలగించడానికి శస్త్రచికిత్స.
- ఉదర భాగంలో కడగడానికి మరియు వాపు మరియు సంక్రమణను తగ్గించడానికి ఇంట్రా-ఉదర కందరి (intra-abdominal lavage).
- కొందరు రోగులకు తిరిగి లాపరోటమీ అవసరమవుతుంది (ఓపెన్ శస్త్రచికిత్స). అసాధారణతల్ని గుర్తించటానికి ఉదర కుహరంలో తాజాగా కోత పెట్టి ఈ శస్త్రచికిత్స చేస్తారు.
చికిత్స చేయకుండా వదిలేస్తే, సెప్టిసిమియా (శరీరంలోని రక్తానికంతకూ సంక్రమణ వ్యాప్తి) మరియు షాక్ వంటి సమస్యలకు పెర్టోనిటిస్ వ్యాప్తి చెందుతుంది. ఇది పొత్తికడుపుచీము లేదా కణజాల మరణం ఏర్పడటానికి దారితీయవచ్చు, ఇది ప్రాణాంతకం కావచ్చు. అందువల్ల, పెర్టోనిటిస్ యొక్క ఏదైనా సంకేతం లేదా లక్షణాన్ని గుర్తించిన వెంటనే శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం, వెంటనే మీ డాక్టర్ను సంప్రదించండి.