పారాకోక్సిడియోడోమైకోసిస్ అంటే ఏమిటి?
పారాకోక్సిడియోడోమైకోసిస్ అనేది ఒక ఫంగల్ వ్యాధి, ఇది ముందుగా ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది మరియు క్రమముగా చర్మం మరియు ఇతర శరీర భాగాలకు వ్యాపించవచ్చు. పారాకోక్సిడియోడోమైకోసిస్కు చికిత్స చేయకుండా వదిలేస్తే అనేది ప్రాణాంతకము కావచ్చు. అయితే, ఇది ఒక అరుదైన ఫంగల్ వ్యాధి. సాధారణంగా ఈ వ్యాధిని లోబో వ్యాధి (Lobo disease) లేదా పిసిఎం (PCM) అని పిలుస్తారు.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
పారాకోక్సిడియోడోమైకోసిస్ ప్రధానంగా చర్మం మరియు ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. దాని లక్షణాలు ఈ క్రింది విధంగా ఉంటాయి:
- ఆకస్మికంగా మరియు వేగవంతముగా బరువు తగ్గిపోవుట.
- శోషరస కణుపులలో (లింఫ్ నోడ్ల)వాపు.
- లింఫ్ నోడ్స్ లో చీము లేదా ద్రవం చేరడం.
- నిరంతర దగ్గు.
- జ్వరం.
- శ్వాస తీసుకోవడంలో సమస్య.
- అలసట.
- కాలేయం విస్తరించడం/పెరగడం.
- ప్లీహము(స్ప్లీన్) విస్తరించడం/పెరగడం.
- నోరు మరియు గొంతులో పుండ్లు.
పారాకోక్సిడియోడోమైకోసిస్ పిల్లలకు సంక్రమించినప్పుడు వారు చర్మపు పుండ్లు మరియు శోషరస కణుపుల (లింఫ్ నోడ్ల) లో వాపు వంటి లక్షణాలను కలిగి ఉంటారు. పెద్దలలో, ఊపిరితిత్తులు ప్రభావితం కావచ్చు మరియు లక్షణాలు ప్రభావిత భాగాలకు అనుగుణంగా మారవచ్చు.
ఈ ఇన్ఫెక్షన్/సంక్రమణ సంపూర్ణ ఆరోగ్యవంతులైన వ్యక్తులలో సంభవించవచ్చు. ఏమైనప్పటికీ, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ ఉండే వ్యక్తులలో లక్షణాలు మరింత తీవ్రంగా ఉంటాయి.
చాలా కొద్దిమంది సంక్రమిత వ్యక్తులలో, పారాకోక్సిడియోడోమైకోసిస్ యొక్క లక్షణాలు అసలు కనిపించవు.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
పారాకోక్సిడియోడోమైకోసిస్ అనేది పెరాకోక్సిడియోడీస్ బ్రాసిలీన్సిస్ (Paracoccidioides brasiliensis) అనే ఫంగస్ వలన సంభవిస్తుంది. గాలిలో ఉండే ఫంగల్ స్పోర్స్ (బీజాంశంలు) గాలి/శ్వాస పీల్చే సమయంలో ఒక వ్యక్తి యొక్క శరీరంలోకి ప్రవేశిస్తాయి. స్పోర్స్ ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించినప్పుడు, అవి క్రియాశీల ఫంగస్లుగా (active fungi) మారతాయి, అప్పుడు అవి ఇతర శరీర భాగాలకు వ్యాపిస్తాయి.
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
ఈ సంక్రమణ యొక్క నిర్ధారణ కోసం వ్యక్తి/రోగి నుండి సేకరించిన కఫం లేదా చీము నమూనాల యొక్క ప్రయోగశాల విశ్లేషణ (laboratory analysis) అవసరం. రోగ నిర్ధారణను దృవీకరించడానికి కణజాల నమూనాను మైక్రోస్కోప్ ద్వారా కూడా పరిశీలించవచ్చు.
ఈ పరిస్థితిని నిర్ధారించడంలో రక్త పరీక్షలు కూడా సహాయపడతాయి. సంక్రమణ యొక్క తీవ్రతను గుర్తించడానికి మరియు ఊపిరితిత్తులలో ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్న ప్రాంతాలను గుర్తించడానికి వైద్యులు ఛాతీ ఎక్స్-రేలను కూడా నిర్వహించవచ్చు.
పారాకోక్సిడియోడోమైకోసిస్కు యాంటీ ఫంగల్ ఔషధాల/మందుల సహాయంతో సమర్థవంతంగా చికిత్స చేయవచ్చు, ఉదాహరణకు ఇట్రాకోనజోల్ (itraconazole) మరియు ఎంఫోటెరిసిన్ బి (amphotericin B) వంటి మందులు. ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తి యొక్క శరీరము నుండి ఫంగస్ను పూర్తిగా తొలగించడానికి ఒక సంవత్సరం వరకు చికిత్సను కొనసాగించాలి.