క్లోమవాపు (ప్యాంక్రియాటిస్) అంటే ఏమిటి?
జీర్ణ రసాయనికామ్లద్రవాలు (ఎంజైములు) మరియు హార్మోన్లు క్లోమము ద్వారా స్రవిస్తాయి. కొన్నిసార్లు, జీర్ణ రసాయనికామ్లద్రవాలు (జీర్ణ ఎంజైములు) నొప్పి, మంటకు కారణమయ్యే క్లోమం యొక్క అంతర్గత గోడలకు హాని కలిగిస్తాయి, నొప్పికారకమైన ఈ రోగలక్షణ పరిస్థితినే క్లోమశోథ లేక ప్యాంక్రియాటైటిస్ గా పిలువబడుతుంది. క్లోమ శోథ తీవ్రమైనదిగా లేదా దీర్ఘకాలికంగా ఉంటుంది. జీర్ణాశయ వ్యాధుల్లో క్లోమశోథ (పాంక్రియాటిటిస్) చాలా సాధారనమైన రుగ్మత కాదు, అందువలన దీనికి ఆసుపత్రిలో తక్షణ వైద్య చికిత్స అవసరం అవుతుంది.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
సాధారణ చిహ్నాలు మరియు లక్షణాలు కొన్ని:
- పొత్తికడుపు పైభాగాన మరియు నడుము మీద తీవ్రమైన నొప్పి
- పొత్తికడుపు వాపు
- వికారం
- వేగవంతమైన హృదయ స్పందన
- వాంతులు
- జ్వరం
- అతిసారం
- బరువు నష్టం
- ఊపిరి ఆడకపోవడం
- క్లోమము లేదా పిత్తాశయపు నాళాలకు ఆటంకం (అడ్డు) ఏర్పడడం
- కూలిపోవడం
- అధికంగా చెమట పట్టడం
దీనికి ప్రధాన కారణాలు ఏమిటి?
ప్యాంక్రియాటైటిస్ యొక్క సాధారణ కారణాలు:
- మద్యపానం
- పిత్తాశయ రాళ్ళు
- క్లోమము యొక్క వారసత్వ సమస్యలు
- ఔషధాల దుష్ప్రభావాలు
- కడుపు గాయం
- క్లోమం (ప్యాంక్రియాటిక్) క్యాన్సర్
- హైపర్ గ్లైసీమియా మరియు హైపర్ ట్రైగ్లిజరిడెమియా
- గవదబిళ్లలు
దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
క్లోమశోథ (ప్యాంక్రియాటైటిస్)లో 2 రకాలున్నాయి - తీవ్రమైన క్లోమ వాపు/శోథ మరియు దీర్ఘకాలిక క్లోమ వాపు/శోథ అనేవే ఆ రెండు రకాలు. పొత్తికడుపులో ఆకస్మికంగా తీవ్రమైన గాయం అయినప్పుడు తీవ్రమైన క్లోమ శోథ (పేట్రియాటిస్ ఏర్పడుతుంది. ఇది గుండె లేదా మూత్రపిండాల వైఫల్యానికి దారితీస్తుంది. దీర్ఘకాలిక క్లోమ శోథ (క్రోనిక్ ప్యాంక్రియాటైటిస్) మితి మీరిన మద్యపానం వల్ల సంభవిస్తుంది. క్లోమశోధ చాలా కాలం పాటు సంభవిస్తుంది మరియు మెరుగుదల మరియు మానే అవకాశాలు సాధారణంగా తక్కువగా ఉంటాయి. రోగ నిర్ధారణను ధృవీకరించడానికి శారీరక పరీక్ష వరుస వైద్య విచారణల ద్వారా జరుగుతుంది.
క్లోమశోధ (ప్యాంక్రియాటైటిస్) యొక్క రోగనిర్ధారణను కిందివాటి ద్వారా చేయవచ్చు:
- ఎంఆర్ఐ (MRI) స్కాన్ - దీని ద్వారా నాళాల యొక్క చిత్రాలను గమనించిన తర్వాత వ్యాధి యొక్క అసలు కారణం గురించి ఇది వైద్యులకు సమాచారాన్ని అందిస్తుంది.
- పొత్తి కడుపు యొక్క అల్ట్రాసౌండ్ - ఇది పిత్తాశయంలోని రాళ్ళను గుర్తించడంలో సహాయపడుతుంది.
- సిటి (CT) స్కాన్ - ఇది గ్రంధి యొక్క 3-D చిత్రాలను తీసుకోవడంలో సహాయపడుతుంది.
- ప్యాంక్రియాటైటిస్ నిర్ధారణకు ఎక్స్-రే, మరియు అమలేస్ స్థాయి రక్త పరీక్షలు వంటి మరి కొన్ని పరీక్షలు జరుగుతాయి.
రోగనిర్ధారణ తరువాత, దీనిని కింద పేర్కొన్నటువంటి వివిధ పద్ధతులు ద్వారా చికిత్స చేస్తారు:
- శస్త్రచికిత్స - సాధారణంగా, రాళ్ళను గుర్తించిన తర్వాత పిత్తాశయం తొలగించబడుతుంది. అలాగే, క్లోమములో గాయపడిన భాగాల్ని వీలైతే తీసివేయబడతాయి.
- ఎండోస్కోపీ - పిత్తాశయంలో రాళ్ళను తొలగించడానికి.
- ఇంట్రవీనస్ (నరాలకు ఎక్కించే) ద్రవాలు - ఇవి వాపును పరిష్కరించడానికి సహాయపడుతాయి.
- నొప్పి నివారణ కోసం నొప్పి నివారణలు (analgesics) (నొప్పి నివారణలు).
ఆసుపత్రిలో చికిత్స ద్వారా తీవ్రమైన క్లోమం వాపు మంట (ప్యాంక్రియాటైటిస్) వ్యాధి నియంత్రించబడిన తర్వాత ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాక కింద సూచించిన జీవనశైలి (లైఫ్స్టయిల్) మార్పులు పాటించడం తప్పనిసరి.
- మద్యపానం మానివేయడం
- కొవ్వు పదార్ధాలను తినకుండా విసర్జించడం.